For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీఠీ సేవై రెసిపి । స్వీట్ సేవియాన్

దేశవ్యాప్తంగా ప్రతి పండగకి సాంప్రదాయంగా సేమ్యా పాయసాన్ని తయారుచేస్తారు. దీన్ని సేమ్యా వేయించి, పాలతో ఉడికించి, పంచదార కలిపి చేస్తారు. మీరూ చేయాలనుకుంటే, చిత్రాలు, వీడియోతో కూడిన ఈ తయారీ విధానాన్ని చదవ

Posted By: Lekhaka
|

దేశవ్యాప్తంగా ప్రతి పండగకి సాంప్రదాయంగా సేమ్యా పాయసాన్ని తయారుచేస్తారు. భారత్ లో ప్రతి పండగకి సేమ్యా పాయసాన్ని ఆనందిస్తారు. ఉపవాసాలు, వ్రతాలప్పుడు దీన్ని నైవేద్యంగా కూడా పెడతారు.

దీన్ని సేమ్యా వేయించి, పాలతో ఉడికించి, పంచదార కలిపి చేస్తారు. ఇక్కడ మేము ఎండుకొబ్బరి కూడా కొత్తరుచి కోసం వేసాము. ఇది ఎంతో రుచికరంగా ఉండి, సులభంగా తయారయిపోతుంది.

సేమ్యా పాయసాన్ని దేశవ్యాప్తంగా కొద్ది కొద్ది తేడాలతో తయారుచేస్తారు. మీరూ చేయాలనుకుంటే, చిత్రాలు, వీడియోతో కూడిన ఈ తయారీ విధానాన్ని చదవండి.

మీఠీ సేవై రెసిపి । సేమ్యా పాయసం ఎలా తయారుచేయాలి । సేమ్యా పాయసం తయారీ
మీఠీ సేవై రెసిపి । సేమ్యా పాయసం ఎలా తయారుచేయాలి । సేమ్యా పాయసం తయారీ
Prep Time
5 Mins
Cook Time
15M
Total Time
20 Mins

Recipe By: మీనా బంఢారి

Recipe Type: స్వీట్లు

Serves: ఇద్దరికి

Ingredients
  • నెయ్యి - 1 చెంచా

    సేమ్యా - 1 కప్పు

    పాలు - 750 మిలీ

    ఎండుకొబ్బరి - 2 చెంచాలు

    చక్కెర - 5చెంచాలు

    కిస్మిస్ లు - 5-6

    జీడిపప్పు - 4-5 అలంకరణకి

    తరిగిన బాదం - 4-5 అలంకరణకి

    తరిగిన పిస్తా పప్పులు - 3-4 అలంకరణకి

How to Prepare
  • 1. వేడి బాండీలో నెయ్యిని వేసి, కరిగాక అందులో సేమ్యాని వేయండి.

    2. సేమ్యా బ్రౌన్ రంగులోకి మారేవరకు కలుపుతూ వేయించండి.

    3. పాలను వేసి బాగా కలపండి.

    4. 4-5 నిమిషాలు ఉడికించండి.

    5. ఎండుకొబ్బరిని వేసి 2నిమిషాలు బాగా కలపండి.

    6. ఇంకా చక్కెర వేసి, అది కరిగేవరకూ కలపండి.

    7. కిస్మిస్ లు వేసి మళ్ళీ కలపండి.

    8. కప్పులలోకి పాయసాన్ని తీసుకోండి.

    9. జీడిపప్పులు, తరిగిన బాదం, పిస్తా పప్పులు వేసి అలంకరించండి.

Instructions
  • 1. అందరికీ వడ్డించేముందు సేమ్యా బాగా ఉడికేట్లు చూసుకోండి.
  • 2. ఎండుకొబ్బరి తప్పనిసరిగా వేయనక్కరలేదు.
  • 3. మరింత రుచి కోసం డ్రైఫ్రూట్లను, ఎండు ఖర్జూరాలను జత చేయవచ్చు.
Nutritional Information
  • వడ్డించే పరిమాణం - 1 కప్పు
  • క్యాలరీలు - 170 క్యాలరీలు
  • కొవ్వు - 6.0 గ్రాములు
  • ప్రొటీన్ - 4.9 గ్రాములు
  • కార్బొహైడ్రేట్లు - 24.5 గ్రాములు
  • చక్కెర - 19.4 గ్రాములు
  • ఫైబర్ - 0.2 గ్రాములు

స్టెప్ బై స్టెప్ - షిర్ సేవైన్ ను ఎలా తయారుచేయాలి

1. వేడి బాండీలో నెయ్యిని వేసి, కరిగాక అందులో సేమ్యాని వేయండి.

2.సేమ్యా బ్రౌన్ రంగులోకి మారేవరకు కలుపుతూ వేయించండి.

3. పాలను వేసి బాగా కలపండి.

4. 4-5 నిమిషాలు ఉడికించండి.

5. ఎండుకొబ్బరిని వేసి 2నిమిషాలు బాగా కలపండి.

6. ఇంకా చక్కెర వేసి, అది కరిగేవరకూ కలపండి.

7. కిస్మిస్ లు వేసి మళ్ళీ కలపండి.

8. కప్పులలోకి పాయసాన్ని తీసుకోండి.

9. జీడిపప్పులు, తరిగిన బాదం, పిస్తా పప్పులు వేసి అలంకరించండి.

[ 5 of 5 - 101 Users]
English summary

మీఠీ సేవై రెసిపి । సేమ్యా పాయసం ఎలా తయారుచేయాలి । సేమ్యా పాయసం తయారీ

Meethi sewai is an authentic Indian sweet that is prepared for almost all festivals and is also consumed during fasts or vrats. Learn how to make vermicell
Desktop Bottom Promotion