Latest Updates
-
వినాయక చవితి స్పెషల్..ఇంట్లోనే ఈజీగా నోరూరించే చాక్లెట్ మోదక్ ఎలా చేసుకోవాలంటే.. -
ఫోన్ పక్కనపెట్టి ఇది ట్రై చేయండి.. హృతిక్ చెబుతున్న హెల్త్ టిప్స్! -
నార్త్ స్టైల్ చోలే మసాలా.. పూరీ, చపాతీలోకి వేళ్లు చప్పరిస్తూ లాగించేస్తారు.! -
చికెన్, మటన్ కంటే 50 రెట్లు బలం..ఏడాది పాటు నిల్వ ఉండే బోడకాకరకాయ పచ్చడి ఇలా చేయండి -
వయసు పైబడితేనే అల్జీమర్స్ వస్తుందా.. మతిమరుపునకు దారితీసే ప్రమాదకర కారకాలివే.! -
ఉద్యోగం వదిలి వ్యాపారం చేస్తే... ఈ రాశుల వారు కోటీశ్వరులు అవ్వడం పక్కా! -
నాన్‌వెజ్ అనుకుంటే పప్పులో కాలేసినట్లే.. వెజ్ ప్రియుల కోసం స్పెషల్ లివర్ ఫ్రై.. రెస్టారెంట్ టేస్ట్‌తో.! -
అమ్మమ్మల నాటి చిట్కా..గ్యాస్, ఎసిడిటి,అజీర్తి సమస్యలకు చెక్! -
కృష్ణాష్టమి ఉపవాసం ఉంటున్నారా? అయితే నీరసం రానివ్వని ఈ సగ్గుబియ్యం వడలు ట్రై చేయండి! -
పెళ్లిళ్లు, పండుగల్లో అమ్మాయిలూ జాగ్రత్త.. మెహందీ పెట్టుకుంటే పొట్ట ఇన్ఫెక్షన్ల ప్రమాదం.!
ఇంట్లో కొబ్బరి లేదా? అయితే ఇడ్లీ, దోసెల్లోకి ఈ కొబ్బరి లేని కొబ్బరి చట్నీ చేసేయండి!
ఉదయం నిద్రలేవగానే ఆఫీస్‌కు, పిల్లలను స్కూల్‌కు పంపే హడావిడిలో సమయం ఎలా గడిచిపోతుందో తెలియదు. ఇలాంటప్పుడు త్వరగా పూర్తయ్యే ఇడ్లీ, దోసె లాంటి బ్రేక్ ఫాస్ట్ ఐటమ్స్ నే ఎక్కువగా ఇష్టపడతాం. ఇడ్లీ, దోసెల్లోకి టమాటా, పుదీనా, పల్లీ, కొత్తిమీర.. ఇలా ఎన్నో రకాల చట్నీలు చేసుకుంటాం. కానీ దక్షిణాది ఇళ్లలో అందరికీ అత్యంత ఇష్టమైనది మాత్రం కొబ్బరి చట్నీ.

అయితే ఉదయాన్నే కొబ్బరి పగలగొట్టి, తురుముకునే సమయం లేనప్పుడో.. లేదా ఇంట్లో కొబ్బరి అందుబాటులో లేనప్పుడో ఏం చేయాలి? అసలు కొబ్బరితో పనే లేకుండా, అచ్చం కొబ్బరి చట్నీ లాంటి రుచిని, ఆకృతిని ఇచ్చే ఒక అద్భుతమైన చట్నీ రెసిపిని ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.
కొబ్బరి లేని కొబ్బరి చట్నీ తయారీకి కావలసిన పదార్థాలు
వంటనూనె - 1 టేబుల్ స్పూన్
మినపప్పు - 1 టీస్పూన్
పల్లీలు - 1 టీస్పూన్
ఎండు మిరపకాయలు - 3
పెద్ద ఉల్లిపాయలు - 2
వెల్లుల్లి రెబ్బలు - 4
అల్లం - చిన్న ముక్క
జీడిపప్పు - 3 టేబుల్ స్పూన్లు
చింతపండు - చిన్న ఉసిరికాయంత
ఉప్పు - రుచికి సరిపడా
తాలింపుకి నూనె - 2 టీస్పూన్లు
ఆవాలు - అర టీస్పూన్
మినపప్పు - అర టీస్పూన్
కరివేపాకు - 1 రెమ్మ

కొబ్బరి లేకుండా కొబ్బరి చట్నీ తయారీ విధానం
-ముందుగా స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకోండి. అందులో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి వేడి అయ్యాక.. మినపప్పు, పల్లీలు, ఎండు మిరపకాయలు వేసి దోరగా వేయించండి.
-పల్లీలు కాస్త రంగు మారాక, అందులో తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు వేసి పచ్చివాసన పోయేంతవరకు బాగా వేయించాలి. ఇప్పుడు చిన్న అల్లం ముక్క కూడా వేసి కాస్త వేయించి, స్టవ్ ఆపేయండి. ఈ మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి.
-వేయించుకున్న పదార్థాలన్నీ చల్లారాక వాటిని ఒక మిక్సీ జార్ లోకి తీసుకోండి. ఇందులోనే మన చట్నీకి అసలైన రుచినిచ్చే జీడిపప్పు, కాస్త చింతపండు, రుచికి సరిపడా ఉప్పు వేసి, కొద్దిగా నీళ్లు పోసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
-గ్రైండ్ చేసుకున్న ఈ చట్నీని ఒక గిన్నెలోకి తీసుకుని, మీకు కావలసినంత చిక్కదనం కోసం మరికొన్ని నీళ్లు కలుపుకోవచ్చు.
-ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ మీద చిన్న కడాయి పెట్టి రెండు స్పూన్ల నూనె వేయండి. నూనె వేడెక్కాక ఆవాలు, మినపప్పు, కరివేపాకు వేసి చిటపటలాడనివ్వండి. ఈ గుమగుమలాడే పోపును చట్నీలో కలిపేస్తే చాలు. ఎంతో కమ్మనైన, కొబ్బరి లేని కొబ్బరి చట్నీ రెడీ. వే
-వేడి వేడి మల్లెపూవు లాంటి ఇడ్లీలలోకి లేదా కరకరలాడే దోసెల్లోకి ఈ చట్నీని అద్దుకుని తింటే, ఆ రుచికి ఫిదా అవ్వాల్సిందే. ఎవరైనా తిని ఇది కొబ్బరి చట్నీ కాదంటే అస్సలు నమ్మరు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications