Latest Updates
-
స్త్రీల శరీరంలో అత్యంత సున్నితమైన భాగాలు.. ఇక్కడ తాకితే మీ రాత్రి రసవత్తరమే! -
కరకరలాడే చిట్టి మురుకులు..పెద్దలకే కాదు, పిల్లలకు కూడా భలే నచ్చేస్తాయి..ఈజీగా చేసుకోండిలా.. -
ఈ పిండితో చేసిన రోటీ, చపాతీలు తింటే షుగర్ లెవల్స్ పెరగవు, ఫ్యాటీ లివర్ దరిచేరదు! -
‘ప్రొబేషన్ ముగిసినా ఆఫర్ లెటర్ లేదు.. ఇలాంటి కాల్ వస్తుందని ఊహించలేదు’- యువతి వైరల్ వీడియో.! -
ఈ ఐదు ఇంటి చిట్కాలను ప్రయత్నించారంటే.. ఇక జుట్టుకి హెయిర్ డైలు పూయడం ఆపేస్తారు.! -
రిలేషన్షిప్లో మహిళలు నిజంగా ఏం కోరుకుంటారు.. టాప్ 5 సీక్రెట్స్ ఇవే.! -
నోరూరించే స్వచ్ఛమైన పాలకోవా.. కేవలం 3 పదార్థాలతో మీ ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
సంతానోత్పత్తికి అడ్డంకిగా ఫెలోపియన్ ట్యూబ్స్ బ్లాకేజీ.. మహిళల్లో ఈ సమస్యను ఎలా నివారించాలి.! -
ఎటు చూసినా కష్టాలేనా? ఈ పవర్ ఫుల్ మంత్రాలు చదివితే లైఫ్ ఛేంజ్! -
ప్రపంచ మెదడు దినోత్సవం.. బ్రెయిన్ హెల్త్‌కి, విటమిన్ బి1కి సంబంధం ఉందా.. ఈ లక్షణాలు కనిపిస్తే చాలా డేంజర్.!
నోట్లో వేస్తే వెన్నలా కరిగిపోయే దూధి హల్వా..ఈజీగా ఎలా చేసుకోవాలంటే..
సాధారణంగా మన ఇళ్లలో ఏదైనా స్వీట్ చేయాలనుకున్నప్పుడు మనకు ముందుగా గుర్తొచ్చేవి రవ్వ కేసరి లేదా శనగపిండితో చేసే స్వీట్లు. ఇవి తరచుగా చేసుకునేవే కాబట్టి, కొత్తదనం కోరుకునే వారికి ఇవి బోర్ కొట్టించవచ్చు. మరి మీరు ఎప్పుడైనా నార్త్ ఇండియా ఫేమస్ దూధి హల్వా రుచి చూశారా?
దూది హల్వా అంటే దూదితో ఏం చేయరు..సొరకాయను హిందీలో దూధి అని పిలుస్తారు. నార్త్ ఇండియాలో సొరకాయతో చేసే హల్వాను దూధి హల్వా అని పిలుస్తారు. కేవలం అరగంటలో, ఇంట్లో ఉండే పదార్థాలతోనే తయారు చేసుకోవచ్చు. ఎంతో రుచికరమైన, ఆరోగ్యకరమైన ఈ సొరకాయ హల్వా ఎలా చేసుకోవాలో ఇక్కడ చూడండి.

కావలసిన పదార్థాలు
లేత సొరకాయ (చిన్నది): 1
చిక్కటి పాలు: 1 కప్పు
తురిమిన కొబ్బరి: 2 టేబుల్ స్పూన్లు
బాదం, జీడిపప్పు, పిస్తా: 3 టేబుల్ స్పూన్లు
ఎండుద్రాక్ష: 1 టేబుల్ స్పూన్
యాలకుల పొడి: అర టీస్పూన్
నెయ్యి: 2 టేబుల్ స్పూన్లు
ఫ్రెష్ క్రీమ్ (పాల మీగడ): 2 టేబుల్ స్పూన్లు
చక్కెర: 3 టేబుల్ స్పూన్లు
తయారీ విధానం
-ముందుగా సొరకాయను శుభ్రంగా కడిగి, పైన ఉన్న తొక్కను తీసేయాలి. తర్వాత దానిని సన్నగా తురుముకోవాలి.
-సొరకాయలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి, తురిమిన తర్వాత ఆ మిశ్రమాన్ని చేతితో గట్టిగా పిండి, అందులో ఉన్న నీటిని పూర్తిగా తొలగించాలి. ఇలా చేయడం వల్ల హల్వా త్వరగా ఉడుకుతుంది, పచ్చి వాసన రాదు.
-తర్వాత స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టి అందులో నెయ్యి వేడి చేయండి. నెయ్యి కరిగాక, ముందుగా సిద్ధం చేసుకున్న సొరకాయ తురుమును అందులో వేయాలి. సన్నని మంటపై సొరకాయ పచ్చి వాసన పోయి, లేత రంగులోకి మారేంత వరకు దోరగా వేయించుకోవాలి.
-సొరకాయలోని తేమ ఆవిరైపోయిన తర్వాత, అందులో చక్కెర వేసి కలపాలి. చక్కెర కరిగి పాకంలా మారుతున్నప్పుడు ఒక కప్పు పాలు, రెండు టేబుల్ స్పూన్ల ఫ్రెష్ క్రీమ్ (మీగడ) వేయాలి. క్రీమ్ వేయడం వల్ల హల్వాకు కోవా వేసినంత రుచి వస్తుంది.
-పాలు, క్రీమ్ వేసిన తర్వాత అడుగు అంటుకోకుండా గరిటెతో కలుపుతూ ఉండాలి. పాలు ఇగిరిపోయి, మిశ్రమం దగ్గర పడుతున్నప్పుడు సన్నగా తరిగిన బాదం, జీడిపప్పు, పిస్తాపప్పులను వేసి కలపాలి. ఈ డ్రై ఫ్రూట్స్ హల్వాను తినేటప్పుడు పంటికి తగులుతూ మంచి రుచిని ఇస్తాయి.
-హల్వా పాన్ నుండి విడిపోతున్న సమయంలో అందులో కిస్మిస్, యాలకుల పొడి వేయాలి. చివరగా, తురిమిన కొబ్బరిని వేసి బాగా కలపాలి. కొబ్బరి ఈ స్వీట్ కు ఒక ప్రత్యేకమైన ఆకృతిని, రుచిని ఇస్తుంది.
-అన్ని పదార్థాలు బాగా కలిసిపోయి, నెయ్యి పైకి తేలుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేయండి. అంతే ఎంతో రుచికరమైన వేడి వేడి సొరకాయ హల్వా రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications