Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
ఆఫీస్ నుంచి రాగానే అలసటగా ఉందా? 15 నిమిషాల్లో ఈ క్రీమీ పనీర్ గ్రేవీ ట్రై చేయండి..చపాతీ, రైస్ లోకి కేక
ఆఫీస్ నుండి బాగా అలసిపోయి వచ్చారా? వంట గదిలో గంటల తరబడి నిలబడి వంట చేసే ఓపిక లేదా? అయినా సరే వేడివేడిగా, కమ్మగా ఏదైనా తినాలనిపిస్తోందా? అయితే మీ కోసమే ఈ అద్భుతమైన రెసిపీ ఉంది. వంట చేయడం పెద్దగా రాని బిగినర్స్ అయినా అయినా సరే.. ఎలాంటి శ్రమ లేకుండా, చాలా ఈజీగా తయారు చేసుకోగలిగే వంటకం పనీర్ గ్రేవీ. పనీర్ గ్రేవీని కేవలం 15 నిమిషాల్లో ఎలా చేసుకోవాలో ఇక్కడ చూడండి.

పనీర్ గ్రేవీ తయారీకి కావలసిన పదార్థాలు
పనీర్ ముక్కలు - ఒక కప్పు
ఉల్లిపాయ - 1
పెరుగు - పావు కప్పు
కొత్తిమీర - గుప్పెడు
వెల్లుల్లి రెబ్బలు - 5
జీడిపప్పు - 10
కారం - 1 టీస్పూన్
ధనియాల పొడి - 1 టీస్పూన్
గరం మసాలా - ఒకటిన్నర టీస్పూన్
నూనె - 2 టేబుల్ స్పూన్లు
సోంపు - 1 టీస్పూన్
ఉప్పు - 1 టీస్పూన్
పనీర్ గ్రేవీ తయారీ విధానం
-ముందుగా ఒక మిక్సీ జార్ లో 1 ఉల్లిపాయ ముక్కలు, పావు కప్పు పెరుగు,గుప్పెడు కొత్తిమీర, 5 వెల్లుల్లి రెబ్బలు, 10 జీడిపప్పులు, 1 టీస్పూన్ కారం, 1 టీస్పూన్ ధనియాల పొడి, ఒకటిన్నర టీస్పూన్ల గరం మసాలా వేసి మెత్తని పేస్ట్ లా మిక్సీ పట్టుకోండి. మసాలా అంతా మెత్తగా అయ్యేలా బ్లెండ్ చేసి పక్కన పెట్టుకోండి.
-ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకోండి. అందులో కొద్దిగా నూనె లేదా వెన్న వేసి పనీర్ ముక్కలను వేయండి. పనీర్ పై చిటికెడు కారం, కొద్దిగా గరం మసాలా చల్లి.. రెండు నిమిషాల పాటు తక్కువ మంటపై దోరగా వేయించండి. ఇలా చేయడం వల్ల పనీర్ ముక్కలకు మసాలా పట్టి చప్పగా లేకుండా చాలా రుచిగా ఉంటాయి. వేగిన పనీర్ ముక్కలను మాడిపోకుండా ఒక ప్లేట్ లోకి తీసి పక్కన పెట్టుకోండి.
-ఇప్పుడు అదే పాన్ లో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడి చేయండి. నూనె వేడెక్కాక 1 టీస్పూన్ సోంపు వేసి మంచి వాసన వచ్చే వరకు వేయించండి. సోంపు ఈ కర్రీకి అద్భుతమైన ఫ్లేవర్ ఇస్తుంది. తర్వాత ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న ఉల్లిపాయ, పెరుగు మసాలా పేస్ట్ ను నూనెలో వేసి బాగా కలపండి. రుచికి సరిపడా ఉప్పు వేసి, మంటను మీడియం ఫ్లేమ్ లో ఉంచి ఉడికించండి.
-మసాలాలోని పచ్చి వాసన పోయి, నూనె పైకి తేలుతూ మంచి సువాసన వచ్చే వరకు సుమారు 5 నిమిషాలు బాగా మగ్గనివ్వండి. గ్రేవీ చక్కగా ఉడికిన తర్వాత, ముందుగా వేయించి పెట్టుకున్న పనీర్ ముక్కలను అందులో వేయండి. గ్రేవీ అంతా పనీర్ కు పట్టేలా కలపండి.
-కర్రీ మరీ చిక్కగా అనిపిస్తే కొద్దిగా నీళ్లు కలుపుకోవచ్చు. చివరిగా కొద్దిగా కొత్తిమీర చల్లుకుని దించేయండి.
-అంతే ఎంతో రుచికరమైన క్రీమీ పనీర్ గ్రేవీ రెడీ. ఈ స్పైసీ పనీర్ గ్రేవీని చపాతీ, పూరీ, పరోటా, రోటీతో, అన్నం, ఫ్రైడ్ రైస్ లోకి కూడా ఇది అద్భుతంగా ఉంటుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications