Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
కస్టర్డ్ పౌడర్,చక్కెర లేకుండానే..ఇంట్లోనే క్రీమీ,హెల్తీ ఫ్రూట్ కస్టర్డ్..ఎలా చేసుకోవాలంటే..
చల్లచల్లగా, పండ్ల ముక్కలతో నోరూరించే కస్టర్డ్ అంటే పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ ఎంతో ఇష్టం. అయితే సాధారణంగా కస్టర్డ్ తయారు చేయడానికి చాలామంది మార్కెట్లో దొరికే కస్టర్డ్ పౌడర్, రిఫైండ్ చక్కెరను ఉపయోగిస్తుంటారు. ఇవి ఆరోగ్యానికి అంత మంచివి కావు.
ఆరోగ్యానికి మేలు చేసేలా, అదే సమయంలో రుచి ఏమాత్రం తగ్గకుండా కస్టర్డ్ ఎలా తయారు చేసుకోవచ్చు. కస్టర్డ్ పౌడర్, చక్కెర అస్సలు వాడకుండా అత్యంత రుచికరమైన, క్రీమీ ఫ్రూట్ కస్టర్డ్ ఎలా చేయాలో ఇక్కడ చూడండి.

ఫ్రూట్ కస్టర్డ్ తయారీకి కావాల్సిన పదార్థాలు
మఖానా- 1 కప్పు
బాదం- చెరో అరకప్పు
జీడిపప్పు- చెరో అరకప్పు
గోరువెచ్చని పాలు - తగినంత
కుంకుమపువ్వు - కొద్దిగా
తేనె - రుచికి సరిపడా
నచ్చిన పండ్లు (ఆపిల్, ద్రాక్ష, సపోటా, అరటి, దానిమ్మ)
పిస్తా పప్పులు - కొద్దిగా
ఫ్రూట్ కస్టర్డ్ తయారీ విధానం
-ముందుగా ఒక గిన్నె తీసుకోండి. అందులో ఒక కప్పు మఖానా, అరకప్పు బాదం పప్పులు,అరకప్పు జీడిపప్పు వేయండి. ఈ డ్రైఫ్రూట్స్ మునిగేలా ఒక కప్పు గోరువెచ్చని పాలను అందులో పోయాలి.
-ఇప్పుడు ఆ పాలలో కొన్ని కుంకుమపువ్వు రేకులు, రుచికి సరిపడా స్వచ్ఛమైన తేనెను కలుపుకోండి. ఈ మిశ్రమాన్ని కనీసం 15 నుంచి 20 నిమిషాల పాటు పక్కన ఉంచండి. ఇలా చేయడం వల్ల డ్రైఫ్రూట్స్ పాలను పీల్చుకుని బాగా మెత్తబడతాయి.
-అవి నానేలోపు, ఆపిల్, ద్రాక్ష, సపోటా, అరటిపండు తదితర పండ్లను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి.
-20 నిమిషాల తర్వాత నానబెట్టిన డ్రైఫ్రూట్స్-పాల మిశ్రమాన్ని మిక్సీ జార్ లో వేసి మంచి క్రీమీ స్ట్రక్చర్ వచ్చేంత వరకు మందపాటి పేస్ట్ లా రుబ్బుకోవాలి.
-ఇప్పుడు ఒక పెద్ద బౌల్ తీసుకుని, అందులో ముందుగా కట్ చేసుకున్న
పండ్ల ముక్కలన్నీ వేయండి. మిక్సీ పట్టుకున్న చిక్కటి డ్రైఫ్రూట్స్
క్రీమీ పేస్ట్ ను ఈ పండ్ల ముక్కలపై పోయండి.
పండ్ల ముక్కలకు ఈ క్రీమీ మిశ్రమం బాగా పట్టేలా నెమ్మదిగా కలపండి.
-చివరగా అలంకరణ కోసం మరికొన్ని దానిమ్మ గింజలు, సన్నగా తరిగిన అరటిపండు ముక్కలు, పిస్తా పలుకులను పైన చల్లుకోండి. ఫ్రూట్ కస్టర్డ్ రెడీ.
-ఈ ఫ్రూట్ కస్టర్డ్ ను ఒక గంట పాటు ఫ్రిజ్లో ఉంచి ఆ తర్వాత బయటకు తీసి సర్వ్ చేయండి. ఆ చల్లని, చిక్కటి, క్రీమీ కస్టర్డ్ రుచికి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. ఎలాంటి కృత్రిమ పౌడర్లు లేకుండా చేసిన ఈ కస్టర్డ్ వల్ల శరీరానికి ప్రోటీన్, పండ్ల వల్ల విటమిన్లు అందుతాయి.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications