Latest Updates
-
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు?
ఇడ్లీ, దోసెలోకి అదిరిపోయే కాంబినేషన్.. ఈ కొత్తిమీర తన్నీ చట్నీ ఒక్కసారి రుచి చూడండి
ప్రతిరోజూ మన ఇళ్లలో ఉదయం బ్రేక్ ఫాస్ట్ అనగానే గుర్తొచ్చేవి ఇడ్లీ, దోసె లేదా వడ. ఇవి ఎంత రుచిగా ఉన్నా, వాటిలోకి ఎప్పుడూ చేసుకునే పల్లీల చట్నీ, కొబ్బరి చట్నీ లేదా టమోటా చట్నీనే తిని తిని బోర్ కొడుతోందా? కొత్తగా ఏదైనా రుచి చూడాలనిపిస్తోందా? అయితే మీ ఫ్రిజ్‌లో కాస్త కొత్తిమీర ఉంటే చాలు.. అద్భుతమైన చట్నీ తయారైపోతుంది.
సాధారణంగా మనం కొత్తిమీర పచ్చడిని రోటి పచ్చడిలా గట్టిగా చేసుకుంటాం. కానీ ఇడ్లీ దోసెల్లోకి కొంచెం పలచగా, నోటికి పుల్లగా, కారంగా తగులుతూ ఉండే కొత్తిమీర తన్నీ చట్నీ(కొత్తిమీర నీరు చట్నీ) చేసుకుంటే ఆ రుచే వేరు. ఈ చట్నీని పచ్చిగా కాకుండా, దినుసులన్నీ నూనెలో వేయించి చేయడం వల్ల దీని రుచి రెట్టింపు అవుతుంది. పైగా ఇది ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది. కొత్తిమీర తన్నీ చట్నీ ఉంటే సాధారణం కంటే మరో రెండు ఇడ్లీలు ఎక్కువే లాగిస్తారు. కొత్తిమీర తన్నీ చట్నీ ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.
కావలసిన పదార్థాలు
నూనె: 2 టీస్పూన్లు
ఉల్లిపాయలు: 2
వెల్లుల్లి: 4 రెబ్బలు
పచ్చిమిర్చి: 1-2
చింతపండు: చిన్న ఉసిరికాయంత
కొత్తిమీర: 2 గుప్పెళ్ళు
ఉప్పు: రుచికి సరిపడా
చక్కెర: అర టీస్పూన్
నూనె - 1 టేబుల్ స్పూన్
ఆవాలు - 1 టీస్పూన్
మినప్పప్పు - 1 టీస్పూన్
జీలకర్ర పొడి/జీలకర్ర - పావు టీస్పూన్
ఎండుమిర్చి - 1
కరివేపాకు - 1 రెమ్మ
పసుపు - చిటికెడు
తయారీ విధానం
-ముందుగా స్టవ్ వెలిగించి ఒక బాండీ పెట్టండి. అందులో 2 టీస్పూన్ల నూనె వేసి వేడెక్కాక, తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి అవి మెత్తబడే వరకు వేయించండి.
-ఉల్లిపాయలు వేగాక అందులో వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిర్చి, శుభ్రం చేసిన చింతపండు వేసి దోరగా, బంగారు రంగు వచ్చే వరకు వేయించుకోవాలి.
-చివరగా రెండు గుప్పెళ్ల తాజా కొత్తిమీరను బాండీలో వేసి పచ్చి వాసన పోయేలా ఒక్క నిమిషం పాటు వేయించి స్టవ్ ఆఫ్ చేయండి. ఈ మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి.
-చల్లారిన మిశ్రమాన్ని మిక్సీ జార్ లోకి తీసుకోండి. దీనికి రుచికి సరిపడా ఉప్పు, అర టీస్పూన్ చక్కెరను జత చేయండి. కొద్దిగా నీళ్ళు పోసి మెత్తగా రుబ్బుకోవాలి.
-మిక్సీ పట్టిన చట్నీని ఒక గిన్నెలోకి తీసుకోండి. మీకు కావాల్సిన చిక్కదనాన్ని బట్టి తగినన్ని నీళ్ళు పోసి కలుపుకోండి. మరీ పలచగా కాకుండా, ఇడ్లీలో ముంచుకు తినేలా ఉంటే బాగుంటుంది.
-తాలింపు కోసం ఇప్పుడు స్టవ్ మీద చిన్న పాన్ పెట్టి నూనె వేడి చేయండి. అందులో ఆవాలు, మినప్పప్పు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి చిటపటలాడించండి. చివరగా చిటికెడు పసుపు వేసి, స్టవ్ ఆపి, ఈ వేడి వేడి తాలింపును చట్నీలో కలపండి.
-అంతే ఎంతో రుచికరమైన, ఘుమఘుమలాడే కొత్తిమీర తన్నీ చట్నీ రెడీ. వేడి వేడి ఇడ్లీలు లేదా కరకరలాడే దోసెల్లోకి ఈ చట్నీని వడ్డిస్తే అద్భుతం అనాల్సిందే.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications





