Latest Updates
-
మనిషికి పంది కిడ్నీ.. ఏకంగా 271 రోజులు.. వైద్య చరిత్రలో మహాద్భుతం! -
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.?
మటన్ కూరను మైమరిపించే వెజ్ మటన్ హండి.. ఈ న్యూ ఇయర్ కి ఇదే స్పెషల్!
సాధారణంగా ఏదైనా పండగ లేదా కొత్త సంవత్సరం వచ్చిందంటే చాలు స్పెషల్ వంటకాలంటే నాన్-వెజ్ మాత్రమే అని చాలామంది భావిస్తుంటారు. కానీ శాఖాహారంలోనూ అద్భుతమైన రుచులు దాగి ఉన్నాయి. మీరు శాఖాహారులై..ఈ న్యూ ఇయర్ వేడుకలకు ఏదైనా కొత్తగా,రుచికరంగా తినాలనుకుంటున్నారా? మాంసాహారానికి ఏమాత్రం తీసిపోని రుచితో, అచ్చం మటన్ కూరలా అనిపించే వెజ్ మటన్ హండి ట్రై చేయాలి.
వెజ్ హండి మటన్ అనే ఈ వంటకం పేరులో మటన్ ఉన్నా ఇది స్వచ్ఛమైన శాకాహారం. సోయాబీన్స్, మష్రూమ్స్, ప్రత్యేక మసాలాల దట్టించి చేసే ఈ కూర, రుచిలో, తినేటప్పుడు ఆకృతిలో అచ్చం మటన్ ముక్కలను తింటున్న అనుభూతిని కలిగిస్తుంది. వెజ్ మటన్ హండి ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.

కావలసిన పదార్థాలు
మీల్ మేకర్- 1 కప్పు
పుట్టగొడుగులు- 1 కప్పు
బంగాళాదుంపలు - 2
క్యారెట్ - 1
కాలీఫ్లవర్ - 1 కప్పు
టమాటా ప్యూరీ - 1 కప్పు
ఉల్లిపాయలు - 2
అల్లంవెల్లుల్లి పేస్ట్ - 1 టేబుల్ స్పూన్
పెరుగు - అర కప్పు
పచ్చిమిర్చి - 2
జీడిపప్పు పేస్ట్ - 2 టేబుల్ స్పూన్లు
కారం- 1 స్పూన్
ధనియాల పొడి- 1 స్పూన్
గరం మసాలా-అర స్పూన్
పసుపు-1 స్పూన్
బిర్యానీ ఆకు
దాల్చిన చెక్క
యాలకులు
నూనె- సరిపడా
కొత్తిమీర - అలంకరణకు
తయారీ విధానం
-సోయాబీన్స్ ను ఉప్పు వేసిన వేడి నీటిలో 10 నిమిషాలు ఉడికించి నీటిని వడకట్టి, చల్లారిన తర్వాత సోయా ముక్కల్లోని నీరంతా పోయేలా గట్టిగా పిండాలి.
-తర్వాత ఒక బాండీలో కొద్దిగా నెయ్యి వేసి ఈ సోయా ముక్కలను దోరగా వేయించి కూరలో వేయాలి. ఇలా చేయడం వల్ల అవి సాగుతూ, నములుతున్నప్పుడు అచ్చం మటన్ ముక్కల్లా అనిపిస్తాయి.
-ముందుగా ప్రెజర్ కుక్కర్ లేదా మందపాటి గిన్నెలో నూనె లేదా నెయ్యి వేడి చేసి బిర్యానీ ఆకు, చెక్క, లవంగాలు వేసి వేయించాలి. అవి సువాసన రాగానే సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి. తర్వాత అల్లంవెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి వేసి పచ్చి వాసన పోయేలా వేయించాలి.
-ఇప్పుడు అందులో టమాటా ప్యూరీ(టమాటాలను మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి) వేసి నూనె పైకి తేలేంత వరకు ఉడికించాలి. తర్వాత మంటను తగ్గించి పెరుగు వేసి ఉండలు కట్టకుండా కలుపుతూ ఉండాలి.
-ఇప్పుడు ముందుగా సిద్దం చేసుకున్న సోయాబీన్ ముక్కలు, బంగాళాదుంప, క్యారెట్, కాలీఫ్లవర్, పుట్టగొడుగులను గ్రేవీలో వేసి కలపాక ఇందులోనే కారం, ధనియాల పొడి, ఉప్పు, చిక్కదనం కోసం జీడిపప్పు పేస్ట్ వేసి మరో 2-3 నిమిషాలు వేయించాలి.
-తగినన్ని నీళ్లు పోసి మూత పెట్టి సన్నని మంటపై 10-12 నిమిషాలు ఉడికించాలి (కుక్కర్ అయితే 1-2 విజిల్స్ సరిపోతాయి).
-చివరగా గరం మసాలా, కొత్తిమీర చల్లి దించేయాలి. అంతే వెజ్ హండి మటన్ రెడీ. వేడి వేడి నాన్, తందూరి రోటీ లేదా జీరా రైస్‌తో ఈ వెజ్ హండి మటన్ ఆస్వాదించండి.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
