Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
ఇంట్లో కూరగాయలు లేవా? ఒక్క స్పూన్ మిరియాలతో ఘుమఘుమలాడే చెట్టినాడ్ పెప్పర్ కర్రీ
ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు మీ వంటగదిలో కేవలం ఒక్క టేబుల్ స్పూన్ మిరియాలతో అద్భుతమైన గ్రేవీ తయారు చేసుకోవచ్చు. ఇది కేవలం రుచికి మాత్రమే కాదు, ఆరోగ్యానికి కూడా ఓ దివ్యౌషధం. ముఖ్యంగా జలుబు చేసి, గొంతు గరగరలాడుతున్నప్పుడు ఈ మిరియాల కూరను వేడి వేడి అన్నంలో కలుపుకుని తింటే చాలు గొంతుకు ఎంతో ఉపశమనంగా, హాయిగా ఉంటుంది.
చలికాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచడానికి ఇది ఒక చక్కని పరిష్కారం. చెట్టినాడ్ స్టైల్ మిరియాల గ్రేవీ ఎలా చేసుకోవాలో ఇక్కడ చూడండి.

కావలసిన పదార్థాలు
వేయించి, మసాలా ముద్ద చేసుకోవడానికి:
ధనియాలు - 1 టేబుల్ స్పూన్
శెనగపప్పు - 1 టేబుల్ స్పూన్
మినపప్పు - 1 టేబుల్ స్పూన్
మిరియాలు - 1 టేబుల్ స్పూన్
ఎండు మిరపకాయలు - 2
జీలకర్ర - అర టేబుల్ స్పూన్
కరివేపాకు - రెండు రెబ్బలు
పచ్చి కొబ్బరి తురుము - 2 టేబుల్ స్పూన్లు
చింతపండు - చిన్న నిమ్మకాయంత
కూర తయారీకి (తాలింపు కోసం)
నువ్వుల నూనె - 2-3 టేబుల్ స్పూన్లు
ఆవాలు - పావు టీస్పూన్
మినపప్పు - పావు టీస్పూన్
ఇంగువ - 2 చిటికెలు
కరివేపాకు - ఒక రెబ్బ
సాంబార్ ఉల్లిపాయలు- 10
పసుపు - పావు టీస్పూన్
ఉప్పు - రుచికి సరిపడా
సాంబార్ పొడి లేదా కారం -అర టీస్పూన్
నీళ్లు - సుమారు ఒకటింబావు కప్పులు
తయారీ విధానం
ముందుగా చింతపండును ఒక కప్పు గోరువెచ్చని నీటిలో నానబెట్టి పక్కన పెట్టుకోవాలి.
తర్వాత స్టవ్ మీద ఒక పాన్ పెట్టి నూనె లేకుండా ధనియాలు, శెనగపప్పు, మినపప్పు, మిరియాలు, ఎండు మిరపకాయలు వేసి చిన్న మంట మీద కమ్మటి వాసన వచ్చేవరకు దోరగా వేయించుకోవాలి.
మసాలాలు చక్కగా వేగాక, జీలకర్ర, కరివేపాకు వేసి ఒక్క నిమిషం వేయించి, వెంటనే వాటిని ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారనివ్వాలి.
అదే పాన్ లో కొబ్బరి తురుము వేసి అందులోని తేమ పోయి, పొడిపొడిగా అయ్యేంతవరకు వేయించి, దాన్ని కూడా చల్లార్చిన మసాలాలతో కలపాలి.
ఇప్పుడు వేయించుకున్న దినుసులన్నీ మిక్సీ గిన్నెలో వేయాలి. ఇదులోనే నానబెట్టిన చింతపండు, చింతపండు నానబెట్టిన నీటిని కూడా కలిపి వీలైనంత మెత్తగా పేస్టులా గ్రైండ్ చేసుకోవాలి.
తర్వాత స్టవ్ మీద అదే పాన్ పెట్టి నువ్వుల నూనె వేసి వేడి చేయాలి. నూనె కాస్త వేడెక్కాక ఆవాలు, మినపప్పు వేసి చిటపటలాడనివ్వాలి. ఆ తర్వాత ఇంగువ, కరివేపాకు వేసి వేయించాలి. ఇప్పుడు చిన్న ఉల్లిపాయలు వేసి, అవి కొద్దిగా రంగు మారివరకు బాగా వేయించాలి.
ఉల్లిపాయలు వేగాక ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా ముద్దను వేసి పచ్చి వాసన పోయేవరకు ఒకటి రెండు నిమిషాలు నూనెలో వేయించాలి. ఆ తర్వాత పావు కప్పు నీళ్లు పాన్ లో పోయాలి. దీనికి పసుపు, రుచికి సరిపడా ఉప్పు, సాంబార్ పొడి వేసి బాగా కలపాలి.
చివరగా, మరో కప్పు నీళ్లు పోసి గ్రేవీని బాగా కలిపి నూనె పైకి తేలి, గ్రేవీ కొద్దిగా చిక్కబడే వరకు మరిగించి స్టవ్ ఆపేయాలి. అంతే ఘుమఘుమలాడే, రుచికరమైన చెట్టినాడ్ మిరియాల గ్రేవీ రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications