Latest Updates
-
తులసి తీర్థం మహిమ? చనిపోయిన మహిళ బతికింది! -
రెస్టారెంట్ రుచిని మించేలా ఇంట్లోనే బిసిబేలే బాత్.. సులభంగా ఎలా చేయాలంటే? -
కరివేపాకు vs వేప ఆకు..పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాల్లో ఏది బెస్ట్ అంటే..! -
నవరాత్రి స్పెషల్: రుచితో పాటు ఆరోగ్యం.. జీర్ణశక్తిని పెంచే అద్భుతమైన తమలపాకు కేసరి ప్రసాదం -
నోరూరించే ఆమ్లెట్ పులుసు.. పుల్లపుల్లగా, కారంకారంగా రుచి అదరహో! -
దీపావళికి ముందే ధ్వజ యోగం.. ఈ 4 రాశుల జాతకులు కోటీశ్వరులు కావడం ఖాయమా? -
నల్ల పాలు తాగుతున్న తెలుగు హీరోయిన్..ప్రయోజనాలేంటో,ఎలా చేసుకోవాలో తెలుసా? -
మటన్ సాంబార్ వండేటప్పుడు ఈ మసాలా పడితే ఆ రుచే వేరు..రాగి సంగటి, చపాతీ,అన్నంలోకి కేక -
రోగనిరోధక శక్తిని పెంచే జామకాయ పచ్చడి.. ఊరనివ్వాల్సిన పనే లేకుండా అప్పటికప్పుడే రెడీ! -
Viral Video Truth: రష్యా యువతి, బీహార్ యువకుడి ప్రేమ కథలో పెద్ద ట్విస్ట్..
వంట చేసే ఓపిక లేదా? కేవలం 10 నిమిషాల్లో ఈ పచ్చిమిర్చి నువ్వుల రైస్ చేసి చూడండి, టేస్ట్ అదుర్స్!
వంట చేసే ఓపిక, టైం లేనప్పుడు, ఎప్పుడై ఒకరకమైన వంటకాలు తిని బోర్ కొట్టినప్పుడు ఖచ్చితంగా పచ్చిమిరపకాయ నవ్వుల రైస్ ఒక్కసారి చేసి చూడండి. రుచిని జన్మలో మర్చిపోలేరు. పిల్లల లంచ్ బాక్స్ లోకి ఈజీగా చేయడానికి కూడా ఇది పర్ఫెక్ట్.
వేడిగా తిన్నా, చల్లారాక తిన్నా ఎలా తిన్నా దీని రుచి అమోఘం, అద్భుతమే. పచ్చిమిర్చి నువ్వుల రైస్ కేవలం 10 నిమిషాల్లో ఈజీగా ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.

పచ్చిమిర్చి నువ్వుల రైస్ తయారీకి కావాల్సినవి
-కొత్తిమీర
-వెల్లుల్లి
-పచ్చిమిరపకాయ
-నువ్వులు
-జీలకర్ర
-తాలింపు గింజలు
-ఆయిల్
-కరివేపాకు
-పల్లీలు
-వండిన అన్నం
పచ్చిమిర్చి నువ్వుల రైస్ తయారీ విధానం
-ముందుగా స్టవ్ వెలిగించి ఒక బాండీ పెట్టుకోండి. అందులో రెండున్నర టేబుల్ స్పూన్ల నువ్వులు, 1 టీస్పూన్ జీలకర్ర వేసి వేయించాలి. నువ్వులు చిటపటలాడతున్నప్పుడు స్టవ్ ఆపేసి వాటిని ఒక ప్లేట్ లోకి తీసి పక్కన పెట్టకోండి.
-తర్వాత స్టవ్ మీద ఉన్న అదే బాండీలో 1 టీస్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొద్దగా వేడయ్యాక అందులో 4 పచ్చిమిరపకాయలు, పావు కట్ట కొత్తిమీర, 20 వెల్లుల్లి రెబ్బలు వేసి 1 నిమిషం పాటు తక్కువ మంట మీద వేయించి స్టవ్ ఆపేయండి.
-ఇప్పుడు వేయించిన నువ్వులు,పచ్చిమిర్చి మిశ్రమం మొత్తం చల్లారకా మిక్సీ గిన్నెలో వేసి కొంచెం బరకగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి.
-తర్వాత తాలింపు పెట్టుకోవాలి. ఇందుకోసం స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టి అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక అందులో తాలింపు గింజలతో పాటు 1 టేబుల్ స్పూన్ పల్లీలు కూడా వేసి వేయించుకోవాలి.
-తాలింపు వేగాక అందులో గ్రైండ్ చేసుకున్న నువ్వులు పచ్చిమిర్చి మిశ్రమం వేసి కలుపుకోండి. తర్వాత ఇందులో కొద్దిగా కరివేపాకు, పొడవుగా కట్ చేసుకున్న 2 పచ్చిమిరపకాయలు వేసి 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి.యతర్వాత అందులో రుచికి తగినంత ఉప్పు వేసి కలుపుకోవాలి.
-తర్వాత అందులో పొడి పొడిగా ఉడికించుకున్న 200 గ్రాముల అన్నం వేసి మొత్తం కలిసేలా బాగా కలుపుకోవాలి.
-అంతే పచ్చిమిర్చి నువ్వుల అన్నం రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
