జీరో ఆయిల్,సూపర్ టేస్ట్..చపాతీ, పుల్కాల్లోకి పనీర్ మటర్ మలై ఇలా చేసేయండి!

Posted By:

ప్రస్తుత రోజుల్లో ఆరోగ్యం పట్ల అందరికీ శ్రద్ధ బాగా పెరిగింది. కమ్మని భోజనం చేయాలని ఉన్నా, కూరల్లో ఉండే నూనె, వెన్న చూసి బరువు పెరుగుతామేమో అని భయపడుతుంటారు. అలాంటి వారి కోసమే బెస్ట్ రెసిపీ జీరో ఆయిల్ పనీర్ మటర్ మలై. ఈ వంటకంలో ఒక్క చుక్క నూనె కూడా వాడము. అయినా సరే, ఇది ఎంతో కమ్మగా, క్రీమీగా ఉంటుంది. మసాలా ఘాటు లేకుండా, నోట్లో వేసుకోగానే కరిగిపోయే కమ్మని రుచితో ఉండే గ్రేవీలను ఇష్టపడే వారు పనీర్ మటలర్ మలై రెసిపిని కచ్చితంగా ట్రై చేయాల్సిందే.

No Oil No Butter Pure Taste How to Make Zero Oil Paneer Matar Malai at Home in Telugu

పనీర్ మటర్ మలై తయారీకి కావలసిన పదార్థాలు

-1 పెద్ద ఉల్లిపాయ
-3-4 పచ్చిమిర్చి
-అల్లం చిన్న ముక్క
-3 వెల్లుల్లి రెబ్బలు
-1 టేబుల్ స్పూన్ గసగసాలు
-6-8 జీడిపప్పులు
-1 టేబుల్ స్పూన్ సోంపు
-కొద్దిగా దాల్చిన చెక్క
-2-3 లవంగాలు
-1 కప్పు కాచిన పాలు
-1 కప్పు పచ్చి బఠానీలు
-1 కప్పు పనీర్ ముక్కలు
-1 టీస్పూన్ ఉప్పు
-కొద్దిగా కసూరి మేతి

పనీర్ మటర్ మలై తయారీ విధానం

-ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకోండి. అందులో తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి, ముందుగా నానబెట్టుకున్న గసగసాలు, జీడిపప్పు, సోంపు, దాల్చిన చెక్క, లవంగాలు వేయండి. తగినన్ని నీళ్లు పోసి ఎంతో మెత్తని పేస్ట్ లా గ్రైండ్ చేసుకోండి. ఈ పేస్టే మన కూరకు క్రీమీ టెక్స్చర్ ను ఇస్తుంది.

-ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ వేడి చేయండి. మనం నూనె వాడటం లేదు కాబట్టి పాన్ వేడెక్కగానే నేరుగా మనం మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్ ను వేయండి. అడుగు అంటకుండా ఉండటానికి కొద్దిగా నీళ్లు చల్లి కలపండి. ఇందులోనే ఒక కప్పు కాచిన పాలు పోసి గ్రేవీని చక్కగా కలపండి. మీ రుచికి తగినట్లుగా 1 టీస్పూన్ ఉప్పు వేయండి. ఇప్పుడు అందులో ఫ్రెష్ పచ్చి బఠానీలు, పనీర్ ముక్కలు వేసి జాగ్రత్తగా కలపండి. మసాలా పచ్చి వాసన పోయేంతవరకు సన్నని మంట మీద ఉడికించండి.

-గ్రేవీ చిక్కబడి, కూర నుండి కమ్మటి సువాసన వస్తున్నప్పుడు.. చివరగా కొద్దిగా కసూరి మేతిని చేతులతో నలిపి చల్లుకోండి.

-అంతే ఎంతో అద్భుతమైన జీరో ఆయిల్ పనీర్ మటర్ మలై రెడీ. వేడి వేడి పుల్కా, చపాతీ లేదా అన్నంలోకి ఈ గ్రేవీని వడ్డించండి. ఒక్క చుక్క నూనె లేకపోయినా దీని రుచి చూసి మీ ఇంట్లో వాళ్లంతా ఆశ్చర్యపోవడం ఖాయం.

[ of 5 - Users]
Story first published: Thursday, July 23, 2026, 9:50 [IST]
Desktop Bottom Promotion