Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
ఇంట్లో ఉండే వాటితోనే..నిమిషాల్లో నోరూరించే ఎగ్ కబాబ్స్
సాధారణంగా మనం గుడ్లతో ఆమ్లెట్, ఎగ్ బుర్జీ, ఎగ్ కర్రీ లేదా బిర్యానీ వంటివి రెగ్యులర్ గా చేస్తుంటాం. కానీ ఎప్పుడూ ఒకే రకమైన వంటకాలు తిని మీకు బోర్ కొట్టిందా? ఏదైనా కొత్తగా,నాలుకకు రుచిగా ఉండేలా స్పైసీగా తినాలనిపిస్తోందా? అయితే ఎగ్ కబాబ్ ట్రై చేయాల్సిందే.
సాధారణంగా కబాబ్ అనగానే మనకు చికెన్ లేదా మటన్ గుర్తొస్తుంది. కానీ కేవలం గుడ్లతో, ఇంట్లో ఉండే సాధారణ పదార్థాలతో రెస్టారెంట్ స్టైల్ కబాబ్‌లను చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. సాయంత్రం పూట స్నాక్ లా తినడానికైనా లేదా భోజనంలో సైడ్ డిష్ గా వడ్డించడానికైనా ఈ ఎగ్ కబాబ్స్ అదిరిపోతాయి. నోరూరించే ఎగ్ కబాబ్‌లను ఎలా తయారు చేయాలో, దీనికి కావాల్సిన పదార్థాలేంటో ఇక్కడ చూడండి.

కావలసిన పదార్థాలు
-గుడ్లు
-శనగ పిండి
-మైదా పిండి
-మొక్కజొన్న పిండి
-బియ్యం పిండి
-కారం
-గరం మసాలా
-ధనియాల పొడి
-పసుపు
-అల్లం వెల్లుల్లి పేస్ట్
-తాజా పెరుగు
-రుచికి సరిపడా ఉప్పు
-నూనె
తయారీ విధానం
-ముందుగా కోడిగుడ్లను ఉడికించి పక్కన పెట్టుకోవాలి.
-ముందుగా ఒక వెడల్పాటి గిన్నెలో శనగపిండి, మైదా, మొక్కజొన్న పిండి, బియ్యం పిండిని సమాన కొలతల్లో(అన్నీ 2 స్పూన్లు)తీసుకోండి. ఇందులోనే ఒక చెంచా కారం, ఒక చెంచా ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, రెండు చెంచాల పెరుగు , ఉప్పు వేసి బాగా కలపాలి.
-ఇప్పుడు అందులో అవసరమైనంత నీటిని కొద్దికొద్దిగా పోస్తూ, పిండిని ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఈ పిండి మరీ పల్చగా ఉండకూడదు, అలాగని మరీ గట్టిగా ఉండకూడదు. బజ్జీల పిండిలా గుడ్డుకి పట్టుకునేలా చిక్కగా ఉండాలి.
-ముందుగా ఉడికించి పెట్టుకున్న గుడ్ల పై పెంకు తీసేసి వాటిని నిలువుగా రెండు ముక్కలుగా లేదా నాలుగు ముక్కలుగా కోసి పెట్టుకోవాలి. మరీ చిన్న ముక్కలుగా కోస్తే వేయించేటప్పుడు విడిపోయే అవకాశం ఉంది.
-స్టవ్ మీద పాన్ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసి బాగా వేడి చేయాలి. నూనె కాగిన తర్వాత కోసి పెట్టుకున్న గుడ్డు ముక్కలను ఒక్కొక్కటిగా పిండి మిశ్రమంలో ముంచాలి. పిండి గుడ్డు ముక్కకు బాగా పట్టేలా చూసుకుని, జాగ్రత్తగా నూనెలో వేయాలి.
-మీడియం మంట మీద గుడ్లు బంగారు రంగులోకి వచ్చేంత వరకు వేయించుకోవాలి. వేగిన తర్వాత వాటిని జాలి గరిటెతో తీసి టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్ లోకి తీసుకోవాలి.
-అంతే గుమగుమలాడే వేడి వేడి ఎగ్ కబాబ్స్ రెడీ. వీటిపై కొద్దిగా చాట్ మసాలా చల్లి, ఉల్లిపాయ ముక్కలు, నిమ్మకాయ రసంతో సర్వ్ చేస్తే.. ఆ రుచిని ఎవరూ వదిలిపెట్టరు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications