For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పాలకోవా రెసిపి ; దూధ్ పేడా ఎలా చేయాలి : వీడియో

పాలకోవా భారత సాంప్రదాయ వంటకం. ఈ స్వీట్ ను పండగలప్పుడు చేస్తారు. స్టెప్ బై స్టెప్ తయారీ విధానాన్నిచిత్రాలు మరియు వీడియోతో చూడండి.'

Posted By: Lekhaka
|

పాలకోవా ప్రసిద్ధ భారత స్వీటు. దీన్ని ఎండుకొబ్బరితో పండగలప్పుడు తయారుచేస్తారు. ఇది ఎంతో ప్రముఖమైనది మరియు అందరికీ ఎంతో ఇష్టమైన పదార్థం. దేశంలో నలుమూలలా దీన్ని చేసుకుంటారు కాబట్టి అన్నిచోట్లా దొరుకుతుంది.

ఈ తయారీవిధానంలో రుచికర పాలకోవాను పాలపొడి, గట్టిపాలతో చేస్తారు. ఏలకుల పొడి, న్యూట్ మెగ్ పొడి స్వీటుకి మరింత రుచిని అందిస్తాయి.

ఈ పాలకోవాను సులభంగా, శ్రమలేకుండా చేసుకోవచ్చు. అందుకని పండగలప్పుడు చేసుకుని అందరూ ఇష్టపడతారు. స్టెప్ బై స్టెప్ తయారీ విధానాన్నిచిత్రాలు మరియు వీడియోతో చూడండి.

పాలకోవా వీడియో రెసిపి

పాలకోవా రెసిపి । దూధ్ పేడా తయారీ ఎలా । మిల్క్ పేడా తయారీ | గట్టిపడిన పాలతో పాలకోవా
పాలకోవా రెసిపి । దూధ్ పేడా తయారీ ఎలా । మిల్క్ పేడా తయారీ | గట్టిపడిన పాలతో పాలకోవా
Prep Time
5 Mins
Cook Time
20M
Total Time
25 Mins

Recipe By: మీనా బంఢారి

Recipe Type: స్వీట్లు

Serves: 12 పాలకోవాలు

Ingredients
  • గట్టిపడిన పాలు - 200గ్రాములు

    పాలపొడి - 3/4వ కప్పి

    నెయ్యి - ½ చెంచా

    ఏలకుల పొడి -1 చెంచా

    న్యూట్ మెగ్ పొడి - చిటికెడు

    కుంకుమపువ్వు రేకులు -3-4

How to Prepare
  • 1. కొంచెం వేడిచేసిన పెనంలో నెయ్యి వేయండి.

    2. పాలపొడి, గట్టిపాలను జతచేయండి.

    3. 2-3 నిమిషాలు ఆపకుండా కలుపుతూనే ఉండండి లేకపోతే కింద మాడిపోతుంది.

    4. ఏలకుల పొడి, న్యూట్ మెగ్ పొడి వేయండి.

    5. బాగా కలిపి పక్కల నుంచి పొంగేవరకూ ఉడకనివ్వండి.

    6. 5-10నిమిషాలు చల్లబడనివ్వండి.

    7. కుంకుమరేకులను వేయండి.

    8. చేతితో ముద్దలా బాగా కలిపి చిన్న చిన్న బంతుల్లా చేయండి.

    9. వీటిని చేతి మధ్య వత్తి పేడాలలాగా చేయండి.

    10. కోవాలమీద మీ బొటనవేలి గుర్తు డిజైన్ లాగా వేయండి.

Instructions
  • 1. గట్టిపాలు మరియు పాలపొడి బదులు పాలు మరియు చక్కెరను వాడవచ్చు.
  • 2. పాలకోవాను ఎండుకొబ్బరితో కూడా తయారుచేయవచ్చు.
  • 3. మీరు మిశ్రమాన్ని ఎక్కువ ఉడకనిస్తే, అది మరీ గట్టిపడిపోతుంది.
Nutritional Information
  • సరిపోయే పరిమాణం - 1 ముక్క
  • క్యాలరీలు - 103 క్యాలరీలు
  • కొవ్వు - 5గ్రాములు
  • ప్రొటీన్ - 4గ్రాములు
  • కార్బొహైడ్రేట్లు - 12 గ్రాములు
  • చక్కెర - 8గ్రాములు

స్టెప్ బై స్టెప్ - పాలకోవాను ఎలా తయారుచేయాలి

1. కొంచెం వేడిచేసిన పెనంలో నెయ్యి వేయండి.

2. పాలపొడి, గట్టిపాలను జతచేయండి.

3. 2-3 నిమిషాలు ఆపకుండా కలుపుతూనే ఉండండి లేకపోతే కింద మాడిపోతుంది.

4. ఏలకుల పొడి, న్యూట్ మెగ్ పొడి వేయండి

5. బాగా కలిపి పక్కల నుంచి పొంగేవరకూ ఉడకనివ్వండి.

6. 5-10నిమిషాలు చల్లబడనివ్వండి.

7. కుంకుమరేకులను వేయండి.

8. చేతితో ముద్దలా బాగా కలిపి చిన్న చిన్న బంతుల్లా చేయండి.

9. వీటిని చేతి మధ్య వత్తి పేడాలలాగా చేయండి.

10. కోవాలమీద మీ బొటనవేలి గుర్తు డిజైన్ లాగా వేయండి.

[ 5 of 5 - 110 Users]
English summary

Milk Peda Recipe | How To Make Doodh Peda | Doodh Peda Recipe | పాలకోవా రెసిపి । దూధ్ పేడా తయారీ ఎలా । మిల్క్ పేడా తయారీ | గట్టిపడిన పాలతో పాలకోవా

Milk peda is a traditional Indian sweet that is prepared for most festivals. Here is a video recipe and the step-by-step procedure with images.
Desktop Bottom Promotion