Latest Updates
-
స్త్రీల శరీరంలో అత్యంత సున్నితమైన భాగాలు.. ఇక్కడ తాకితే మీ రాత్రి రసవత్తరమే! -
కరకరలాడే చిట్టి మురుకులు..పెద్దలకే కాదు, పిల్లలకు కూడా భలే నచ్చేస్తాయి..ఈజీగా చేసుకోండిలా.. -
ఈ పిండితో చేసిన రోటీ, చపాతీలు తింటే షుగర్ లెవల్స్ పెరగవు, ఫ్యాటీ లివర్ దరిచేరదు! -
‘ప్రొబేషన్ ముగిసినా ఆఫర్ లెటర్ లేదు.. ఇలాంటి కాల్ వస్తుందని ఊహించలేదు’- యువతి వైరల్ వీడియో.! -
ఈ ఐదు ఇంటి చిట్కాలను ప్రయత్నించారంటే.. ఇక జుట్టుకి హెయిర్ డైలు పూయడం ఆపేస్తారు.! -
రిలేషన్షిప్లో మహిళలు నిజంగా ఏం కోరుకుంటారు.. టాప్ 5 సీక్రెట్స్ ఇవే.! -
నోరూరించే స్వచ్ఛమైన పాలకోవా.. కేవలం 3 పదార్థాలతో మీ ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
సంతానోత్పత్తికి అడ్డంకిగా ఫెలోపియన్ ట్యూబ్స్ బ్లాకేజీ.. మహిళల్లో ఈ సమస్యను ఎలా నివారించాలి.! -
ఎటు చూసినా కష్టాలేనా? ఈ పవర్ ఫుల్ మంత్రాలు చదివితే లైఫ్ ఛేంజ్! -
ప్రపంచ మెదడు దినోత్సవం.. బ్రెయిన్ హెల్త్‌కి, విటమిన్ బి1కి సంబంధం ఉందా.. ఈ లక్షణాలు కనిపిస్తే చాలా డేంజర్.!
పిండి రుబ్బే పని లేదు.. గంటలు తరబడి నానబెట్టే పని లేదు..నిమిషాల్లో ఊతప్పం తయారీ ఇలా!
ప్రస్తుత ఉరుకులు పరుగుల జీవితంలో ఉదయం బ్రేక్ ఫాస్ట్ తయారు చేయడం అనేది ఒక పెద్ద సవాలుగా మారింది. దోశ, ఇడ్లీ వంటి సాంప్రదాయ వంటకాలకు పిండిని రుబ్బాలి, పులియబెట్టాలి. రోజూ ఒకటే టిఫిన్ తిని తిని బోర్ కొట్టిందా? అయితే నిమిషాల్లో తయారయ్యే రవ్వ ఊతప్పం ఓ సారి ట్రై చేయాల్సిందే.
సమయం తక్కువగా ఉన్నప్పుడు, రుచికరంగా, ఆరోగ్యకరంగా ఏదైనా తినాలనిపించినప్పుడు ఇన్ స్టంట్ రవ్వ ఊతప్పం ఒక అద్భుతమైన ఎంపిక. చట్నీతో పంబంధం లేకుండా,దేనితో అయినా తిరుగులేని సూపర్ టేస్టీగా అప్పటికప్పుడు రవ్వ ఊతప్పం ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.

తయారీకి కావాల్సిన పదార్థాలు
-బొంబాయి రవ్వ
-పచ్చిమిర్చి
-ఉల్లిపాయ
-కొత్తిమీర
-వంట సోడా
-బియ్యం పిండి
-ఉప్పు
-క్యారెట్ తురుము
-పెరుగు
తయారీ విధానం
-ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టి అందులో 1కప్పు బొంబాయి రవ్వ వేసి సన్నని సెగ మీద సువాసన వచ్చేంతవరకు వేయించుకొని తీసి చల్లారనివ్వాలి.
-ఇప్పుడు ఒక గిన్నెలో అరకప్పు పుల్లటి పెరుగు లేదా మాములు పెరుగు, పావు టీస్పూన్ వంట సోడా వేసి బాగా కలిపాక ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి, రుచికి సరిపడా ఉప్పు, చల్లార్చుకున్న బొంబాయి రవ్వ, ముప్పావు కప్పు నీళ్లను కొద్ది కొద్దిగా పోస్తూ బాగా కలిపి కనీసం అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి.
-తర్వాత మరో గిన్నెలో 2 టేబుల్ స్పూన్ల క్యారెట్ తురుము, 1 ఉల్లిపాయ తరుగు, 2 పచ్చిమిర్చి సన్నని తరుగు, కొత్తిమీర తురుము, కరివేపాకు తురుము వేసి మొత్తం బాగా కలిసేలా కలిపి పక్కన పెట్టుకోవాలి.
-అరగంట సేపు ఊరిన పిండిలో 2-3 టేబుల్ స్పూన్ల నీళ్లు పోసి పిండిని పలచన చేయండి.
-తర్వాత స్టవ్ మీద పెనం పెట్టి అరగంట సేపు పక్కన పెట్టుకున్న పిండిని ఒక గరిటతో తీసుకొని పెనం మీద వేసి నిదానంగా స్ప్రెడ్ చేసుకోవాలి.
-ఊతప్పం అంచుల వెంట నూనె పోసి, ఆపైన కలిపి ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కల మిశ్రమాన్ని అద్దండి. మూతపెట్టి మీడియం మంట మీద అంచులు రంగు మారే వరకు కాల్చాక మరోవైపుకి తిప్పి మరో 2 నిమిషాలు కాల్చుకుంటే వేడి వేడి ఊతప్పం రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications