Latest Updates
-
డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా ప్రతి చిన్న సమస్యకి మందులు వాడటం ఎంత ప్రమాదమో తెలుసా.? -
పెళ్లిళ్ల స్పెషల్.. హైడ్రా పాత్ షాహి రెడ్ చికెన్.. బ్యాచ్లర్స్ సైతం సింపుల్గా చేసుకునేలా.! -
అమర్నాథ్ యాత్రికులకు అలర్ట్.. బడ్జెట్ ఎక్కడ, ఎంతవుతుంది.. పూర్తి వివరాలు.! -
చర్మ సౌందర్యాన్ని ఇట్టే పెంచే పాలకూర.. దాబా స్టైల్లో నోరూరించేలా ఇలా చేయండి.! -
ఇంట్లోకి మురికి రాకుండా చేసే 5 బెస్ట్ డోర్ మ్యాట్లు.. వర్షాకాలంలో బెస్ట్ ఆప్షన్స్.! -
గుండెకి మేలు, ఎముకలకి బలం.. ఇంకా ఎన్నో.. రోజూ మెట్లు ఎక్కితే ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా.! -
మహిళలు, పిల్లల ఎముకల బలానికి అమృతం లాంటి నల్ల మినపపప్పు చట్నీ..ఇడ్లీ,దోశెలతో సూపర్ టేస్ట్ -
హిందూ ధర్మంలో ‘లోక కల్యాణం’ అనే భావన ఎందుకు అంత గొప్పది? -
ముద్దు పెట్టుకునేటప్పుడు కళ్ళు ఎందుకు మూసుకుంటాం? కళ్ళు తెరిచి ముద్దు పెట్టుకుంటే ఏమవుతుంది? -
వంట రాని వారు కూడా చిటికెలో చేసే సూపర్ టేస్టీ స్నాక్.. ఆలూ కట్లీ చేసుకోండిలా..
గ్యాస్ లేకున్నా నో ప్రాబ్లమ్..రైస్ కుక్కర్ లో వేడివేడి పూరీలు ఇలా చేసుకోండి!
సాధారణంగా వంట చేయాలంటే మనకు ముందుగా గుర్తొచ్చేది గ్యాస్ స్టవ్. కానీ కొన్నిసార్లు ఇంట్లో గ్యాస్ అయిపోవచ్చు, లేదా బ్యాచిలర్స్ గా రూమ్స్ లో, హాస్టల్స్ లో ఉండే విద్యార్థులకు గ్యాస్ స్టవ్ అందుబాటులో ఉండకపోవచ్చు. ఇలాంటి సమయాల్లో ఇష్టమైన వంటకాలు తినాలనిపించినప్పుడు నిరాశ పడాల్సి వస్తుంది.
ముఖ్యంగా ఆదివారం ఉదయం పూట వేడి వేడి పూరీలు, దానికి కాంబినేషన్ గా ఆలు కర్రీ తినాలని అందరికీ ఉంటుంది. మీ దగ్గర ఒక ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ ఉంటే చాలు, గ్యాస్ తో ఏమాత్రం పనిలేకుండా రుచికరమైన, పొంగే పూరీలను సులభంగా తయారు చేసుకోవచ్చు. రైస్ కుక్కర్ లో పూరీలు ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ చూడండి.

పూరీ తయారీకి కావాల్సిన పదార్థాలు
గోధుమ పిండి- 2 కప్పులు
ఉప్పు- రుచికి సరిపడా
నీళ్లు- పిండి కలుపుకోవడానికి తగినంత
నూనె- సుమారు అర లీటరు
బొంబాయి రవ్వ -2 టేబుల్ స్పూన్లు
పంచదార - అర టీస్పూన్
పూరీ పిండిని సిద్ధం చేసుకునే విధానం
-ముందుగా ఒక వెడల్పాటి గిన్నె తీసుకుని అందులో 2 కప్పుల గోధుమ పిండిని జల్లించి వేసుకోవాలి.
-అందులో రుచికి సరిపడా ఉప్పు, అర టీస్పూన్ పంచదార, 2 టేబుల్ స్పూన్ల బొంబాయి రవ్వ వేసి పొడి పిండిని బాగా కలపాలి. ఇప్పుడు అందులో ఒక టేబుల్ స్పూన్ వేడి నూనె వేసి పిండికి పట్టేలా కలపాలి.
-తర్వాత అందులో కొద్దికొద్దిగా నీళ్లు పోస్తూ పిండిని ముద్దలా కలుపుకోవాలి. పూరీ పిండి చపాతీ పిండిలాగా మరీ మెత్తగా ఉండకూడదు, అలాగని మరీ గట్టిగా కూడా ఉండకూడదు. పిండిని కనీసం 5 నుండి 10 నిమిషాల పాటు బాగా మర్దన చేస్తూ కలపాలి. కలిపిన పిండి పైన కొద్దిగా నూనె రాసి, ఒక తడి బట్టను కప్పి సుమారు 20 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి.
-పిండి నానిన తర్వాత దానిని చిన్న చిన్న నిమ్మకాయ సైజు ఉండలుగా చేసుకోవాలి.
-ఇప్పుడు చపాతీ పీట మీద కొద్దిగా నూనె రాసి, ఈ ఉండలను పూరీల్లా (మరీ పల్చగా కాకుండా, మరీ మందంగా కాకుండా) గుండ్రంగా వత్తుకోవాలి. పొడి పిండి వాడితే నూనె త్వరగా నల్లబడుతుంది కాబట్టి, నూనె రాసి పూరీలు వత్తుకోవడం మంచిది.
రైస్ కుక్కర్ లో పూరీలు వేయించే విధానం
-ముందుగా రైస్ కుక్కర్ లోపలి గిన్నెను (బౌల్) తీసుకుని శుభ్రంగా కడిగి, పొడి బట్టతో తుడవాలి. గిన్నెలో ఏమాత్రం నీటి తడి ఉండకూడదు. తడి ఉంటే నూనె వేడెక్కినప్పుడు మీద పడే ప్రమాదం ఉంది.
-ఇప్పుడు రైస్ కుక్కర్ గిన్నెలో డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోయాలి. కుక్కర్ గిన్నె సామర్థ్యంలో సగానికి కంటే తక్కువగానే నూనె ఉండేలా చూసుకోవాలి.
-కుక్కర్ ప్లగ్ పెట్టి స్విచ్ ఆన్ చేయాలి. కుక్కర్ బటన్ ను Cook(కుక్)మోడ్ లోకి ప్రెస్ చేయాలి.
-గ్యాస్ స్టవ్ తో పోలిస్తే రైస్ కుక్కర్ లో నూనె వేడెక్కడానికి కొంచెం ఎక్కువ సమయం (సుమారు 10-15 నిమిషాలు) పడుతుంది. నూనె వేడెక్కిందో లేదో తెలుసుకోవడానికి చిన్న పిండి ముద్దను నూనెలో వేయాలి. అది వెంటనే పైకి తేలితే నూనె వేడెక్కినట్లే.
-రైస్ కుక్కర్ లోపల ఒక థర్మోస్టాట్ సెన్సార్ ఉంటుంది. నూనె బాగా వేడెక్కగానే, అందులో నీరు లేదని గ్రహించి ఆటోమేటిక్ గా బటన్ Cook నుండి Warm మోడ్ కి పడిపోతుంది. పూరీలు వేయించేటప్పుడు ఇది సాధారణంగా జరిగే సమస్య. దీనిని అధిగమించడానికి, బటన్ పడిపోయినప్పుడల్లా దానిని మళ్లీ 'Cook' మోడ్ లో ఉంచాలి లేదా ఒక చిన్న చెక్క గరిటె సహాయంతో ఆ బటన్ పైకి రాకుండా పట్టి ఉంచాలి.
-నూనె బాగా వేడెక్కిన తర్వాత ముందుగా వత్తి పెట్టుకున్న పూరీని నెమ్మదిగా నూనెలో జారవిడవాలి. జారవిడిచిన వెంటనే జల్లి గరిటెతో పూరీ అంచుల మీద సున్నితంగా నొక్కాలి. ఇలా చేస్తే పూరీ నూనెలో మునిగి బంతి లాగా పొంగుతుంది.
-ఒక వైపు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత, నిదానంగా రెండో వైపుకు తిప్పి వేయించాలి. పూరీ రెండు వైపులా చక్కగా వేగిన తర్వాత, నూనె లేకుండా వడకట్టి బయటకు తీసుకోవాలి.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications