Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
మైదా లేదు, భయం లేదు.. ఇంట్లోనే సులభంగా హెల్దీ బ్రెడ్-రవ్వ పిజ్జా..
పిజ్జా.. ఈ పదం వినగానే పిల్లలకే కాదు, పెద్దలకూ నోరూరిపోతుంది. కరిగే చీజ్, కమ్మని కూరగాయలు, ఆ అద్భుతమైన రుచి ఎవరినైనా ఇట్టే ఆకర్షిస్తుంది. బయట దొరికే పిజ్జాలను రోజూ కొనివ్వాలంటే తల్లిదండ్రులకు ఎక్కడ లేని భయం. మైదాతో చేసినవి ఆరోగ్యానికి మంచిది కాదు కదా, జంక్ ఫుడ్ ఎందుకు అని వాళ్లను ఆపుతుంటారు. బయట దొరికే పిజ్జాకు ఏమాత్రం తీసిపోని విధంగా, అంతే రుచిగా, పూర్తి ఆరోగ్యకరంగా ఇంట్లోనే బ్రెడ్, బొంబాయి రవ్వతో. మినీ పిజ్జాలను తయారు చేసుకోవచ్చు.

బ్రెడ్-రవ్వ పిజ్జా తయారీకి కావలసిన పదార్థాలు
బ్రెడ్ స్లైసెస్ - 4 లేదా 5
బొంబాయి రవ్వ - 1 కప్పు
తాజా పెరుగు - అర కప్పు
ఫ్రెష్ క్రీమ్ లేదా పాల మీగడ - 2 టీస్పూన్లు
ఉల్లిపాయ ముక్కలు - 2 టేబుల్ స్పూన్లు
క్యాప్సికమ్ ముక్కలు - 2 టేబుల్ స్పూన్లు
టమాటా ముక్కలు - 2 టేబుల్ స్పూన్లు
చిల్లీ ఫ్లేక్స్ - 1 టీస్పూన్
ఒరెగానో- 1 టీస్పూన్
మిరియాల పొడి - పావు టీస్పూన్
ఉప్పు - తగినంత
పిజ్జా సాస్ - బ్రెడ్ కి సరిపడా
మోజారెల్లా చీజ్ - తగినంత
వెన్న లేదా నెయ్యి - కాల్చుకోవడానికి

బ్రెడ్-రవ్వ పిజ్జా తయారీ విధానం
-ముందుగా ఒక వెడల్పాటి గిన్నె తీసుకోండి. అందులో బొంబాయి రవ్వ, కమ్మటి పెరుగు, ఫ్రెష్ క్రీమ్ వేసి బాగా కలపాలి. అవసరమైతే కొద్దిగా నీళ్లు పోసి, పిండిని కాస్త చిక్కటి పేస్ట్‌లా కలుపుకోవాలి. రవ్వ నానేందుకు ఈ మిశ్రమాన్ని 10 నిమిషాల పాటు పక్కన ఉంచాలి.
-పది నిమిషాల తర్వాత రవ్వ చక్కగా నానుతుంది. ఇప్పుడు ఆ పిండిలో సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ, క్యాప్సికమ్, టమాటా ముక్కలను వేయాలి. ఇందులో రుచికి సరిపడా ఉప్పు, మిరియాల పొడి, సగం చిల్లీ ఫ్లేక్స్, ఒరెగానో వేసి కూరగాయలన్నీ పిండిలో బాగా కలిసేలా మిక్స్ చేయాలి.
-ఇప్పుడు బ్రెడ్ స్లైసెస్ తీసుకుని, వాటిని ఒక గిన్నె లేదా గ్లాసు అంచుల సహాయంతో గుండ్రటి ఆకారంలో కట్ చేసుకోవాలి. ఆ గుండ్రటి బ్రెడ్ ముక్కల పైన పిజ్జా సాస్‌ను సమానంగా పూయాలి. ఆ తర్వాత మనం ముందుగా సిద్ధం చేసుకున్న రవ్వ-కూరగాయల మిశ్రమాన్ని ఒక మందపాటి పొరలాగా బ్రెడ్ పైన అప్లై చేయాలి.
-ఆ రవ్వ పొర పైన తురిమిన మోజారెల్లా చీజ్ ను చల్లుకోవాలి. దాని పైన మరికొన్ని చిల్లీ ఫ్లేక్స్, ఒరెగానో చల్లాలి.
-ఇప్పుడు స్టవ్ వెలిగించి, నాన్ స్టిక్ పాన్ పెట్టుకోండి. పాన్ వేడయ్యాక కొద్దిగా వెన్న లేదా నెయ్యి వేసి కరిగించండి. ఇప్పుడు సిద్ధం చేసుకున్న బ్రెడ్ ముక్కలను మెల్లగా పాన్ మీద ఉంచండి. ఆవిరి బయటకు పోకుండా, చీజ్ చక్కగా కరిగేలా పాన్‌పై ఒక మందపాటి మూతను ఉంచండి.
-మంటను సిమ్‌లో ఉంచి 3 నుండి 4 నిమిషాల పాటు కాల్చుకోవాలి. అడుగు భాగం కరకరలాడుతూ, పైన చీజ్ మెత్తగా కరిగిపోతుంది. అంతే ఎంతో రుచికరమైన, వేడివేడి మినీ బ్రెడ్-రవ్వ పిజ్జా రెడీ. మైదా వాడలేదు కాబట్టి ఆరోగ్యానికి ఎలాంటి ఢోకా లేదు, కూరగాయలు ఉన్నందున పోషకాలు కూడా అందుతాయి.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications