Latest Updates
-
2026 అంతర్జాతీయ యోగా దినోత్సవ ప్రత్యేకత ఇదే! -
ప్రేమలో అనుబంధం ఎప్పుడు మానసిక భారంగా మారుతుంది -
మైదా లేదు, భయం లేదు.. ఇంట్లోనే సులభంగా హెల్దీ బ్రెడ్-రవ్వ పిజ్జా.. -
మీ మొబైల్ ఫోన్లో ఈ వాల్ పేపర్ ఉంటే.. రోజూ అదృష్టం మీ వెంటే.! -
కలలో బొద్దింకలు కనిపిస్తే.. మీ జీవితంలో ఏం జరుగుతుందో తెలుసా.? -
జేబులో రూ.200 ఉంటే చాలు.. హైదరాబాద్ లో మీ ఫ్రెండ్స్ తో గడిపే సూపర్ ప్లాన్స్ ఇవే! -
చేసిన పనికి గుర్తింపు లేకపోతే ప్రేమ ఎలా తగ్గిపోతుంది -
బరువు తగ్గాలనుకునే వారు మామిడి పండ్లు తినొచ్చా? ఫిట్నెస్ నిపుణులు ఏమంటున్నారంటే! -
నేడు ఈ రాశుల వారికి అదృష్టం వరిస్తోంది.. ఊహించని ధనలాభం మీ సొంతం! -
భీమవరం స్పెషల్ చిట్టి రొయ్యల బిర్యానీ..ఘుమఘుమలాడే గోదావరి రుచి మీ ఇంట్లోనే..
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు!
సాధారణంగా మటన్ లివర్ ఫ్రై లేదా రోస్ట్ అనగానే చాలామంది పెదవి విరుస్తుంటారు. దానికి ఉండే ఒక రకమైన వాసన వల్ల పిల్లలు, పెద్దలు కూడా దాన్ని తినడానికి ఆసక్తి చూపరు.
రొటీన్ గా చేసే గ్రేవీల కంటే కాస్త భిన్నంగా, మసాలాలు దట్టించి రోస్ట్ లేదా ఫ్రై లాగా చేస్తే లివర్ వద్దన్న వారే లొట్టలేసుకుని మరీ తింటారు. నోరూరించే మటన్ లివర్ ఫ్రై ఎలా చేయాలో ఇక్కడ చూడండి.

మటన్ లివర్ ఫ్రై తయారీకి కావాల్సిన పదార్థాలు
కొబ్బరి తురుము - 2 టీస్పూన్లు
చిన్న ఉల్లిపాయలు - ఒక గుప్పెడు
అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 టీస్పూన్
చిన్న టమోటా - 1 (సన్నగా తరిగినది)
మ్యారినేషన్ (నానబెట్టడం) కోసం:
మేక కాలేయం (లివర్) - 1 (శుభ్రం చేసినది)
పసుపు - చిటికెడు
కారం పొడి - ముప్పావు టీస్పూన్
నూనె - 1 టీస్పూన్
నువ్వుల నూనె- 3 టీస్పూన్లు
సోంపు - ఒక చిటికెడు
కరివేపాకు - 2 రెమ్మలు
చిన్న ఉల్లిపాయలు - 10
టమోటా - 1 (తరిగినది)
ఉప్పు - రుచికి సరిపడా
మిరియాల పొడి - 1 టీస్పూన్
కొత్తిమీర - కొద్దిగా
నీళ్లు - కొద్దిగా
మటన్ లివర్ ఫ్రై తయారీ విధానం
-ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకోండి. అందులో కొబ్బరి తురుము, పొట్టు తీసిన చిన్న ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, చిన్న టమోటా ముక్కలు వేసి కొద్దిగా నీళ్లు చిలకరించి మెత్తని పేస్ట్ లా రుబ్బుకోవాలి.
ఇప్పుడు శుభ్రంగా కడిగి పెట్టుకున్న మటన్ లివర్ ను చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఒక గిన్నెలో ఈ లివర్ ముక్కలను వేసి, అందులో కొద్దిగా పసుపు, కారం, ఒక టీస్పూన్ నూనె, మనం ముందుగా రుబ్బి పెట్టుకున్న మసాలా పేస్ట్ వేసి ముక్కలన్నింటికీ పట్టేలా బాగా కలపాలి. దీన్ని అరగంట పాటు పక్కన ఉంచాలి.
-ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక మందపాటి పాన్ పెట్టుకోండి. అందులో 3 టీస్పూన్ల నువ్వుల నూనె వేయండి. నూనె వేడెక్కాక కొద్దిగా సోంపు, కరివేపాకు వేసి చిటపటలాడనివ్వాలి. మంచి సువాసన వస్తున్నప్పుడు సన్నగా తరిగిన చిన్న ఉల్లిపాయ ముక్కలు వేసి దోరగా వేయించాక అందులో తరిగిన టమోటా ముక్కలు, రుచికి సరిపడా ఉప్పు వేసి టమోటాలు మెత్తబడే వరకు మగ్గనివ్వాలి.
- తర్వాత ముందుగా నానబెట్టుకున్న లివర్ ముక్కలను వేసి బాగా కలపండి. కొద్దిగా నీళ్లు పోసి మూతపెట్టి, మంటను మీడియంలో ఉంచి 5 నిమిషాల పాటు నూనె పైకి తేలేవరకు ఉడికించాలి.
-5 నిమిషాల తర్వాత మూత తీసి, ఒక టీస్పూన్ ఘాటైన మిరియాల పొడి
చల్లండి. అంతా ఒకసారి బాగా కలిపి, మళ్లీ మూతపెట్టి సన్నని మంట మీద మరో
2 నిమిషాలు ఉడికించండి. చివరగా, తాజా కరివేపాకు, సన్నగా తరిగిన
కొత్తిమీర పైన చల్లి స్టవ్ ఆఫ్ చేసుకోండి.
అంతే ఎంతో రుచికరమైన, ఆరోగ్యకరమైన మటన్ లివర్ ఫ్రై రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications