Latest Updates
-
ప్రోటీన్లు, ఫైబర్ పుష్కలం.. ఉదయాన్నే తినాల్సిన హెల్తీ మల్టీగ్రెయిన్ దోస ఇదే! -
చికెన్, మటన్ కాదు.. ఎప్పుడైనా కమ్మటి మునగకాయ బిర్యానీ ట్రై చేశారా? -
మనిషికి పంది కిడ్నీ.. ఏకంగా 271 రోజులు.. వైద్య చరిత్రలో మహాద్భుతం! -
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్‌లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.!
సాయంత్రం చిరుతిళ్లకి ఏం చేయాలో తెలియట్లేదా.. చిరు చినుకుల్లో ఈ సింపుల్, హెల్తీ స్నాక్స్‌పై ఓ లుక్కేయండి.!
వర్షాకాలం ప్రతి పూట వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. అందుకే ఆహారం విషయానికొచ్చేసరికి వేడివేడిగా తినాలనిపిస్తుంది. ముఖ్యంగా సాయంత్రం అవగానే పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా స్నాక్స్ కోసం ఆరాటపడుతుంటారు. ఇక వర్షం పడుతుంటే క్రంచీగా, కారంగా ఉండే వాటికి మొగ్గు చూపుతారు. మరి, అందుకోసం బయటకు వెళ్లకుండా ఇంట్లోనే ఈజీగా, హెల్తీగా చేసుకునే స్నాక్స్ ఉన్నాయి. ఆ లిస్ట్ ఏంటో చూద్దాం..

బ్రేక్‌ఫాస్ట్, స్నాక్స్ ఇలా రెండింటి కోసం లైట్‌గా, హెల్తీగా తినడం కోసం సింపుల్‌గా అయిపోయే వెజ్ వంటకాల జాబితా
ఉల్లిపాయ పకోడీలు- వర్షం పడుతున్న సమయంలో ఉల్లిపాయ పకోడీలు ఇచ్చే మజానే వేరు. వేడి వేడి పకోడీలు, టీ లేదా కాఫీ కాంబినేషన్ ఎవర్ గ్రీన్ అని చెప్పొచ్చు.
ఆలూ పకోడీలు- టమాటా సాస్ లేదా పల్లీ చట్నీతో కరకరలాడే బంగాళదుంప పకోడీలను ఈ సారి తప్పక ట్రై చేయండి.
మిక్స్‌డ్ వెజిటబుల్ పకోడీలు- కేవలం ఉల్లి, బంగాళాదుంపతోనే కాకుండా శనగపిండిలో వివిధ రకాల కూరగాయలు వేసి క్రంచీగా ఉండే పకోడీలు పోషకాలను అందించడంతో రుచికరంగా ఉంటాయి.

పనీర్ పకోడీ- ప్రొటీన్ రిచ్ పనీర్‌తో చేసుకునే పకోడీలు బయట క్రంచీగా లోపల సాఫ్ట్‌గా ఉంటూ నాలుకకి కొత్త అనుభూతిని ఇస్తాయి.
పాలక్ పకోరా- ఉల్లి పకోడీ తర్వాత అత్యంత ఫేమస్ పాలకూర పకోడీ. తిన్నంత సేపు క్రంచీగా ఉంటూ భలే టేస్టీగా ఉంటాయి.
బ్రెడ్ రోల్స్- బ్రౌన్ బ్రెడ్‌పై బంగాళాదుంపతో చేసిన మసాలాను రోల్ చేసి కాల్చుకుని తింటే ఆ మజానే వేరు. పిల్లలు, పెద్దలు ఇష్టంగా తింటారు.
వెజ్ కట్లెట్- కట్‌లెట్ కోసం బయటకు వెళ్లకుండా ఇంట్లోనే సాయంత్రం సమయంలో వివిధ రకాల కూరగాయలతో వెజ్ కట్‌లెట్స్ రుచిలో ఎవర్‌గ్రీన్.
ఆలూ టిక్కీ- పైన క్రంచీగా ఉంటూ, లోపల సాఫ్ట్‌గా ఉండే ఆలూ టిక్కీ.. టమాటా సాస్‌తో తింటే అద్భుతః అనాల్సిందే.
సమోసా- ఉల్లి సమోసా లేదా ఆలూ సమోసా.. చిరుతిండిలో బెస్ట్ ఛాయిస్. పైన క్రంచీగా లోపల్ లేయర్స్‌తో పాటు స్పైసీగా ఉండటంతో లొట్టలేసుకుంటూ తింటారు.
కచోరీ- వర్షాకాలంలో కచోరీ టమాటా సాస్‌తో అద్భుతంగా ఉంటుంది.
మసాలా కార్న్ చాట్- మొక్కజొన్న, మసాలాలు, నిమ్మకాయతో చేసే మసాలా కార్న్ చాట్ పొట్టకి తేలికగా ఉంటుంది. రుచికరంగానూ ఆరోగ్యకరంగా ఉంటుంది.
వెజ్ మోమోస్- తక్కువ ఆయిల్‌తో ఆవిరి మీద ఉడికించిన వెజ్ మోమోస్.. పల్లీ చట్నీతో లేదా టమాటా చట్నీతో సూపర్‌గా ఉంటుంది.
వెజ్ స్ప్రింగ్ రోల్స్- సాయంత్రం సమయంలో చిల్లీ సాస్‌తో కరకరలాడే స్ప్రింగ్ రోల్స్‌ను చేసుకుని తింటే ఇంటిల్లిపాదీ లొట్టలేసుకుంటూ తింటారు.
దహీ కబాబ్- బయట క్రంచీగా, లోపల సాఫ్ట్‌గా ఉండే దహీ కబాబ్‌లు బ్రేక్‌ఫాస్ట్ లేదా స్నాక్స్‌లోకి బాగుంటుంది.

పనీర్ టిక్కా- తందూరి మసాలాలు దట్టించి చేసిన పనీర్ టిక్కా అటు హెల్తీగా ఇటు టేస్టీగా ఉంటూ అందరికీ ఫేవరెట్ అవుతుంది.
వెజ్ మంచూరియన్- క్యాబేజీ లేదా కాలీ ఫ్లవర్‌తో చేసుకునే వెజ్ మంచూరియన్ వర్షాకాలంలో బెస్ట్ స్నాక్.
చిల్లీ పనీర్- భోజనంలో స్టార్టర్ లేదా స్నాక్‌గా చిల్లీ పనీర్‌ను చేసుకుని తినవచ్చు.
వెజ్ ఉత్తప్పం- ఇడ్లీ పిండిలో కూరగాయలు కలిపి ఊతప్పం చేసుకున్నట్లయితే రుచికరంగా, పోషకంగా ఉంటుంది.
చీజ్ శాండ్‌విచ్- బ్రెడ్ ముక్కలపైన చీజ్, కూరగాయలతో స్టఫ్ చేసి శాండ్‌విచ్ చేసుకుని తిన్నట్లయితే హెల్తీగానూ రుచికరంగానూ ఉంటుంది.
సగ్గుబియ్యం వడ- ఆరోగ్యానికి మేలు చేసే సగ్గుబియ్యంతో తయారుచేసే వడలు స్నాక్స్ టైంలో బెస్ట్ ఛాయిస్
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
