Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
మటన్ సుక్కా ఫ్రై..ఈ స్పెషల్ మసాలాతో చేస్తే రుచి వేరే లెవల్
భారతీయ వంటకాలలో మాంసాహారానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. అందులోనూ మటన్ తో చేసే వంటకాలు రుచికి పెట్టింది పేరు. మటన్ కర్రీ, మటన్ బిర్యానీ అందరికీ తెలిసినవే. కానీ, మటన్ ముక్కలను మసాలాలతో బాగా వేయించి, నీరు లేకుండా పొడిపొడిగా చేసే మటన్ సుక్కా రుచి వేరొక లెవల్ ని పరిచయం చేస్తుంది. సుక్కా అంటే పొడి లేదా డ్రై అని అర్థం.
ఈ వంటకంలో మటన్ ముక్కలకు మసాలా దట్టించి, నూనెలో బాగా వేయించడం వల్ల ఇది ఎంతో రుచిగా ఉంటుంది. మటన్ సుక్కా రుచి అంతా మనం తయారుచేసుకునే తాజా మసాలా పొడిలోనే ఉంటుంది. బయట దొరికే ప్యాకెట్ మసాలాల కంటే, ఇంట్లో నూరుకున్న మసాలా దీనికి అద్భుతమైన రుచిని ఇస్తుంది. మటన్ సుక్కా మీ ఇంట్లోనే ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.

తయారీకి కావాల్సిన పదార్థాలు
-సాంబార్ ఉల్లిపాయలు
-కొత్తిమీర
-ఎండుమిర్చి
-ఆయిల్
-జీలకర్ర
-దాల్చిన చెక్క
-యాలకలు
-లవంగాలు
-ఉప్పు
-ధనియాలు
-పసుపు
-వేడి నీళ్లు
-అల్లంవెల్లుల్లి పేస్ట్
-కరివేపాకు
-ధనియాలు
-రాతిపువ్వు
-సోంపు
-బిర్యానీ ఆకు
-మిరియాలు

తయారీ విధానం
-ముందుగా కుక్కర్ లో 5 టేబుల్ స్పూన్ల నూనె వేడి చెయ్యండి.
-నూనె వేడెక్కాక అందులో 15 సాంబార్ ఉల్లిపాయలు వేసి వేయించుకోండి. ఉల్లిపాయ రంగు మారుతున్నప్పుడు అందులో అరకిలో శుభ్రంగా కడిగిన మటన్ వేయండి. మటన్ లోని నీరు ఇగిరిపొయి, ముక్కల మీద కాలినట్లు ఎర్రటి మచ్చలు ఏర్పడేదాకా పెద్ద మంట మీద వేయించాలి.
-తర్వాత అందులోనే అర టీస్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ అల్లంవెల్లుల్లి పేస్ట్, రుచికి సరిపడా ఉప్పు వేసి 1 నిమిషం వేపండి..ఆ తర్వాత ఒకటిన్నర కప్పుల వేడినీళ్లు పోసి మూతపెట్టి మీడియం మంట మీద 5 విజిల్స్ రానివ్వాలి.
-ఈలోపు మటన్ చుక్కా మసాలా తయారుచేసుకోవాలి. ఇందుకోసం స్టవ్ మీద పాన్ పెట్టి అందులో 1 టీస్పూన్ జీలకర్ర, ఒకటిన్నర అంగుళాల దాల్చిన చెక్క, 8 ఎండుమిర్చి, 4 యాలకలు, అర టీస్పూన్ సోంపు, అర టేబుల్ స్పూన్ మిరియాలు, సగం బిర్యానీ ఆకు, 8 లవంగ మొగ్గలు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, కొంచెం రాతి పువ్వు, రెండు రెబ్బల కరివేపాకు వేసి సన్నని సెగ మీద మంచి సువాసన వచ్చేవరకు వేయించి స్టవ్ ఆపేసి చల్లారనివ్వాలి.
-వేయించినవి చల్లారిన తర్వాత ఈ మొత్తాన్ని మిక్సీ గిన్నెలో వేసి కొంచెం బరకగా పొడి చేసుకోవాలి.
-తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టి అందులో 5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి వేడయ్యాక అందులో అర కప్పు సాంబార్ ఉల్లిపాయలు వేసి అవి లేత గులాబీ రంగులోకి వచ్చాక అందులో 2 రెబ్బల కరివేపాకు వేసి వేపండి. తర్వాత ఉడికించుకున్న మటన్ విశ్రమాన్ని(నీళ్లతో సహా) పాన్ లో వేసి పెద్ద మంట మీద 3 నిమిషాలు వేయించాలి.
-తర్వాత అందులో ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మటన్ సుక్కా మసాలా వేసి కలిపి మీడియం మంట మీద మటన్ లోని నీరు అంతా ఇగిరిపోయి ఆయిల్ పైకి తేలే వరకు ఉడింకంచాలి.
-చివరగా అందులో కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆపేయాలి. అంతే మటన్ సుక్కా ఫ్రై రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications