Latest Updates
-
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.!
పిండి పులియబెట్టే పని లేదు.. క్షణాల్లో టేస్టీ టమాటా గోధుమ రవ్వ దోశ..ఎలా చేసుకోవాలంటే..
రోజూ ఇడ్లీ, మామూలు మినప దోశలే తిని తిని మీకు, మీ కుటుంబ సభ్యులకు బోర్ కొట్టిందా? ఉదయం పూట నోటికి రుచిగా, కడుపుకు తేలికగా, అదే సమయంలో ఆరోగ్యాన్నిచ్చే సరికొత్త వంటకం కోసం వెతుకుతున్నారా? అయితే మీ వంటింట్లో గోధుమ రవ్వ, టమాటాలు ఉంటే చాలు, క్షణాల్లో ఎంతో రుచికరమైన, పోషకాలతో నిండిన దోశలను తయారు చేసుకోవచ్చు.
సాధారణంగా గోధుమ రవ్వతో ఉప్మా చేస్తాం కానీ దాంతో టమాటాలు జతచేసి దోశలు వేస్తే ఆ రుచే వేరు. ఈ దోశలు చాలా క్రిస్పీగా, పుల్లపుల్లగా, కారంకారంగా అద్భుతంగా ఉంటాయి. పల్లి చట్నీ లేదా కొబ్బరి చట్నీతో దీనిని సర్వ్ చేస్తే లొట్టలేసుకుంటూ తింటారు. టమాటా గోధుమ రవ్వ దోశ ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.

కావలసిన పదార్థాలు
గోధుమ రవ్వ: 1 కప్పు
అటుకులు: పావు కప్పు
టమోటాలు: 2
ఇడ్లీ పిండి: 2 టేబుల్ స్పూన్లు
జీడిపప్పు: 8
ఎండు మిరపకాయలు: 2
సోంపు: 1 టీస్పూన్
జీలకర్ర: పావు టీస్పూన్
వెల్లుల్లి రెబ్బలు: 1
అల్లం: చిన్న ముక్క
కొత్తిమీర: గుప్పెడు
ఉప్పు: రుచికి సరిపడా
నూనె: దోశలు కాల్చడానికి
నీరు: పిండి కలపడానికి
తయారీ విధానం
-ముందుగా ఒక గిన్నెలో ఒక కప్పు గోధుమ రవ్వను తీసుకుని, తగినన్ని నీళ్లు పోసి సుమారు 20 నిమిషాల పాటు నానబెట్టాలి. అలాగే మరో చిన్న గిన్నెలో అటుకులు (Poha) తీసుకుని వాటిని కూడా శుభ్రంగా కడిగి, నీళ్లు పోసి 20 నిమిషాల పాటు నాననివ్వాలి.
-ఇప్పుడు మిక్సీ జార్ లో సోంపు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బ, చిన్న అల్లం ముక్క, ఎండు మిరపకాయలు, కొద్దిగా ఉప్పు వేసి మెత్తగా లేదా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి.
-ఇప్పుడు అదే మిక్సీ జార్ లో ముందుగా నానబెట్టుకున్న గోధుమ రవ్వ, నానబెట్టిన అటుకులు, కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు, కొద్దిగా కొత్తిమీర వేయాలి. అవసరమైతే కొంచెం నీరు పోసి దోశ పిండిలా మెత్తగా రుబ్బుకోవాలి.
-ఇలా రుబ్బిన మిశ్రమాన్ని ఒక పెద్ద గిన్నెలోకి తీసుకోండి. దీనికి 2 స్పూన్ల ఇడ్లీ పిండిని జత చేయండి. అలాగే సన్నగా తురిమిన జీడిపప్పు, సన్నగా తరిగిన కొత్తిమీర వేసి బాగా కలపాలి. పిండి మరీ చిక్కగానూ, మరీ పల్చగానూ కాకుండా చూసుకోండి.
-స్టవ్ వెలిగించి దోశ పెనం పెట్టి వేడి చేయండి. పెనం వేడెక్కాక గరిటెతో పిండిని తీసుకుని పల్చగా దోశలా పరచండి. దోశ చుట్టూ కొంచెం నూనె వేయండి.
-మంటను మీడియంలో ఉంచి, దోశను రెండు వైపులా బంగారు రంగు వచ్చే వరకు కాల్చుకోవాలి. టమాటా వేయడం వల్ల దోశ మంచి ఎరుపు రంగులో కాలుతుంది.
-అంతే ఎంతో రుచికరమైన, వేడివేడి టమాటా గోధుమ రవ్వ దోశ రెడీ. దీనిని వేడివేడిగా పల్లి చట్నీ లేదా అల్లం పచ్చడితో తింటే ఆ రుచిని అస్సలు మర్చిపోలేరు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications