Latest Updates
-
ఆఫీస్ నుంచి రాగానే అలసటగా ఉందా? 15 నిమిషాల్లో ఈ క్రీమీ పనీర్ గ్రేవీ ట్రై చేయండి..చపాతీ, రైస్ లోకి కేక -
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.! -
క్యాప్సికం టమాటో మసాలా కర్రీ..ఆలోచించొద్దు అద్దిరిపోతుంది అంతే..ఎలా చేసుకోవాలంటే.. -
ఆ ఆలయంలో మట్టితో పూజించి పొలంలో చల్లుకుంటే.. బంగారు పంటలు పండాల్సిందే.! -
శృంగార సమయంలో మహిళలు ఈ తప్పు ఎట్టిపరిస్థితుల్లో చేయకూడదు! -
మీ పిల్లలు బొటనవేలుని అదే పనిగా చీకుతుంటే.. ఈ వ్యాధులకి తలుపు తెరిచినట్లే.! -
జీరో ఆయిల్,సూపర్ టేస్ట్..చపాతీ, పుల్కాల్లోకి పనీర్ మటర్ మలై ఇలా చేసేయండి!
Christmas 2024 special: క్రిస్మస్ స్పెషల్ రోజ్ మిల్క్ కేక్.. ఇది తింటే ప్లమ్ కేక్ కూడా మర్చిపోతారు! ఎలా చేసుకో
క్రిస్మస్ వచ్చేసింది. చాలా మంది క్రైస్తవుల ఇంట్లో పండగ మొదలయ్యింది కూడా. ఈ క్రిస్మస్ సందర్భంగా చాలా మంది తమ ఇంటికి వచ్చే వాళ్లకు విందు పెట్టి కేక్ ఇస్తుంటారు. అందులో అత్యంత ఆకర్షణీయంగా, అత్యంత రుచికరంగా ఉండేది మాత్రం రోజ్ మిల్క్ కేక్ అని చెప్పుకోవచ్చు. ప్లమ్ కేక్ కంటే ఈ కేక్ టేస్ట్ సూపర్ ఉంటుంది. దీనిని తాయారు చేసుకోవడం కూడా చాలా సులభం. ఈ కేక్ ఎలా చేసుకోవాలి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి అనేది ఈ స్టోరీలో క్లియర్ కట్‌గా తెలుసుకుందాం.

క్రిస్మస్ స్పెషల్ రోజ్ మిల్క్ కేక్ తాయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు
ముప్పావు కప్పు డిస్టిల్డ్ మిల్క్
అరకప్పు చెక్కెర
ఒక టేబుల్ స్పూన్ పెరుగు
అరకప్పు రిఫైన్డ్ ఆయిల్
నాలుగు టేబుల్ స్పూన్ల రోజ్ సిరప్
కొద్దిగా రోజ్ ఫుడ్ కలర్
రెండు కప్పుల మైదా
ఒక టేబుల్ స్పూన్ బేకింగ్ పొడి
అర టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా
రోజ్ మిల్క్ చేయడానికి
ఒక కప్పు పాలు
మూడు టేబుల్ స్పూన్ల కండెన్స్‌డ్ మిల్క్
ఒక టేబుల్ స్పూన్ రోజ్ సిరప్
క్రీం కోసం
200 మిల్లి లీటర్ల విప్డ్ క్రీమ్
అరకప్పు ఐసింగ్ షుగర్
రోజ్ మిల్క్ కేక్ తయారీ విధానం
ముందుగా ఒక గిన్నెలో చల్లారిన పాలను పోసి అందులో పంచదార, పెరుగు, రిఫైన్డ్ ఆయిల్, రోజ్ సిరప్, రోజ్ ఫుడ్ కలర్ వేసి బాగా కలపాలి. ఆ తర్వాత వెడల్పాటి గిన్నె పైన మైదా, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా వేసి జల్లెడ పట్టాలి.
తర్వాత మరో గిన్నెలో రోజ్ మిల్క్‌తో జల్లెడ పట్టిన పిండిని కొద్దిగా వేసి ఉండలు లేకుండా బాగా కలపాలి. తర్వాత కేక్ ట్రే తీసుకుని అందులో బటర్ పేపర్ వేసి, బటర్ అప్లై చేసి, మిక్స్ చేసిన కేక్ మిశ్రమాన్ని పోసి నేలపై ఒకసారి తట్టాలి.
తర్వాత ఓవెన్‌ను 180 డిగ్రీల సెల్సియస్ వద్ద 15
నిమిషాల పాటు వేడి చేయాలి. అనంతరం కేక్ ట్రేని అదే 180 డిగ్రీల
సెల్సియస్ వద్ద ఓవెన్‌లో ఉంచి 30 నిమిషాలు బేక్ చేయాలి. *
తర్వాత కేక్ తీసి చల్లార్చుకోవాలి. అందులోని బటర్ పేపర్ కూడా
తీసేయాలి. అనంతరం కేక్ పైభాగంలో అసమానంగా ఉప్పు కలిపిన భాగాన్ని కట్
చేసి తొలగించండి.
ఆ తర్వాత ఒక గిన్నెలో చిక్కటి రోజ్ మిల్క్ సిద్ధం చేసుకోవాలి. అందుకు
ఒక గిన్నెలో పాలు, కండెన్స్‌డ్ మిల్క్,
రోజ్ సిరప్ వేసి బాగా కలపాలి. ఆ తర్వాత
కేక్‌ను మళ్లీ ట్రేలో పెట్టి, రోజ్ మిల్క్‌ను
కేక్‌పై పోసి 30 నిమిషాల పాటు ఫ్రిజ్‌లో
ఉంచాలి.
ఇంతలో, ఒక గిన్నెలో విప్డ్ క్రీమ్ తీసుకొని బ్లెండర్తో 2 నిమిషాలు బ్లెండ్ చేసుకోవాలి. తర్వాత ఐసింగ్ షుగర్ వేసి 15 నిమిషాల పాటు బాగా బీట్ చేస్తే క్రీమ్ రెడీ. చివరగా ఫ్రిజ్ లోంచి కేక్ తీసుకుని, దానిపై విప్డ్ క్రీంను సమంగా రాసి, పైన తరిగిన బాదంపప్పు, పిస్తా పప్పులు చల్లి, గులాబీ రేకులు చల్లి అలంకరిస్తే రుచికరమైన రోజ్ మిల్క్ కేక్ రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications