Latest Updates
-
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.!
Milk Mysore Pak: మిల్క్ మైసూర్ పాక్..చేసుకోవడం వెరీ సింపుల్..నోట్లో వెన్నలా కరిగిపోతుంది
స్వీట్స్ అంటే ఇష్టపడనివారు ఎవరుంటారు చెప్పండి. అయితే ఎన్ని రకాల స్వీట్లు ఉన్నా అందులో మైసూర్ పాక్ కి స్పెషల్ ప్లేస్ ఉంటుంది. మైసూర్ పాక్ లో కూడా రకాలు ఉంటాయి. అందులో ఒకటి మిల్క్ మైసూర్ పాక్(milk mysore pak). ఒక్క ముక్క నోట్లో పెట్టుకుంటే వెన్నలా కరిగిపోయే మిల్క్ మైసూర్ పాక్ ని చాలా ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చు. స్వీట్ షాపులో అమ్మే మిల్క్ మైసూర్ పాక్ కన్నా టేస్టీగా ఉండేలా దీన్ని ఎలా చేసుకోవాలి, మిల్క్ మైసూర్ పాక్ తయారీకి ఏయే పదార్థాలు కావాలో ఇప్పుడు చూద్దాం.
మిల్క్ మైసూర్ పాక్ తయారీకి కావాల్సిన
పదార్థాలు
-మిల్క్ పౌడర్
-చక్కెర
-నెయ్యి
-మైదా
-నిమ్మరసం

మిల్క్ మైసూర్ పాక్ తయారీ విధానం
-ముందుగా ఓ పెద్ద ప్లేట్ తీసుకొని అందులో 200 గ్రాముల మిల్క్ పౌడర్ లేదా పాల పిండి,2 టీ స్పూన్ల మైదా,2 టీ స్పూన్ల నెయ్యి వేసి బాగా బ్రెడ్ పొడిలా కలిపి పక్కనపెట్టుకోండి.
-ఇఫ్పుడు స్టవ్ మీద పాన్ పెట్టి అందులో 800 గ్రాముల చక్కెర పోసి అందులో 200 గ్రాముల నీళ్లు పోసి ఓ తీగ పాకం వచ్చేదాకా వేడి చేయాలి.
-ఓ తీగ పాకం వచ్చాక అందులో పావు టీ స్పూన్ నిమ్మరసం అందులో వేసి బాగా కలపండి.
-ఇప్పుడు మంటను మీడియంలో పెట్టి కలిపి ఉంచుకున్న పాలపిండి మిశ్రమాన్ని పంచదార పాకంలో పోసి గడ్డలు లేకుండా బాగా కలపాలి.
-ఇప్పుడు 200 గ్రాముల నెయ్యిని కొంచెం కొంచెంగా అందులో పోస్తూ కలపాలి.
-20 నిమిషాల తర్వాత ఆ పాకం రంగు మారడం ప్రారంభమవుతుంది. లోపలి నుంచి బబుల్స్ లా వస్తుంటాయి.
-ఇప్పుడు అది రెడీ అయిందా లేదా అన్నది తెలుసుకోడానికి పాకాన్ని కొంచెం చేతిలోకి తీసుకొని నలిపితే ఉండ కడితే అప్పుడు అది ఫర్ఫెక్ట్ గా అయినట్లు భావించవచ్చు.
-ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి అందులో 50 గ్రాముల నెయ్యి పోసి బాగా కలపండి.
-ఇప్పుడు నెయ్యి రాసి ఉంచిన ట్రేలో చక్కెర పాకం మిశ్రమాన్ని మొత్తం పోసి ఒక 4-5 గంటలు చల్లారనివ్వండి.
-5 గంటల తర్వాత దాన్ని ఓ ప్లేట్ లో వేసి ముక్కలుగా కట్ చేసుకోండి. టేస్టీ మిల్క్ మైసూర్ పాక్ రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
