Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
పండిన అరటిపండ్లతో సింపుల్ అండ్ సూపర్ స్వీట్..హెల్తీ బనానా బర్ఫీ ఎలా చేసుకోవాలంటే..
సాధారణంగా మన ఇళ్లలో అరటిపండ్లు కొంచెం ఎక్కువగా పండిపోతే, వాటి తొక్క నల్లగా మారిపోయిందని ఎవరూ తినడానికి ఇష్టపడరు. చివరికి వాటిని పనికిరావని చెత్తబుట్టలో పారేస్తుంటాం. కానీ అలా బాగా పండిన అరటిపండ్లలో పోషకాలు, తీపి శాతం చాలా ఎక్కువగా ఉంటాయని మీకు తెలుసా?
ఇకపై ఆ పండ్లను పారేయాల్సిన అవసరం లేదు. వాటితో నోట్లో వేసుకోగానే ఇట్టే కరిగిపోయే అద్భుతమైన అరటిపండు బర్ఫీ తయారు చేసుకోవచ్చు. దీనిలో మనం పంచదారకు బదులుగా బెల్లం ఉపయోగించి చేస్తే ఇది ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఈ స్వీట్ ను లొట్టలేసుకుంటూ తింటారు.

బనానా బర్ఫీ తయారీకి కావలసిన పదార్థాలు
పండిన అరటిపండ్లు - 3
తురిమిన బెల్లం - 1 కప్పు
స్వచ్ఛమైన నెయ్యి - అర కప్పు
గోధుమ పిండి - అర కప్పు
బొంబాయి రవ్వ (ఉప్మా రవ్వ) - అర కప్పు కంటే కొంచెం తక్కువ
నీళ్లు - 1 కప్పు
యాలకుల పొడి - 1 టీస్పూన్
కుంకుమపువ్వు - కొద్దిగా
జీడిపప్పు, బాదం, పిస్తా - అర కప్పు
బనానా బర్ఫీ తయారీ విధానం
-ముందుగా పండిన మూడు అరటిపండ్ల తొక్క తీసి, ముక్కలుగా చేసుకోండి. వీటిని మిక్సీ జార్ లో వేసి ఎక్కడా ఉండలు లేకుండా మెత్తని పేస్ట్ లా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి.
-స్టవ్ వెలిగించి ఒక గిన్నెలో ఒక కప్పు తురిమిన బెల్లం, ఒక కప్పు నీళ్లు పోసి వేడి చేయండి. బెల్లం పూర్తిగా కరిగి, నీళ్లు కొద్దిగా చిక్కబడే వరకు మరిగించి పక్కన ఉంచండి. పాకం రావాల్సిన అవసరం లేదు.
-ఇప్పుడు మందంగా ఉన్న కడాయిని స్టవ్ మీద పెట్టి అందులో అరకప్పు నెయ్యి వేడి చేయండి. నెయ్యి కరిగాక గోధుమ పిండి, బొంబాయి రవ్వ వేసి మంటను సిమ్ లో ఉంచండి. పిండి పచ్చివాసన పోయి, మంచి బంగారు రంగులోకి వచ్చే వరకు గరిటెతో తిప్పుతూ వేయించాలి.
-పిండి బాగా వేగిన తర్వాత సిద్ధం చేసుకున్న అరటిపండు పేస్ట్ ను అందులో వేయాలి. అరటిపండులోని తేమ పోయి నెయ్యి పైకి తేలేవరకు బాగా ఉడికించాలి.
-అరటిపండు, పిండి మిశ్రమం బాగా ఉడికిన తర్వాత ముందుగా కరిగించి పెట్టుకున్న బెల్లం నీళ్లను వడకట్టి పోయాలి. దీనికి కుంకుమపువ్వు మిశ్రమాన్ని కూడా జతచేసి బాగా కలపాలి. ఇది పాన్ కు అంటుకోకుండా దగ్గరపడేవరకు ఉడికించాలి.
-మిశ్రమం బాగా గట్టిపడుతున్న సమయంలో మిగిలిన రెండు చెంచాల నెయ్యి, యాలకుల పొడి, సన్నగా తరిగిన డ్రై ఫ్రూట్స్ వేసి మరోసారి కలపండి. ముద్దలా ఫామ్ అయినప్పుడు స్టవ్ ఆఫ్ చేయండి.
-ఒక ట్రే లేదా పళ్ళెంకి కొద్దిగా నెయ్యి రాసి ఈ వేడి వేడి మిశ్రమాన్ని అందులో పోసి సమానంగా పరచాలి. పైన మరికొన్ని డ్రై ఫ్రూట్స్ చల్లుకోండి.
-ఈ మిశ్రమం పూర్తిగా చల్లారనివ్వాలి. తర్వాత మీకు ఇష్టమైన ఆకారంలో ముక్కలుగా కట్ చేసుకోండి. బనానా బర్ఫీ రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications