Latest Updates
-
ఆఫీస్ టెన్షన్ అనుకుంటున్నారా? ఈ లక్షణాలు బ్రెయిన్ ట్యూమర్ కి తొలి సంకేతాలు కావొచ్చు! -
అంతర్జాతీయ యోగా దినోత్సవం స్పెషల్.. ఈ యోగాసనాలతో సంతానలేమి సమస్యలకు చెక్.! -
రిలేషన్ షిప్ పై త్రిప్తి డిమ్రి ఆసక్తికర వ్యాఖ్యలు..అది ఉంటే తప్ప వర్కౌట్ కాదంట..! -
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న 10 నిమిషాల ఎగ్ కుర్మా..ఎలా చేయాలో చూడండి.. -
మైగ్రేన్‌తో గుండెకి ప్రమాదం.. ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.! -
రోజుకు ఎన్నిసార్లు గ్యాస్ వదలడం నార్మల్? మహిళలు, పురుషుల్లో ఎవరికి ఎక్కువంటే..! -
అద్భుతమా, మూఢ నమ్మకమా.? దశాబ్దాల సంప్రదాయం, లక్షలాది ప్రజల నమ్మకం.. చేప ప్రసాదం వెనకున్న కథేంటి.? -
కుక్కర్ విజిల్ వేసినప్పుడు పప్పు పొంగుతోందా? ఈ పాతకాలపు చిట్కాతో చెక్..! -
ఈ 5 రాశుల వారికి కెరీర్లో బంపర్ ఆఫర్.. అకస్మాత్తుగా ధనలాభం ఖాయం! -
విష్కుంభ యోగం ముగింపు.. ప్రీతి యోగంతో ఈ రాశుల వారికి అదృష్టం, పనుల్లో విజయం ఖాయం!
ఇలాంటి ఎగ్ కర్రీ జన్మలో తిని ఉండరు..ఆహాఓహో అని తీరాల్సిందే..ఎలా చేసుకోవాలంటే..
గుడ్డు కూర అనేది భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన, సులభంగా తయారు చేయగల వంటకాల్లో ఒకటి. గుడ్లు పోషకాల గని కావడంతో ఇది కేవలం రుచికరంగా ఉండటమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. అయితే మీరు ఎన్నో రకాల ఎగ్ కర్రీలు తిని ఉంటారు. కానీ సరికొత్త స్టైల్ లో కింద చెప్పిన విధంగా ఎగ్ కర్రీని ఒక్కసారి ట్రై చేశారంటే మీ ఇంట్లో వాళ్లు మళ్లీ మళ్లీ ఇదే చేసిపెట్టాలని అడగడం ఖాయం. అంత టేస్టీగా ఉంటుంది. చిక్కటి గ్రేవీతో చాలా రుచిగా ఉంటుంది. ఈ ఎగ్ కర్రీని చపాతీలోకి లేదా నాన్,బటర్ నాన్, బగారా రైస్ లేదా బిర్యానీలోకి ఇలా దేంట్లోకి అయినా అదిరిపోతుంది. టేస్టీ ఎగ్ కర్రీ ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.
తయారీకి కావాల్సిన పదార్ధాలు
-కోడిగుడ్లు
-జీడిపప్పు
-అల్లం
-వెల్లుల్లి
-ఉప్పు
-కారం
-పసుపు
-మిరియాల పొడి
-గరం మసాలా
-ధనియాల పొడి
-టమాటో
-ఆయిల్
-పచ్చిమిర్చి
-పుదీనా
-ఉల్లిపాయ
-జీలకర్ర పొడి
-శెనగపిండి

తయారీ విధానం
-ముందుగా 5 కోడిగుడ్లను ఉడికించి వాటిని మధ్యలోకి కట్ చేసి అంటే ఒక్కో గుడ్డును రెండు పీసులుగా కట్ చేసి పక్కన పెట్టుకోండి.
-తర్వాత మిక్సీ జార్ లో ముక్కలుగా కట్ చేసిన 1 ఇంచు అల్లం, 6 పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు, 3 పచ్చిమిరపకాయల పెద్ద ముక్కలు, కొద్దిగా పుదీనా, 2 ఉల్లిపాయల పెద్దసైజు ముక్కలు, 7 జీడిపప్పులు చిన్న కొత్తిమీర కట్టను కాడలతో సహా వేసి మెత్తని పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి. కావాలనుకుంటే కొంచెం నీళ్లు అయినా పోసుకోవచ్చు.
-తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టి అందులో 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసి వేడయ్యాక అందులో 2 ఉల్లిపాయల సన్నని తరుగు వేసి మీడియం మంట మీద లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి.
-ఉల్లిపాయలు వేగిన తర్వాత అందులో 2 టమాటోల ముక్కలు, కొద్దిగా ఉప్పు వేసి టమాటో ముక్కలు బాగా మెత్తగా మగ్గిపోయేదాకా వేయించుకోవాలి. తర్వాత అందులో 1 టీస్పూన్ గరం మసాలా పొడి, అర టీస్పూన్ జీలకర్ర పొడి, 1 టీస్పూన్ ధనియాల పొడి, అర టీస్పూన్ పసుపు, 2 టీస్పూన్ల కారం, 1 టీస్పూన్ మిరియాల పొడి వేసి తక్కువ మంటమీద ఈ పొడులన్నీ బాగా కలిసేటట్లు కలుపుకోవాలి.
-తర్వాత అందులో గ్రైండ్ చేసి ఉంచిన మసాలా పేస్ట్ కూడా వేసి బాగా కలుపుతూ వేగనివ్వాలి.
-మసాలా పేస్ట్ బాగా వేగి ఆయిల్ సపరేట్ అయ్యుటప్పుడు అందులో ఒక గ్లాసు నీళ్లు పోసి కలుపుకోండి. కావాలనుకుంటే ఇంకొంచెం నీళ్లు కూడా పోసుకోవచ్చు. ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు వేసి కలిపి మూతపెట్టి 3 నిమిషాలు ఉడికించాలి.
-ఇప్పుడు రెండు టీస్పూన్ల శనగపిండిని ఓ బౌల్ లో వేసి అందులో కొన్ని నీళ్లు పోసి ఉండలు లేకుండా బాగా కలిపి గ్రేవీ కొద్దిగా ఉడికిన తర్వాత అందులో ఈ మిశ్రమాన్ని పోసేయండి. తక్కువమంట మీద ఉంచి బాగా కలిపి మూతపెట్టి తక్కువ మంటమీద మరో 2 నిమిషాలు ఉడికించాలి.
-తర్వాత మూతతీసి చూడండి. ఆయిల్ సపరేట్ అయ్యి చిక్కటి గ్రేవీలా కనబడితే అందులో ఉడికించి కట్ చేసిన గుడ్లను వేయండి. ఇందులోనే కొత్తిమీర తరుగు చల్లుకొని మూతపెట్టి తక్కువ మంటమీద 2 నిమిషాలు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసేయండి. అంటే టేస్టీ ఎగ్ కర్రీ రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications