Sunday Special: మిలిటరీ స్టైల్ మటన్ పాయా.. సింపుల్‌గా ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే?

ఆదివారం వచ్చిందంటే చాలు ప్రతి ఇంట్లో నాన్ వెజ్ కచ్చితంగా ఉండాల్సిందే. అయితే చాలా మంది ఆదివారం వచ్చిందంటే ఎవరైనా చికెన్ లేదా మటన్ కూరను వండుకుంటారు. ఇంకొందరు ఫిష్ ట్రై చేస్తారు. అయితే ఈ సండే రోజు ప్రత్యేకంగా చేసుకోవాలని అనుకుంటున్న వ్యక్తులు మటన్ పాయ చేసుకోవచ్చు. దీనిని తింటే కీళ్ల నొప్పులు కూడా దూరమవుతాయి. అది కూడా మిలిటరీ స్టైల్‌లో మటన్ పాయ తింటే ఆ రుచి అమోఘంగా ఉంటుంది.

కానీ మిలిటరీ స్టైల్‌లో ఈ మటన్ పాయను ఎలా చేసుకోవాలో తెలియదా? ఈ స్టోరీలో ఆ మటన్ పాయను ఎలా చేసుకోవాలి? దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి? ఏ విధమైన పద్దతిలో ఈ పాయ చేసుకోవాలనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.

మిలిటరీ స్టైల్‌లో మటన్ పాయ తయారీకి కావాల్సిన పదార్థాలు

  • మటన్ కాళ్ళు
  • నూనె - 3 టేబుల్ స్పూన్లు
  • 2 బిర్యానీ ఆకులు
  • 3 పైనాపిల్
  • దాల్చిన చెక్క- 2 ముక్కలు
  • లవంగాలు - 4
  • ఉల్లిపాయలు - 3 (తరిగినవి)
  • పచ్చిమిర్చి - 3
  • ఉప్పు - రుచి ప్రకారం
  • అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 టేబుల్ స్పూన్
  • పెరుగు - 4 టేబుల్ స్పూన్
  • పసుపు పొడి - 1/4 టీస్పూన్
  • సోంపు పొడి - 1 టీస్పూన్
  • జీలకర్ర పొడి - 1 టీస్పూన్
  • కొబ్బరి పాలు - 150 ml
  • నీరు - 2 1/2 లీటర్లు
  • మిరియాల పొడి - 1 టేబుల్ స్పూన్
  • కొత్తిమీర - కొద్దిగా
  • పుదీనా - కొద్దిగా

కొబ్బరి ముద్ద కోసం..

  • కొబ్బరి - కొద్దిగా
  • జీడిపప్పు - 4
  • పచ్చిమిర్చి-1
  • వేరుశెనగ - 1/2 టేబుల్ స్పూన్స్

మటన్ పాయ తయారీ విధానం..

  • ఈ మటన్ పాయను తయారు చేసుకోవడానికి ముందుగా మటన్ కాళ్ళను రాళ్ళ ఉప్పు, పసుపు పొడితో బాగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి రుబ్బుకోవాలి. అవి మెత్తగా అయిపోయాక.. అందులో కొబ్బరి, జీడిపప్పు, శనగపప్పు వేసి, కొద్దిగా నీళ్లు పోసుకొని మెత్తగా రుబ్బుకొని ఒక కప్పులో తీసుకొని పక్కకు పెట్టుకోవాలి.
  • ఇప్పుడు ఒక ప్రెజర్ కుక్కర్ తీసుకొని అందులో నూనె వేడయ్యాక.. అందులో రెండు దాల్చిన చెక్క, లవంగాలు, పైనాపిల్, నాలుగు బిర్యాని ఆకులు వేసుకోవాలి. అవి కొంచెం వేడయ్యాక అందులోనే సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలను వేసుకోని మూత పెట్టుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు లేత బంగారు వర్ణంలోకి మారిన తరువాత అందులో పచ్చి మిర్చి వేసుకొని కొద్దిసేపు వేయించుకోవాలి.
  • ఇప్పుడు ఆ మిశ్రమంలో రుచికి తగినట్లుగా ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు వేసుకొని ఆ మిశ్రమానికి అంతా పట్టుకునే విధంగా కలుపుకోవాలి. అదంతా ఒక్క రెండు నిమిషాల పాటు వేయించుకొని, మనం ముందుగా రుబ్బి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా పేస్ట్ వేసుకోవాలి. కాసేపటి తరువాత ధనియాల పొడి, పసుపు, జీలకర్ర, సోంపుపొడి వేసుకొని ఒక నిమిషం పాటు వేయించుకోవాలి.
  • ఇప్పుడు ఆ మిశ్రమంలో కొబ్బరిపాలు, ఉడికించిన పాలు పోసుకొని గిలకొట్టుకోవాలి. పాలు బాగా మరిగిన తరువాత ముందుగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న మటన్ కాళ్ళను వేసుకొని రెండు లేదా రెండున్నర లీటర్ల నీళ్లు పోసుకొని మూత పెట్టేసి.. మీడియం మంట మీద ఉంచేసి పది విజిల్స్ వచ్చే వరకు లేదా 20 నిమిషాల పటు ఉడికించుకోవాలి.
  • 20 నిమిషాలు లేదా పది విజిల్స్ వచ్చిన తరువాత కుక్కర్ మూత తీసేసి.. అందులో కొబ్బరి ముద్ద, కొంచెం నీరు వేసుకొని రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి. అలాగే మిరియాల పొడిని వేసుకొని కలుపుకొని అయిదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి. చివరగా కొత్తిమీర, పుదీనా వేసుకొని మూతపెట్టి పది నిమిషాల పాటు మీడియం మంట మీద ఉడికించుకుంటే సరిపోతుంది.
  • అదిరిపోయే రుచితో, ఘుమఘుమలాడే మిలిటరీ స్టైల్ మటన్ పాయ సిద్ధమైనట్లే. దాన్ని ఒక బౌల్‌లో తీసుకొని సూప్ తాగుతూ, సండే రోజు ఎంజాయ్ చేసుకోవాల్సిందే.
[ of 5 - Users]
Story first published: Sunday, November 10, 2024, 12:31 [IST]
Desktop Bottom Promotion