Latest Updates
-
వర్షాకాలంలో పాదాల పగుళ్లు.. వారానికి రెండు సార్లు ఇలా చేయడం తప్పనిసరి.! -
టీ, కాఫీకి బదులుగా ఒక కప్పు ఇది తాగారంటే.. తలనొప్పి, నీరసం పరార్.! -
మీలో నిజంగా ఆత్మవిశ్వాసం ఉందా.. ఈ ఐదు పాయింట్లు ఉంటే మీకు తిరుగే ఉండదు.! -
Vinayaka chavthi Recipe : గణనాథుడికి ఇష్టమైన నైవేద్యం..రవ్వ ఉండ్రాళ్లు చేయండిలా.. -
పిల్లలకు కోడిగుడ్డు పెడుతున్నారా? ఈ తప్పులు అస్సలు చేయకండి! -
2026 వినాయక చవితి ఎప్పుడు? విగ్రహ ప్రతిష్ఠాపన టైమింగ్స్, పూజా ముహూర్తం, నిమజ్జనం తేదీ వివరాలు! -
వినాయక చవితి స్పెషల్ బెల్లం ఆవిరి కుడుములు..చాలా ఈజీగా చేసుకోండిలా.. -
జీర్ణశక్తిని పెంచే సూపర్ ఫుడ్..మిగిలిపోయిన అన్నంతో టేస్టీ కొత్తిమీర రైస్..లంచ్ బాక్స్ కి పర్ఫెక్ట్! -
ప్రోటీన్లు, ఫైబర్ పుష్కలం.. ఉదయాన్నే తినాల్సిన హెల్తీ మల్టీగ్రెయిన్ దోస ఇదే! -
చికెన్, మటన్ కాదు.. ఎప్పుడైనా కమ్మటి మునగకాయ బిర్యానీ ట్రై చేశారా?
Nellore special chicken vada: నెల్లూరు స్పెషల్ 'చికెన్ వడలు'..చేయడం చాలా చాలా ఈజీ
నాన్ వెజ్ ప్రియుల్లో ఎక్కువమంది చికెన్ తో చేసే వంటకాలు అంటే బాగా ఇష్టపడతారు. చికెన్ తో ఏ వంటకం చేసినా లొట్టలేసుకొని మరీ తింటారు. ఏపీలోని నెల్లూరులో(Nellore) సాయంత్రం పూట బజారుకి వెళ్తే బండ్లమీద చికెన్ వడలు(chicken vada) ఎక్కువగా కనిపిస్తుంటాయి. చాలా టేస్టీగా ఉండే వీటిని నెల్లూరువాళ్లు ఎంతో ఇష్టంగా తింటుంటారు. మందుబాబులు అయితే వీటిని ఎగబడి మరీ కొనుక్కొని స్టఫ్ లోకి తింటారు.
నెల్లూరులో బండ్ల మీద దొరికే చికెన్ వడలను ఇంట్లోనే ఈజీగా,హెల్తీగా తయారుచేసుకోవచ్చు. నెల్లూరు స్పెషల్ చికెన్ వడలు తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఇక్కడ చూడండి.

చికెన్ వడలు తయారీకి కావాల్సిన పదార్థాలు
-బోన్ లెస్ చికెన్
-ధనియాల పొడి
-ఉప్పు
-కారం
-అల్లుంవెల్లుల్లి పచ్చిమిర్చి పేస్ట్
-గరమ్ మసాలా
-శెనగపిండి
-మొక్క జొన్న పిండి
-నూనె
-కొత్తిమీర
-పుదీనా
చికెన్ వడలు తయారీ విధానం
-ముందుగా 200 గ్రాముల బోన్ లెస్ చికెన్ ని మిక్సీ గిన్నెలో వేసి 2 సెకన్లు గ్రైండ్ చేసి ఖీమా మాదిరి చేయండి.
-తర్వాత దాన్ని ఓ బౌల్ లోకి తీసుకోండి. అందులోనే రుచికి సరిపడా ఉప్పు,1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ గరమ్ మసాలా,అర స్పూన్ కారం,2 టేబుల్ స్పూన్ల శెనగపిండి, 1 టేబుల్ స్పూన్ మొక్కజొన్న పిండి,కొంచెం అల్లంవెల్లుల్లి పచ్చిమిర్చి పేస్ట్,కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా వేసి అన్నీ కలిసేలా బాగా కలపండి.
-గట్టిగా కాకుండా,లూస్ గా కాకుండా వడలు వేసుకునేందుకు వీలుగా ఉండేలా కలుపుకోవాలి.
-తర్వాత స్టవ్ మీద బాండీ పెట్టి అందులో ఆయిల్ పోసి వేడి చేయండి.
-ఆయిల్ వేడెక్కిన తర్వాత చికెన్ మిశ్రమాన్ని వడల్లా అద్దుకొని నూనెలో వేయండి. మంటను మీడియం ఫ్లేమ్ లో పెట్టి అటు ఇటు తిప్పుకుంటూ మంచిగా కాల్చండి. అంతే వేడి వేడి చికెన్ వడలు రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
