Latest Updates
-
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.!
డీప్ ఫ్రై అవసరం లేదు..ఆవిరిపై ఉడికించిన పాలకూర కోఫ్తా కర్రీ.. సూపర్ టేస్ట్!
సాధారణంగా పాలకూర కోఫ్తా అనగానే అందరికీ గుర్తొచ్చేది నూనెలో డీప్ ఫ్రై చేసిన కోఫ్తాలు. కోఫ్తాలను నూనెలో వేయించాల్సిన అవసరం లేకుండా చాలా తక్కువ నూనెతో, ఆవిరిపై ఉడికించి చేసే హెల్తీ పాలక్ కోఫ్తా కర్రీ రాత్రి భోజనంలోకి లేదా రోటీలోకి అద్భుతంగా ఉంటుంది.
కావలసిన పదార్థాలు
పాలకూర: 300 గ్రాములు
శనగపిండి: 3-4 టేబుల్ స్పూన్లు
ఉప్పు: రుచికి సరిపడా
అల్లం వెల్లుల్లి పేస్ట్: కొద్దిగా
వాము: అర టీస్పూన్
పసుపు: అర టీస్పూన్
కారం: అర టీస్పూన్
గరం మసాలా: అర టీస్పూన్
ధనియాల పొడి: అర టీస్పూన్
ఆవాల నూనె: 2 టీస్పూన్లు
ఉల్లిపాయలు: 2
టమోటాలు: 2
పెరుగు: 2-3 టేబుల్ స్పూన్లు
పోపు దినుసులు: జీలకర్ర, ఆవాలు, మిరియాలు (5), ఏలకులు (2)
మసాలాలు: పసుపు,కారం, ధనియాల పొడి, గరం మసాలా, కసూరి మేథి

తయారీ విధానం
-ముందుగా పాలకూరను శుభ్రంగా కడిగి ఆకులను చాలా సన్నగా తరగాలి.
-తరిగిన పాలకూరలో ఒక టీస్పూన్ ఉప్పు వేసి బాగా కలిపి 10 నిమిషాల పాటు పక్కన పెట్టాలి. ఆ తర్వాత ఆకులను గట్టిగా పిండి, ఆ నీటిని పారబోయకుండా ఒక గిన్నెలో పక్కన పెట్టుకోండి. పిండిన ఆకులను వేరే గిన్నెలోకి తీసుకోండి.
ఇప్పుడు రెండు ఉల్లిపాయలు, చిన్న అల్లం ముక్క, ఐదు వెల్లుల్లి రెబ్బలు, ఒక పచ్చిమిర్చి తీసుకొని కచ్చాపచ్చాగా దంచుకోవాలి లేదా మిక్సీ పట్టుకోవాలి. అలాగే టమోటాలను మెత్తని పేస్ట్ లా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి.
నీరు పిండిన పాలకూరలో ముందుగా సిద్ధం చేసుకున్న ఉల్లిపాయ మిశ్రమం 2 స్పూన్లు, వాము, పసుపు, కారం, గరం మసాలా, ధనియాల పొడి, 3-4 టేబుల్ స్పూన్ల శనగపిండి వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న లడ్డూల్లా (కోఫ్తాలుగా) చుట్టుకోవాలి.
ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి ఆవాల నూనె వేయాలి. నూనె వేడయ్యాక జీలకర్ర, మిరియాలు, ఏలకులు వేసి వేయించాలి. అవి వేగాక మిగిలిన ఉల్లిపాయ పేస్ట్ వేసి బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి. ఆ తర్వాత టమోటా పేస్ట్, పసుపు, కారం, ధనియాల పొడి వేసి నూనె పైకి తేలేవరకు ఉడికించాలి. ఇప్పుడు పెరుగు వేసి కలపాలి. చివరగా పక్కన పెట్టుకున్న పాలకూర నీటిని, మరికొంత సాధారణ నీటిని పోసి గ్రేవీని పలుచగా చేసుకోవాలి.
గ్రేవీ ఉడుకుతున్న పాన్ మీద ఒక స్టీల్ జల్లెడ లేదా చిల్లుల గిన్నెను బోర్లించండి. దానికి కాస్త నూనె రాసి, మనం తయారు చేసుకున్న పాలకూర కోఫ్తాలను దానిపై ఉంచండి. దీనిపై మూత పెట్టి 10-12 నిమిషాల పాటు ఉడికించాలి. దీనివల్ల కింద గ్రేవీ ఉడుకుతుంది, ఆ ఆవిరికే పైన కోఫ్తాలు కూడా ఉడికిపోతాయి.
చివరగా, ఉడికిన కోఫ్తాలను తీసి గ్రేవీలో వేసి, ఒక నిమిషం పాటు ఉడికించాలి. దించే ముందు కసూరి మేథిని నలిపి చల్లితే రెస్టారెంట్ స్టైల్ రుచి వస్తుంది. అంతే పాలకూర కోఫ్తా కర్రీ రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications