Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
మీఠీ సేవై రెసిపి । స్వీట్ సేవియాన్
దేశవ్యాప్తంగా ప్రతి పండగకి సాంప్రదాయంగా సేమ్యా పాయసాన్ని తయారుచేస్తారు. దీన్ని సేమ్యా వేయించి, పాలతో ఉడికించి, పంచదార కలిపి చేస్తారు. మీరూ చేయాలనుకుంటే, చిత్రాలు, వీడియోతో కూడిన ఈ తయారీవిధానాన్ని చదవ
దేశవ్యాప్తంగా ప్రతి పండగకి సాంప్రదాయంగా సేమ్యా పాయసాన్ని తయారుచేస్తారు. భారత్ లో ప్రతి పండగకి సేమ్యా పాయసాన్ని ఆనందిస్తారు. ఉపవాసాలు, వ్రతాలప్పుడు దీన్ని నైవేద్యంగా కూడా పెడతారు.
దీన్ని సేమ్యా వేయించి, పాలతో ఉడికించి, పంచదార కలిపి చేస్తారు. ఇక్కడ మేము ఎండుకొబ్బరి కూడా కొత్తరుచి కోసం వేసాము. ఇది ఎంతో రుచికరంగా ఉండి, సులభంగా తయారయిపోతుంది.
సేమ్యా పాయసాన్ని దేశవ్యాప్తంగా కొద్ది కొద్ది తేడాలతో తయారుచేస్తారు. మీరూ చేయాలనుకుంటే, చిత్రాలు, వీడియోతో కూడిన ఈ తయారీ విధానాన్ని చదవండి.

Recipe By: మీనా బంఢారి
Recipe Type: స్వీట్లు
Serves: ఇద్దరికి
-
నెయ్యి - 1 చెంచా
సేమ్యా - 1 కప్పు
పాలు - 750 మిలీ
ఎండుకొబ్బరి - 2 చెంచాలు
చక్కెర - 5చెంచాలు
కిస్మిస్ లు - 5-6
జీడిపప్పు - 4-5 అలంకరణకి
తరిగిన బాదం - 4-5 అలంకరణకి
తరిగిన పిస్తా పప్పులు - 3-4 అలంకరణకి
-
1. వేడి బాండీలో నెయ్యిని వేసి, కరిగాక అందులో సేమ్యాని వేయండి.
2. సేమ్యా బ్రౌన్ రంగులోకి మారేవరకు కలుపుతూ వేయించండి.
3. పాలను వేసి బాగా కలపండి.
4. 4-5 నిమిషాలు ఉడికించండి.
5. ఎండుకొబ్బరిని వేసి 2నిమిషాలు బాగా కలపండి.
6. ఇంకా చక్కెర వేసి, అది కరిగేవరకూ కలపండి.
7. కిస్మిస్ లు వేసి మళ్ళీ కలపండి.
8. కప్పులలోకి పాయసాన్ని తీసుకోండి.
9. జీడిపప్పులు, తరిగిన బాదం, పిస్తా పప్పులు వేసి అలంకరించండి.
- 1. అందరికీ వడ్డించేముందు సేమ్యా బాగా ఉడికేట్లు చూసుకోండి.
- 2. ఎండుకొబ్బరి తప్పనిసరిగా వేయనక్కరలేదు.
- 3. మరింత రుచి కోసం డ్రైఫ్రూట్లను, ఎండు ఖర్జూరాలను జత చేయవచ్చు.
- వడ్డించే పరిమాణం - 1 కప్పు
- క్యాలరీలు - 170 క్యాలరీలు
- కొవ్వు - 6.0 గ్రాములు
- ప్రొటీన్ - 4.9 గ్రాములు
- కార్బొహైడ్రేట్లు - 24.5 గ్రాములు
- చక్కెర - 19.4 గ్రాములు
- ఫైబర్ - 0.2 గ్రాములు
స్టెప్ బై స్టెప్ - షిర్ సేవైన్ ను ఎలా తయారుచేయాలి
1. వేడి బాండీలో నెయ్యిని వేసి, కరిగాక అందులో సేమ్యాని వేయండి.


2.సేమ్యా బ్రౌన్ రంగులోకి మారేవరకు కలుపుతూ వేయించండి.

3. పాలను వేసి బాగా కలపండి.


4. 4-5 నిమిషాలు ఉడికించండి.

5. ఎండుకొబ్బరిని వేసి 2నిమిషాలు బాగా కలపండి.


6. ఇంకా చక్కెర వేసి, అది కరిగేవరకూ కలపండి.


7. కిస్మిస్ లు వేసి మళ్ళీ కలపండి.


8. కప్పులలోకి పాయసాన్ని తీసుకోండి.

9. జీడిపప్పులు, తరిగిన బాదం, పిస్తా పప్పులు వేసి అలంకరించండి.




Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications