Latest Updates
-
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్!
మునగాకు నువ్వుల పచ్చడితో ఎముకలు ఉక్కుగా మారాల్సిందే.. సింపుల్‌గా ఇలా చేసేయండి.!
ఔషధ గుణాలున్న మునగాకుని వంటల్లో చేర్చుకుంటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావు. మునగాకును వివిధ రకాలుగా వంటల్లో చేర్చుకోవచ్చు. రసం, పప్పు, పచ్చడి ఇలా చేసుకుని తినడం ద్వారా అందులోని పోషకాలు పుష్కలంగా అందుతాయి. మునగాకులో నువ్వులు కలిపి పచ్చడి చేసుకుని తినడం ద్వారా ఎముకల బలహీనత ఉన్నవారికి సంజీవనిలా పనిచేస్తుంది.

మునగాకు నువ్వుల పచ్చడి తయారీకి కావాల్సిన పదార్థాలు
మునగాకు- ఒక కప్పు
తెల్ల నువ్వులు- 50 గ్రాములు
టమాటా- మీడియం సైజు- ఒకటి
పచ్చిమిర్చి- కారానికి తగినంతగా ఐదు లేదా ఆరు
ఎండుమిర్చి- 4
వెల్లుల్లి- 6
ధనియాలు- టీస్పూన్
చింతపండు- నిమ్మకాయ సైజు
బెల్లం- చిన్న ముక్క
కరివేపాకు- తాలింపు కోసం
ఉప్పు- రుచికి సరిపడా
నూనె- 3 టేబుల్ స్పూన్లు
మునగాకు నువ్వుల పచ్చడి తయారీ విధానం
ముందుగా పాన్‌లో కొద్దిగా నూనె లేదా నెయ్యి వేసి వేడయ్యాక నువ్వులను వేసి దోరగా వేయించి చల్లారాక మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మునగాకును కడిగి పెట్టుకోవాలి. అదే పాన్‌లో నూనె వేసి మునగాకును వేసి పచ్చివాసన పోయేవరకు వేయించి పక్కన పెట్టుకోవాలి.
ఇప్పుడు పాన్‌లో నూనె వేసి ధనియాలు వేసి వేగాక.. పచ్చిమిర్చి, టమాటా, వెల్లుల్లి, కరివేపాకు, చింతపండు, ఎండుమిర్చి, వెల్లుల్లి వేసి బాగా మగ్గనివ్వాలి. రుచికి సరిపడా ఉప్పు వేసి కలుపుకోవాలి. చల్లారాక మిక్సీ జార్ తీసుకుని అందులో నువ్వుల పొడి, మునగాకుతో పాటు ఈ మిశ్రమాన్ని వేసి మరీ మెత్తగా, మరీ గరుకుగా కాకుండా మోతాదుగా రుబ్బుకోవాలి. ఇప్పుడు చిన్న కడాయిలో నూనె పోసి తాలింపు పెట్టుకోవాలి. అంతే రుచికరమైన, ఆరోగ్యకరమైన మునగాకు నువ్వుల పచ్చడి రెడీ.
మునగాకు నువ్వుల పచ్చడిని వారానికోసారి తీసుకోవడం ద్వారా ఇందులో ఉండే కాల్షియం ఎముకలను, కీళ్లను దృఢంగా మారుస్తుంది. వీటిలోని ఐరన్ వల్ల శరీరంలో హిమోగ్లోబిన్ శాతం పెరుగుతుంది. రక్తహీనతను నివారిస్తుంది.
ఈ పచ్చడిలో విటమిన్ సి సమృద్ధిగా లభిస్తుంది. వర్షాకాలంలో ఈ వంటకాన్ని తరచుగా తినడం ద్వారా సీజనల్ వ్యాధులైన జలుబు, దగ్గు, వైరల్ ఫీవర్ సమస్యలు రాకుండా రోగనిరోధక శక్తిని పెంచుతుంది. వ్యాధులతో పోరాడే శక్తిని ఇస్తుంది.
మునగాకు నువ్వుల పచ్చడిలో విటమిన్- ఎ పుష్కలంగా ఉంటుంది. దీంతో కంటి చూపు మెరుగుపడుతుంది. చర్మ సంరక్షణకు దోహదపడుతుంది. బ్యాక్టీరియా, ఇన్‌ఫెక్షన్ల బారి నుంచి కాపాడుతుంది. నువ్వులలోని యాంటీఆక్సిడెంట్లు చెడు కొలెస్ట్రాల్‌ను నివారిస్తుంది. ఫలితంగా గుండె పనితీరు మెరుగుపడి ఆరోగ్యకరంగా ఉంటుంది. ఈ పచ్చడిలోని ఫైబర్ కారణంగా జీర్ణక్రియ సులభంగా జరుగుతుంది. జీర్ణవ్యవస్థ ఆరోగ్యకరంగా పనిచేస్తుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications