Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
బ్రేక్ ఫాస్ట్,లంచ్,డిన్నర్ ఎప్పుడు తిన్నా ఆరోగ్యమే..10 నిమిషాల్లో జొన్న పరాటా ఎలా చేసుకోవాలంటే
ఆధునిక జీవనశైలిలో ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను పాటించడం చాలా ముఖ్యం. ప్రస్తుతం అధిక బరువు ఒక పెద్ద సమస్యగా మారింది. బరువు తగ్గేందుకు చాలా మంది కఠినమైన వ్యాయామాలు, ఖరీదైన డైట్లు అంటూ ఎన్నో దారులు వెతుకుతారు. అయితే, మన వంటింట్లోనే దొరికే కొన్ని అద్భుతమైన ఆహార పదార్థాలు ఉన్నాయి, వాటిలో జొన్నలు ఒకటి. జొన్న పిండితో తయారుచేసే పరాటా కేవలం రుచికరంగా ఉండటమే కాకుండా, ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.
ఇది బరువు తగ్గించడంలో, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో, జీర్ణక్రియను మెరుగుపరచడంలో అద్భుతంగా పని చేస్తుంది. బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా దీనిని తయారుచేసుకోవచ్చు. జొన్న పరోటా తయారుచేసుకోడానికి కావాల్సిన పదార్థాలు,తయారీ విధానం ఇక్కడ చూడండి.

జొన్న పరాటా తయారీకి కావాల్సిన పదార్థాలు
-జొన్న పిండి
-గోధుమ పిండి
-జీలకర్ర పొడి
-ధనియాల పొడి
కారం
పసుపు
పచ్చిమిర్చి
అల్లంవెల్లుల్లి పేస్ట్
మెంతి ఆకులు లేదా పాలకూర
తెల్ల నువ్వులు
జొన్న పరాటా తయారీ విధానం
-ముందుగా ఓ పెద్ద గిన్నె తీసుకొని దాని మీద జల్లెడ పెట్టి అందులో 1 కప్పు జొన్న పిండి, జల్లెడ పావు కప్పు గోధుమ పిండి వేసి బాగా జల్లించుకోండి.
-ఇప్పుడు ఆ పిండి మిశ్రమంలోనే సన్నగా తరిగిన 1కప్పు మెంతి ఆకులు లేదా పాలకూర తరుగు, రుచికి సరిపడా ఉప్పు, 3 టీస్పూన్ల తెల్ల నువ్వులు, 1టీస్పూన్ ధనియాల పొడి, కొద్దిగా కారం,పావు టస్పూన్ పసుపు, అర టీస్పూన్ పచ్చిమిర్చి పేస్ట్ లేదా సన్నగా తరిగిన పచ్చిమిర్చి, అర టీస్పూన్ అల్లంవెల్లుల్లి పేస్ట్, అర టీస్పూన్ జీలకర్ర పొడి వేసి మొత్తం బాగా కలిసేలా కలపండి.
-తర్వాత కలిపిన మిశ్రమంలోనే 2 టీస్పూన్ల ఆయిల్, ముప్పావు కప్పు పెరుగు వేసి చేత్తో కలిసేలా బాగా కలపండి. పిండి మరీ మెత్తగా ఉండకూడదు..సెమీ సాఫ్ట్ గా ఉంటే సరిపోతుంది.
-ఇప్పుడు కలిపిన పిండి మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా చేతుల్లోకి తీసుకొని దానిని పొడి జొన్న పిండిలో ముంచి తీసి కాస్త మందంగానే పరాటాలుగా వత్తుకోండి. వత్తుకున్న ఒక్కో పరాటాపైన కొంచెం నువ్వులు కూడా చల్లుకోండి.
-ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టి బాగా వేడి చేసి ఈ పరాటాలను ఒక్కొక్కటిగా వేసి బాగా కాల్చుకోండి. అంతే జొన్న పరాటా రెడీ.
-
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications