Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
స్ట్రీట్ ఫుడ్ టేస్ట్ ఇంట్లోనే..ఎలాంటి సాస్ లు లేకుండానే అదిరిపోయే వెల్లుల్లి కారం ఎగ్ ఫ్రైడ్ రైస్..
ఫాస్ట్ ఫుడ్ అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది ఫ్రైడ్ రైస్. చికెన్, ఎగ్, వెజ్.. ఇలా రకరకాల ఫ్రైడ్ రైస్ లకు ఆహార ప్రియుల్లో ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. బయట రెస్టారెంట్లలో లేదా స్ట్రీట్ ఫుడ్ సెంటర్లలో దొరికే ఆ రుచిని ఇంట్లో ఆస్వాదించాలని చాలామందికి ఉంటుంది. కానీ ఇంట్లో ఫ్రైడ్ రైస్ చేయాలంటే రకరకాల సాస్‌లు (సోయా సాస్, చిల్లీ సాస్, వెనిగర్) కచ్చితంగా ఉండాలనే అపోహ ఉంది. అవి లేకపోతే ఆ బయటి టేస్ట్ రాదేమో అని ఆగిపోతుంటారు.
అయితే ఎలాంటి సాస్ లు వాడకుండా, కేవలం మన ఇంట్లో ఉండే వెల్లుల్లి రెబ్బలతో రెస్టారెంట్ రుచిని తలదన్నేలా అదిరిపోయే ఫ్రైడ్ రైస్ చేసుకోవచ్చు. ఇంట్లో కూరగాయలు లేనప్పుడు, నోటికి ఏదైనా ఘాటుగా, రుచిగా తినాలనిపించినప్పుడు లేదా తక్కువ టైమ్‌లో వంట అయిపోవాలి అనుకున్నప్పుడు వెల్లుల్లి కారం ఎగ్ ఫ్రైడ్ రైస్ బెస్ట్ ఆప్షన్.

వెల్లుల్లి కారం ఎగ్ ఫ్రైడ్ రైస్ తయారీకి కావాల్సిన పదార్థాలు
బియ్యం - 2 కప్పులు
కోడిగుడ్లు - 2 లేదా 3
వెల్లుల్లి రెబ్బలు - 20
కారం - 2 టేబుల్ స్పూన్లు
ఉప్పు - రుచికి సరిపడా
కరివేపాకు - గుప్పెడు
నూనె - 4 టేబుల్ స్పూన్లు
కొత్తిమీర తరుగు - కొద్దిగా
వెల్లుల్లి కారం ఎగ్ ఫ్రైడ్ రైస్ తయారీ విధానం
-ముందుగా బియ్యాన్ని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి, తగినన్ని నీళ్లు పోసి పొడిపొడిలాడేలా ఉడికించి పక్కన పెట్టుకోవాలి.
-ఈ రెసిపీకి అసలైన రుచినిచ్చేది వెల్లుల్లి కారమే. దీనికోసం ఒక చిన్న రోలు తీసుకుని.. అందులో పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు, కారం, ఉప్పు, గుప్పెడు కరివేపాకు వేసి మెత్తటి పేస్ట్ లా దంచుకోవాలి. రోలు లేకపోతే మిక్సీ పట్టుకోవచ్చు.
-ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక వెడల్పాటి పాన్ పెట్టుకుని నూనె వేడి చేయాలి. నూనె కాగాక ముందుగా దంచి పెట్టుకున్న వెల్లుల్లి కారం వేసి, మంటను సిమ్ లో ఉంచి పచ్చి వాసన పోయేలా వేయించాలి. నూనెలో వెల్లుల్లి వేగితే ఇల్లంతా కమ్మని వాసన వస్తుంది.
-వెల్లుల్లి కారం మగ్గి, నూనె పైకి తేలుతున్న సమయంలో కోడిగుడ్లను
పగులగొట్టి అందులో వేయాలి. వెంటనే గరిటె పెట్టి కలపకుండా ఒక రెండు
నిమిషాల పాటు అలానే వదిలేయాలి.
ఆ తర్వాత గరిటెతో నెమ్మదిగా కలుపుతూ, ఎగ్స్ కు ఆ వెల్లుల్లి
కారం బాగా పట్టేలా ఫ్రై చేసుకోవాలి.
-గుడ్డు పర్ఫెక్ట్ గా వేగిన తర్వాత, ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ వేసి బాగా మిక్స్ చేయాలి. మంటను కాస్త పెంచి అన్నానికి మసాలా అంతా పట్టేలా టాస్ చేసుకోవాలి.
-చివరగా సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటే..నోరూరించే వెల్లుల్లి కారం ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ.
-రాత్రి మిగిలిపోయిన అన్నంతో కూడా ఈ రెసిపీని క్షణాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications