Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
చపాతీ,బటర్ నాన్ లోకి ది బెస్ట్ కాంబినేషన్..పంజాబీ స్టైల్ ఎగ్ మసాలా
ఎప్పుడూ ఒకే రకమైన ఎగ్ కర్రీ, ఎగ్ బుర్జీ లేదా ఆమ్లెట్ తిని మీకు బోర్ కొట్టిందా? మీ ఇంటి సభ్యులు మళ్ళీ కోడిగుడ్డు కూరేనా? అని అడుగుతున్నారా? సాధారణంగా మనం పంజాబీ దాబాలో లేదా పెద్ద రెస్టారెంట్లలో తినే ఎగ్ మసాలా కర్రీకి ఒక ప్రత్యేకమైన రుచి ఉంటుంది. ఆ రుచిని ఇప్పుడు మీరు మీ వంటింట్లోనే చాలా సులభంగా ఆస్వాదించవచ్చు.
చపాతీ, రోటీ, నాన్, పూరీ, దోస లేదా వేడి వేడి అన్నంలోకి ఈ పంజాబీ ఎగ్ మసాలా అద్భుతమైన కాంబినేషన్. పంజాబీ స్టైల్ ఎగ్ మసాలా కర్రీ ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.

కావలసిన పదార్థాలు
ఉడికించిన గుడ్లు - 4
నూనె - సరిపడా
లవంగాలు - 4
బిర్యానీ ఆకు (బే లీఫ్) - 1
యాలకులు - 2
ఉల్లిపాయలు - 2
పచ్చిమిర్చి - 1
అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 టీస్పూన్
టమోటాలు - 2
పసుపు - అర టీస్పూన్
కారం - 1 టీస్పూన్
ధనియాల పొడి - 1 టీస్పూన్
గరం మసాలా పొడి - పావు టీస్పూన్
నీళ్లు - గ్రేవీకి సరిపడా
కొత్తిమీర - గార్నిష్ కోసం కొద్దిగా
తయారీ విధానం
-ముందుగా కోడిగుడ్లను నీటిలో వేసి బాగా ఉడికించండి. ఉడికిన తర్వాత వాటి పొట్టు తీసి, ఒక్కో గుడ్డును నిలువుగా రెండు భాగాలుగా కట్ చేసి పక్కన పెట్టుకోండి.
-ఇప్పుడు స్టవ్ వెలిగించి, ఒక బాండీలో సరిపడా నూనె వేడి చేయండి. నూనె వేడెక్కాక అందులో లవంగాలు, యాలకులు, బిర్యానీ ఆకు వేసి ఒక 30 సెకన్ల పాటు వేయించండి. మసాలా దినుసుల నుండి మంచి సువాసన వస్తుంది.
-ఇప్పుడు బాండీలో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి వేయించండి. ఉల్లిపాయలు పారదర్శకంగా మారే వరకు వేయించాలి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ , తురిమిన ఉల్లిపాయ వేసి కలపాలి.
-ఉల్లిపాయలోని పచ్చి వాసన పోయి, బంగారం రంగు వచ్చే వరకు సుమారు 3 నిమిషాల పాటు బాగా వేయించాలి. ఉల్లిపాయ పేస్ట్ బాగా వేగిన తర్వాత, టమోటా తురుము వేసి కలపాలి. ఇందులోనే పసుపు, కారం, ధనియాల పొడి, గరం మసాలా, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలపాలి.
-ఈ మిశ్రమాన్ని నూనె పైకి తేలేంత వరకు సన్నని మంటపై వేయించాలి.
-మసాలా పచ్చి వాసన పోయిన తర్వాత అందులో సుమారు అర కప్పు నీళ్లు పోసి కలపాలి. గ్రేవీ చిక్కబడే వరకు మూత పెట్టి ఉడికించాలి.
-గ్రేవీ దగ్గర పడి, చిక్కగా మారుతున్నప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉడికించిన గుడ్లను మెల్లగా గ్రేవీలో వేయాలి. గుడ్లకు మసాలా బాగా పట్టేలా నెమ్మదిగా కలపాలి. చివరగా సన్నగా తరిగిన తాజా కొత్తిమీర చల్లి స్టవ్ ఆఫ్ చేయాలి.
0అంతే గుమగుమలాడే వేడి వేడి పంజాబీ స్టైల్ ఎగ్ మసాలా రెడీ. దీనిని సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని చపాతీతో గానీ, బటర్ నాన్ తో గానీ వడ్డిస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications