Latest Updates
-
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే!
Christmas 2024 special: క్రిస్మస్ స్పెషల్ రోజ్ మిల్క్ కేక్.. ఇది తింటే ప్లమ్ కేక్ కూడా మర్చిపోతారు! ఎలా చేసుకో
క్రిస్మస్ వచ్చేసింది. చాలా మంది క్రైస్తవుల ఇంట్లో పండగ మొదలయ్యింది కూడా. ఈ క్రిస్మస్ సందర్భంగా చాలా మంది తమ ఇంటికి వచ్చే వాళ్లకు విందు పెట్టి కేక్ ఇస్తుంటారు. అందులో అత్యంత ఆకర్షణీయంగా, అత్యంత రుచికరంగా ఉండేది మాత్రం రోజ్ మిల్క్ కేక్ అని చెప్పుకోవచ్చు. ప్లమ్ కేక్ కంటే ఈ కేక్ టేస్ట్ సూపర్ ఉంటుంది. దీనిని తాయారు చేసుకోవడం కూడా చాలా సులభం. ఈ కేక్ ఎలా చేసుకోవాలి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి అనేది ఈ స్టోరీలో క్లియర్ కట్‌గా తెలుసుకుందాం.
క్రిస్మస్ స్పెషల్ రోజ్ మిల్క్ కేక్ తాయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు
ముప్పావు కప్పు డిస్టిల్డ్ మిల్క్
అరకప్పు చెక్కెర
ఒక టేబుల్ స్పూన్ పెరుగు
అరకప్పు రిఫైన్డ్ ఆయిల్
నాలుగు టేబుల్ స్పూన్ల రోజ్ సిరప్
కొద్దిగా రోజ్ ఫుడ్ కలర్
రెండు కప్పుల మైదా
ఒక టేబుల్ స్పూన్ బేకింగ్ పొడి
అర టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా
రోజ్ మిల్క్ చేయడానికి
ఒక కప్పు పాలు
మూడు టేబుల్ స్పూన్ల కండెన్స్‌డ్ మిల్క్
ఒక టేబుల్ స్పూన్ రోజ్ సిరప్
క్రీం కోసం
200 మిల్లి లీటర్ల విప్డ్ క్రీమ్
అరకప్పు ఐసింగ్ షుగర్
రోజ్ మిల్క్ కేక్ తయారీ విధానం
ముందుగా ఒక గిన్నెలో చల్లారిన పాలను పోసి అందులో పంచదార, పెరుగు, రిఫైన్డ్ ఆయిల్, రోజ్ సిరప్, రోజ్ ఫుడ్ కలర్ వేసి బాగా కలపాలి. ఆ తర్వాత వెడల్పాటి గిన్నె పైన మైదా, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా వేసి జల్లెడ పట్టాలి.
తర్వాత మరో గిన్నెలో రోజ్ మిల్క్‌తో జల్లెడ పట్టిన పిండిని కొద్దిగా వేసి ఉండలు లేకుండా బాగా కలపాలి. తర్వాత కేక్ ట్రే తీసుకుని అందులో బటర్ పేపర్ వేసి, బటర్ అప్లై చేసి, మిక్స్ చేసిన కేక్ మిశ్రమాన్ని పోసి నేలపై ఒకసారి తట్టాలి.
తర్వాత ఓవెన్‌ను 180 డిగ్రీల సెల్సియస్ వద్ద 15 నిమిషాల పాటు వేడి
చేయాలి. అనంతరం కేక్ ట్రేని అదే 180 డిగ్రీల సెల్సియస్ వద్ద ఓవెన్‌లో
ఉంచి 30 నిమిషాలు బేక్ చేయాలి. * తర్వాత కేక్ తీసి చల్లార్చుకోవాలి.
అందులోని బటర్ పేపర్ కూడా తీసేయాలి. అనంతరం కేక్ పైభాగంలో అసమానంగా
ఉప్పు కలిపిన భాగాన్ని కట్ చేసి తొలగించండి.
ఆ తర్వాత ఒక గిన్నెలో చిక్కటి రోజ్ మిల్క్ సిద్ధం చేసుకోవాలి. అందుకు
ఒక గిన్నెలో పాలు, కండెన్స్‌డ్ మిల్క్, రోజ్ సిరప్ వేసి బాగా
కలపాలి. ఆ తర్వాత కేక్‌ను మళ్లీ ట్రేలో పెట్టి, రోజ్ మిల్క్‌ను
కేక్‌పై పోసి 30 నిమిషాల పాటు ఫ్రిజ్‌లో ఉంచాలి.
ఇంతలో, ఒక గిన్నెలో విప్డ్ క్రీమ్ తీసుకొని బ్లెండర్తో 2 నిమిషాలు బ్లెండ్ చేసుకోవాలి. తర్వాత ఐసింగ్ షుగర్ వేసి 15 నిమిషాల పాటు బాగా బీట్ చేస్తే క్రీమ్ రెడీ. చివరగా ఫ్రిజ్ లోంచి కేక్ తీసుకుని, దానిపై విప్డ్ క్రీంను సమంగా రాసి, పైన తరిగిన బాదంపప్పు, పిస్తా పప్పులు చల్లి, గులాబీ రేకులు చల్లి అలంకరిస్తే రుచికరమైన రోజ్ మిల్క్ కేక్ రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications












