Latest Updates
-
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే! -
ఆ సమయంలోనే దంపతుల మధ్య ఎక్కువగా గొడవలు.. కారణాలేంటంటే.? -
ఈ పొడిని డైలీ అన్నం లేదా టిఫిన్లోకి తిన్నారంటే.. ఇక మందుల జోలికి వెళ్లాల్సిన పనిలేదు.! -
Teachers day recipe :ఉపాధ్యాయ దినోత్సవం స్పెషల్.. గురువుల కోసం కమ్మని పనీర్ పాయసం చేయండిలా.. -
ఉడకబెట్టాల్సిన పని లేదు.. చిక్కుడుకాయను కేటరింగ్ స్టైల్లో ఇలా చేస్తే ఫుల్గా లాగించేస్తారు.! -
తండ్రి తన ఆస్తి మొత్తం కొడుకుకి రాసిస్తే కూతురు పరిస్థితి ఏంటి? చట్టం ఏం చెబుతోంది? -
జెన్ జెడ్ తరానికి శ్రీకృష్ణుడి సందేశం.. గీత నుంచి నేటి యువత నేర్చుకోవాల్సిన కీలక పాఠాలివే.! -
కేవలం 15 నిమిషాల్లో.. పైకి కరకరలాడుతూ, లోపల సాఫ్ట్ గా ఉండే ఎగ్ పకోడి ఎలా చేసుకోవాలంటే.. -
కొత్తగా తల్లయిన వారికి అలర్ట్.. పిల్లలకు రెండేళ్ల వరకు ఇదొక్కటి అస్సలు ఇవ్వకూడదు.!
ముంబై స్టైల్ మసాలా ప్యాటీస్ పావ్.. వర్షం పడుతుంటే వేడివేడిగా తింటుంటే మస్త్ మజా..!
ముంబై అనగానే మనకు వెంటనే గుర్తొచ్చేది అక్కడి వీధుల్లో దొరికే నోరూరించే స్ట్రీట్ ఫుడ్. వడపావ్, పావ్ భాజీ లాంటివి మనందరికీ తెలుసు. కానీ, ఎప్పుడైనా మసాలా ప్యాటీస్ పావ్ రుచి చూశారా? ముంబై వీధుల్లో సాయంత్రం వేళ అద్భుతమైన సువాసనలతో ఈ ప్యాటీస్ పావ్ అందరినీ ఇట్టే ఆకట్టుకుంటుంది. వర్షాకాలం లేదా సాయంత్రం టీ టైమ్ లో తినడానికి ఇది సరైన స్నాక్.

మసాలా ప్యాటీస్ పావ్ తయారీకి కావలసిన పదార్థాలు
బంగాళదుంపలు - 3
పనీర్ తురుము - అర కప్పు
నూనె -3 టేబుల్ స్పూన్లు
వెల్లుల్లి రెబ్బలు - 8
పచ్చిమిర్చి - 2
కరివేపాకు - 8-10 ఆకులు
పసుపు - అర టీస్పూన్
ఉప్పు - రుచికి సరిపడా
కొత్తిమీర - 2 టేబుల్ స్పూన్లు
వెల్లుల్లి రెబ్బలు - 10-12
కశ్మీరీ కారం పొడి - 3-4 టేబుల్ స్పూన్లు
బ్లాక్ సాల్ట్ (నల్ల ఉప్పు) - అర టీస్పూన్
వేయించిన జీలకర్ర పొడి - 1 టీస్పూన్
నూనె - 2 టేబుల్ స్పూన్లు
కొత్తిమీర - గుప్పెడు
పావ్ బన్స్ - 6
ఉల్లిపాయ, టమాటా - రౌండ్ ముక్కలుగా కోసుకోవాలి
సేవ్ (సన్న కారప్పూస) - కొద్దిగా
వెన్న (బటర్) - పావ్ టోస్ట్ చేయడానికి
మసాలా ప్యాటీస్ పావ్ తయారీ విధానం
-ముందుగా ఒక పాన్ తీసుకుని అందులో 2-3 టేబుల్ స్పూన్ల నూనె వేడి చేయండి. అందులో కచ్చాపచ్చాగా దంచిన వెల్లుల్లి, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, కరివేపాకు వేసి కమ్మటి సువాసన వచ్చేంతవరకు ఒక నిమిషం పాటు దోరగా వేయించండి. ఇప్పుడు అందులో ముందుగా మాష్ చేసి పెట్టుకున్న బంగాళదుంపలు, పనీర్ తురుము వేసి బాగా కలపండి. రుచికి సరిపడా ఉప్పు, పసుపు, తరిగిన కొత్తిమీర వేసి అన్నీ కలిసేలా మరో రెండు నిమిషాలు ఉడికించండి. ఆ తర్వాత స్టవ్ ఆపేసి, ఈ మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వండి.
-చల్లారిన ఆలూ-పనీర్ మిశ్రమాన్ని తీసుకుని చిన్నచిన్న ఉండలుగా చేసి, అరచేతితో ఒత్తి గుండ్రని టిక్కీల్లా (ప్యాటీస్) తయారు చేసుకోండి.
-ఇప్పుడు పెనం మీద కొద్దిగా నూనె వేడి చేసి, ఈ ప్యాటీస్ ను రెండు వైపులా బంగారు వర్ణం వచ్చేలా, కరకరలాడేలా షాలో ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇవి బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్ గా ఉంటాయి.
-వెల్లుల్లి-కారం చట్నీ తయారీ కోసం ఒక మిక్సీ జార్ లో 10-12 వెల్లుల్లి రెబ్బలు, కాశ్మీరీ కారం, బ్లాక్ సాల్ట్, వేయించిన జీలకర్ర పొడి, కొద్దిగా నూనె వేసి బరకగా మిక్సీ పట్టుకోండి. ఈ చట్నీయే ఈ రెసిపీకి అసలైన ముంబై వీధుల రుచిని తీసుకువస్తుంది.
-ప్యాటీస్ వేయించిన అదే పెనం మీద కొద్దిగా నూనె వేసి, మనం మిక్సీ పట్టుకున్న చట్నీని వేసి 30-45 సెకన్ల పాటు వేయించండి. అందులో కొద్దిగా కొత్తిమీర చల్లండి. ఇలా వేయించడం వల్ల పచ్చివాసన పోయి, వెల్లుల్లి ఘాటు, అద్భుతమైన స్మోకీ ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు ఈ చట్నీని పెనం మొత్తం సమానంగా స్ప్రెడ్ చేయండి.
-పావ్ బన్స్ను మధ్యలోకి కట్ చేసి, పెనం మీద ఉన్న వేడివేడి చట్నీ పై నేరుగా ఉంచండి. పావ్ లోపలి భాగం మొత్తం ఆ ఘాటైన చట్నీని పీల్చుకునేలా, కొద్దిగా క్రిస్పీగా అయ్యేంతవరకు టోస్ట్ చేయండి. ఆ చట్నీ పావ్ కి అంటుకుని భలే ఆకర్షణీయంగా కనిపిస్తుంది.
-ఇప్పుడు చట్నీ రాసి టోస్ట్ చేసిన పావ్ బన్ తీసుకుని, లోపల ముందుగా వేయించి పెట్టుకున్న వేడివేడి ఆలూ-పనీర్ ప్యాటీస్ పెట్టండి. దాని పైన ఉల్లిపాయ, టమాటా ముక్కలు పెట్టి, కొద్దిగా సేవ్ (కారప్పూస) చల్లండి. పావ్ ను మూసేసి చిన్నగా ప్రెస్ చేయండి.
-అంతే ముంబై స్ట్రీట్ స్టైల్ మసాలా ప్యాటీస్ పావ్ రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications