Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది!
మద్రాస్ స్పెషల్ రవ్వ అట్టు లేదా రవ్వ దోసె అనేది దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా తమిళనాడులో చాలా ఫేమస్ బ్రేక్ ఫాస్ట్. హోటళ్లలో దొరికే విధంగా కరకరలాడుతూ, ఎంతో రుచిగా ఉండే ఈ దోశను ఇంట్లోనే చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. దీనికి ముందు రోజు పిండిని రుబ్బి పులియబెట్టాల్సిన అవసరం లేదు, కాబట్టి అప్పటికప్పుడు ఇన్ స్టెంట్ గా చేసుకోవచ్చు. దీనిని కొబ్బరి చట్నీ, అల్లం పచ్చడి లేదా వేడివేడి సాంబార్ తో వడ్డిస్తే రుచి అద్భుతంగా ఉంటుంది.

మద్రాస్ స్పెషల్ రవ్వ దోశ తయారీకి కావాల్సినవి
-బొంబాయి రవ్వ
-బియ్యంపిండి
-కరివేపాకు
-నీళ్లు
-నూనె
-ఉప్పు
-జీలకర్ర
-మిరియాలు
-ఉల్లిపాయ
-పచ్చిమిర్చి
మద్రాస్ స్పెషల్ రవ్వ దోశ తయారీ విధానం
-ముందుగా ఒక పెద్ద గిన్నె తీసుకోండి. అందులో అరకప్పు, బియ్యం పిండి, అర కప్పు బొంబాయి రవ్వ, పావు కప్పు మైదా పిండి, రుచికి సరిపడా ఉప్పు, 1 టీస్పూన్ జీలకర్ర, 1 టీస్పూన్ మిరియాలు వేసి మొత్తం అంతా కలిసేలా కలుపుకోండి.
-ఇప్పుడు ఆ పిండి మిశ్రమంలో 750-800 ml నీటిని పోసి బాగా కలుపుకున్నాక అందులో కరివేపాకు కొంచెం వేసి కలుపుకొని ఈ గిన్నెను అరగంట సేపు పక్కన పెట్టుకోండి. పిండి మరీ చిక్కగా ఉంటే దోశ మెత్తగా వస్తుంది, కాబట్టి పలుచగా ఉండేలా చూసుకోవాలి.
-అరగంట తర్వాత స్టవ్ ఆన్ చేసి దోశ పెసం పెట్టి ఉల్లిపాయతో బాగా రుద్దండి. తర్వాత అరకప్పు పిండి మిశ్రాన్ని తీసుకొని పెసం మీద అలా అలా వెదజల్లుకున్నట్లు వేసుకోండి. పెనం బాగా వేడిగా ఉన్నప్పుడే పిండి పోయాలి, అప్పుడే దోశకు రంధ్రాలు (జాలీ లాగా) వచ్చి కరకరలాడుతుంది.
-ఇప్పుడు ఈ రవ్వ దోశ చుట్టూ, మధ్యలో నూనె పోసి మీడియం మంట మీద కాలనివ్వాలి. పెద్ద మంట మీద కాల్చితే దోశ క్రిస్పీగా రాదు.
-రవ్వ దోశ కాలడానికి సాధారణ దోశ కంటే కొంచెం ఎక్కువ సమయం పడుతుంది. అంచులు ఎర్రగా మారి, దోశ క్రిస్పీగా తయారయ్యాక, దోశను మడిచి ప్లేట్ లోకి తీసుకోవాలి. రెండో వైపు తిప్పాల్సిన అవసరం లేదు.
-మీకు కావాలనుకుంటే పెనం మీద దోశ పిండి వేయడానికి ముందే పెనం మీద ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు చల్లుకొని దానిమీద పిండి వెదజల్లుకొని కాల్చుకుంటే ఆ దోశ ఇంకా ఎక్కవ టేస్ట్ వస్తుంది.
-అంతే మద్రాస్ స్టైల్ రవ్వ దోశ రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications