Latest Updates
-
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు! -
కరలాడే టమాటా మురుకులు.. ఒక్కసారి రుచి చూస్తే అస్సలు వదిలిపెట్టరు! -
రోజు తినే పెరుగన్నమే కదా అని తీసిపారేయకండి.. ఇలా స్పెషల్ గా చేస్తే గిన్నె ఖాళీ అవ్వాల్సిందే! -
హోటల్ స్టైల్ రాయల్ కొబ్బరి చట్నీ.. ఈ ఒక్క సీక్రెట్ పదార్థం కలిపితే రుచి అదుర్స్!
Winter soup: చలికాలంలో మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచే సూప్..కూల్ వెదర్ లో హాట్ హాట్ గా తాగితే ఆ మజానే వేరు
చలికాలంలో ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే చలికాలంలో అనేక అంటువ్యాధులు,ఇన్ఫెక్షన్లు మనల్ని చుట్టుముట్టే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో సరైన ఆహారం అవసరం. చలికాలంలో మనల్ని ఆరోగ్యంగా ఉంచడంలో చికెన్ సూప్(chicken soup) చాలా ఉపయోగపడుతుంది. చికెన్ సూప్ శతాబ్దాలుగా ఒక ప్రసిద్ధ ఆహారం. ఇది రుచికరమైనది మాత్రమే కాదు,పోషకాలతో నిండి ఉండి ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలను అందిస్తుంది.
ముఖ్యంగా చలికాలంలో చికెన్ సూప్ తాగడం చాలా ప్రయోజనకరం. రుచికరమైన చికెన్ సూప్ ను ఇంట్లోనే చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. చికెన్ సూప్ తయారీకి కావాల్సిన పదార్థాలు,తయారీ విధానం ఇక్కడ చూడండి.
చికెన్ సూప్ తయారీకి కావాల్సిన పదార్థాలు
-చికెన్
-ఉల్లిపాయ
-అల్లం
-క్యారెట్
-ఆయిల్
-ఉప్పు
-మిరియాల పొడి
-వెనిగర్
-చిల్లి సాస్
-టమాటో సాస్
-కోడి గుడ్డు
-కార్న్ ఫ్లోర్
-కొత్తిమీర
చికెన్ సూప్ తయారీ విధానం
-ముందుగా స్టవ్ ఆన్ ఒక పెద్ద పాత్రలో నూనె లేదా నెయ్యి వేసి వేడి చేయాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో చికెన్ వేసి లేత బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి.
-తర్వాత అందులో ఉల్లిపాయ ముక్కలు,వెల్లుల్లి,అల్లం, క్యారెట్ ముక్కలు వేసి సువాసన వచ్చే వరకు వేయించాలి.
-తర్వాత అందులో నీరు,బే ఆకు, చికెన్ ముక్కలను వేసి మూత పెట్టి ఉడకనివ్వండి. మంటను మీడియంలో పెట్టి చికెన్ మెత్తబడేవరకు ఉడకనివ్వండి.
-ఇప్పుడు చికెన్ ముక్కలను సపరేట్ చేసి వేరే ప్లేట్‌లోకి తీసుకోవాలి. అలా తీసుకున్న చికెన్ ముక్కలను చిన్న చిన్న ముక్కలుగా చేసి స్టవ్‌పై ఉన్న సూప్‌లో మళ్లీ వేయాలి. ఈ సందర్భంలో ఎముకలు ఉంటే, వాటిని బయటకు తీయండి.
-కాసేపు ఉడికించిన తర్వాత అందులో ఉప్పు, మిరియాల పొడి, సోయాసాస్, చిల్లి సాస్, వెనిగర్,టమాట సాస్‌ను వేసి 2-3 నిమిషాలు మరిగించాలి.
-ఈ సమయంలోనే మరో గిన్నెలో 1 టీస్పూన్ కార్న్ ఫ్లోర్‌ని తీసుకొని నీటితో బాగా కలపాలి. ఈ గిన్నెను పక్కన పెట్టిండి.
-మరో గిన్నెలో ఒక కోడి గుడ్డును పగలగొట్టి బాగా గిలక్కొట్టాలి. ఈ ఎగ్ ను మరుగుతోన్న సూప్‌లో వేసి బాగా కలపాలి. రెండు నిమిషాల తర్వాత నీటితో కలిపి ఉంచిన కార్న్ ఫ్లోర్ మిశ్రమాన్ని వేసి బాగా కలపాలి.
-రెండు నుంచి మూడు నిమిషాలు చేస్తే సూప్ చిక్కగా మారుతుంది. చివరిగా కొత్తిమీర వేస్తే సరిపోతుంది. రెస్టారెంట్ స్టైల్ హాట్ హాట్ చికెన్ సూప్ రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications












