Latest Updates
-
స్త్రీల శరీరంలో అత్యంత సున్నితమైన భాగాలు.. ఇక్కడ తాకితే మీ రాత్రి రసవత్తరమే! -
కరకరలాడే చిట్టి మురుకులు..పెద్దలకే కాదు, పిల్లలకు కూడా భలే నచ్చేస్తాయి..ఈజీగా చేసుకోండిలా.. -
ఈ పిండితో చేసిన రోటీ, చపాతీలు తింటే షుగర్ లెవల్స్ పెరగవు, ఫ్యాటీ లివర్ దరిచేరదు! -
‘ప్రొబేషన్ ముగిసినా ఆఫర్ లెటర్ లేదు.. ఇలాంటి కాల్ వస్తుందని ఊహించలేదు’- యువతి వైరల్ వీడియో.! -
ఈ ఐదు ఇంటి చిట్కాలను ప్రయత్నించారంటే.. ఇక జుట్టుకి హెయిర్ డైలు పూయడం ఆపేస్తారు.! -
రిలేషన్షిప్లో మహిళలు నిజంగా ఏం కోరుకుంటారు.. టాప్ 5 సీక్రెట్స్ ఇవే.! -
నోరూరించే స్వచ్ఛమైన పాలకోవా.. కేవలం 3 పదార్థాలతో మీ ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
సంతానోత్పత్తికి అడ్డంకిగా ఫెలోపియన్ ట్యూబ్స్ బ్లాకేజీ.. మహిళల్లో ఈ సమస్యను ఎలా నివారించాలి.! -
ఎటు చూసినా కష్టాలేనా? ఈ పవర్ ఫుల్ మంత్రాలు చదివితే లైఫ్ ఛేంజ్! -
ప్రపంచ మెదడు దినోత్సవం.. బ్రెయిన్ హెల్త్‌కి, విటమిన్ బి1కి సంబంధం ఉందా.. ఈ లక్షణాలు కనిపిస్తే చాలా డేంజర్.!
పిండి రుబ్బే పనిలేదు.. కేవలం 10 నిమిషాల్లో హోటల్ స్టైల్ రవ్వ దోశ..ఎలా చేసుకోవాలంటే..
దోశ పేరు వినగానే చిన్నపిల్లల నుండి పండు ముసలివారి వరకు అందరికీ నోట్లో నీళ్లు ఊరడం ఖాయం. ఉదయం లేవగానే వేడివేడి ప్లేట్ దోశ, పక్కన కొబ్బరి చట్నీ లేదా కారం ఉంటే ఆ కిక్కే వేరు. అయితే పిండి రుబ్బే పని లేకుండా కేవలం 10 నిమిషాల్లోనే అప్పటికప్పుడు హోటల్ స్టైల్ కరకరలాడే రవ్వ దోశను మీరు ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు.
బ్యాచిలర్స్ నుండి గృహిణుల వరకు ఎవరైనా సులభంగా చేసుకోగలిగే ఇన్ స్టంట్ రవ్వ దోశ తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఇక్కడ చూడండి.

కావాల్సిన పదార్థాలు
సుజీ రవ్వ (బొంబాయి రవ్వ) - 1 కప్పు
బియ్యం పిండి - అర కప్పు
గోధుమ పిండి - 1 చెంచా
జీలకర్ర - 1 చెంచా
అల్లం - చిన్న ముక్క
ఉప్పు - రుచికి సరిపడా
నూనె - కాల్చడానికి సరిపడా
నీళ్లు - 4- 5 కప్పులు
తయారీ విధానం
-ముందుగా ఒక వెడల్పాటి గిన్నె తీసుకోండి. అందులో ఒక కప్పు రవ్వ, అర కప్పు బియ్యం పిండి, ఒక చెంచా గోధుమ పిండి వేయండి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు, జీలకర్ర, తురిమిన అల్లం వేసి పొడిగా ఒకసారి కలపండి.
-ఇప్పుడు ఈ మిశ్రమంలో సుమారు 4 కప్పుల నీళ్లు పోసి ఉండలు లేకుండా బాగా కలపాలి. రవ్వ దోశ పిండి సాధారణ దోశ పిండిలా చిక్కగా ఉండకూడదు, మజ్జిగలా పల్చగా ఉండాలి. అప్పుడే దోశ క్రిస్పీగా వస్తుంది.
-ఈ పిండిని ఒక 15-20 నిమిషాల పాటు పక్కన పెట్టండి. దీనివల్ల రవ్వ నీటిని పీల్చుకుని మెత్తబడుతుంది.
-15 నిమిషాల తర్వాత పిండిని ఒకసారి గమనించండి. రవ్వ అడుగున ఉండిపోతుంది కాబట్టి, గరిటెతో బాగా కలపండి. పిండి చిక్కబడితే మరికొన్ని నీళ్లు కలపండి. ఇప్పుడు ఇందులో ఒక చెంచా నూనె వేసి కలపండి.
-స్టవ్ వెలిగించి పెనం పెట్టి, హై ఫ్లేమ్ లో బాగా వేడి చేయండి. పెనం బాగా వేడెక్కాక మంటను తగ్గించకుండా పిండిని గరిటెతో తీసుకుని పెనం అంచుల నుండి మధ్యలోకి పోయాలి (సాధారణ దోశలా గరిటెతో రుద్దకూడదు). పిండిని పోసినప్పుడు జల్లెడలా రంధ్రాలు రావాలి.
-దోశ చుట్టూ కొంచెం నూనె వేసి మీడియం మంటపై ఎర్రగా కాలే వరకు వేచి ఉండండి. కావాలంటే పిండి వేసే ముందే పెనంపై సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు చల్లుకోవచ్చు.
-దోశ ఒక వైపు బాగా కాలి, అంచుల నుండి లేస్తున్నప్పుడు దాన్ని తీసి ప్లేట్ లోకి మార్చుకోండి. రవ్వ దోశను రెండో వైపు కాల్చాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీకు మెత్తగా కావాలంటే రెండు వైపులా కాల్చుకోవచ్చు.
-అంతే ఎంతో రుచికరమైన, కరకరలాడే వేడి వేడి రవ్వ దోశ రెడీ. దీన్ని పల్లి చట్నీ, అల్లం చట్నీ లేదా సాంబార్ తో సర్వ్ చేసుకుంటే ఆ రుచే వేరు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications