Latest Updates
-
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.! -
క్యాప్సికం టమాటో మసాలా కర్రీ..ఆలోచించొద్దు అద్దిరిపోతుంది అంతే..ఎలా చేసుకోవాలంటే.. -
ఆ ఆలయంలో మట్టితో పూజించి పొలంలో చల్లుకుంటే.. బంగారు పంటలు పండాల్సిందే.! -
శృంగార సమయంలో మహిళలు ఈ తప్పు ఎట్టిపరిస్థితుల్లో చేయకూడదు! -
మీ పిల్లలు బొటనవేలుని అదే పనిగా చీకుతుంటే.. ఈ వ్యాధులకి తలుపు తెరిచినట్లే.! -
జీరో ఆయిల్,సూపర్ టేస్ట్..చపాతీ, పుల్కాల్లోకి పనీర్ మటర్ మలై ఇలా చేసేయండి! -
సూర్యుడి నక్షత్రంలోకి శుక్ర గ్రహ గోచారం.. ఈ రాశుల వారికి చరిష్మా మామూలుగా ఉండదు.!
New year special sponge cake: స్పాంజ్ కేక్ ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవచ్చో చూడండి
కొత్త ఏడాదిలోకి అడుగుపెట్టే సమయంలో కేకు కట్ చేసే అలవాటు మనలో చాలామందికి ఉంటుంది. అంతేకాకుండా కొత్త ఏడాది రోజున కేకు ముక్కలు తింటూ ఫ్రెండ్స్ తో చిట్ చాట్ ని చాలామంది ఇష్టపడతారు. అయితే కొత్త ఏడాది సందర్భంగా బేకరీకి వెళ్లి కేక్ కొనకుండా ఇంట్లోనే ఈజీగా కేకు తయారు చేసుకోవచ్చు. ఎగ్ లెస్ స్పాంజ్ కేకుని ఇంట్లోనే తయారు చేసుకోడానికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఇక్కడ చూడండి.
స్పాంజ్ కేక్ తయారీకి కావాల్సిన పదార్థాలు
-బొంబాయి రవ్వ
-పాలు
-పెరుగు
-నూనె
-బటర్
-వెన్నీలా ఎసెన్స్
-చక్కెర
-బేకింగ్ పౌడర్
-బేకింగ్ సోడా
-ఉప్పు
-మైదాపిండి
-టూటీ ఫ్రూటీ
-మిల్క్ పౌడర్

స్పాంజ్ కేక్ తయారీ విధానం
-ముందుగా మిక్సీ గిన్నె తీసుకొని అందులో కప్పు బొంబాయి రవ్వ పోసి వీలైనంత ఫైన్ పౌడర్ గా బ్లెండ్ చేసి ఆ పిండిని ఓ బౌల్ లోకి తీసుకొని పెట్టుకోండి.
-ఇప్పుడు అదే మిక్సీ జార్ లో ముప్పావు కప్పు పంచదార,ముప్పావు కప్పు పచ్చి లేదా కాచిన పాలు,అర కప్పు పెరుగు, పావు కప్పు నూనె లేదా కరిగించిన బటర్, అర టీస్పూన్ వెన్నీలా ఎసెన్స్ వేసి మొత్తం క్రీమీ టెక్చర్ వచ్చేలా గ్రైండ్ చేసి ఓ బౌల్ లోకి తీసి పెట్టుకోండి.
- తర్వాత ముందుగా గ్రైండ్ చేసి ఉంచిన బొంబాయి రవ్వ బౌల్ లో 2 టేబుల్ స్పూన్ల మిల్క్ పౌడర్ వేసి కలిపి ఇందులోనే రెండోసారి గ్రైండ్ చేసిన క్రీమీ టెక్చర్ కూడా వేసి ఉండలు లేకుండా బాగా కలపి మూత పెట్టి 15 నిమిషాలు పక్కన పెట్టుకోండి.
-ఇప్పుడు ఆ బౌల్ మీద మూత తీసి ఓ జల్లెడ పెట్టి అందులో పావు కప్పు మైదా పిండి,1 టీస్పూన్ బేకింగ్ పౌడర్,చిటికెడు ఉప్పు, అర టీస్పూన్ బేకింగ్ సోడా వేటి వీటన్నింటిని జల్లించండి. తర్వాత వీటన్నింటిని ఉండలు లేకుండా కలపండి. గట్టిగా ఉండకూడదు,పలుచగా ఉండకూడదు..మీడియంగా ఉండాలి.
-తర్వాత అందులో 2 లేదా 3 టేబుల్ స్పూన్ల టూటీ ఫ్రూటీ(Tutti Frutti)వేసి కలిపి పక్కనపెట్టుకోండి.
-ఇప్పడు స్టీల్ బౌల్ లేదా కేకు టిన్ను తీసుకొని అందులో కొంచెం ఆయిల్ అప్లై చేసి బటర్ పేపర్ పెట్టేయండి. బటర్ పేపర్ లేకుంటే కొంచెం మైదా పిండి దానిమీద చల్లితే చాలు.
-తర్వాత తయారుచేసుకున్న కేకు మిశ్రమం మొత్తాన్ని ఇందులో పోసేయండి.
-ఇప్పడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్ లేదా బౌల్ పెట్టి అందులో ఓ చిన్న స్టాండ్ పెట్టి లో ప్లేమ్ మీద హీట్ చేసిన తర్వాత ఇందులో కేకు మిశ్రమం ఉన్న బౌల్ ని అలాగే పెట్టండి.
-మీడియం ప్లేమ్ మీద 30 నిమిషాలు, లో ప్లేమ్ మీద 10 నిమిషాలు బేక్ చేసుకోండి.
-తర్వాత మూత తీసి చాకు పెట్టి అది బేక్ అయిందో లేదా అడుగున ఇంకా పిండిగా ఉందో లేదో చూడండి. పిండిగా ఉంటే మరో 5 నిమిషాలు లో ప్లేమ్ మీద బేక్ చేయండి.
-బేక్ అయిన కేకుని బయటకు తీసి పూర్తిగా చల్లారనివ్వండి. తర్వాత పీస్ లుగా కట్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications