Latest Updates
-
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్!
మిగిలిపోయిన అన్నంతో కేవలం 5 నిమిషాల్లో కారం రైస్..దీని రుచి అమృతమే మాస్టారు!
ఇంట్లో ఏ కూరగాయలు లేనప్పుడు లేదా వంట చేసుకోబుద్ది కానప్పుడు, నోటికి కారంగా ఏదైనా తినాలనిపించినప్పుడు కారం రైస్ తప్పక ట్రై చేయండి. దీని తయారీకి ఎక్కవ సమయం పట్టదు. ఎలాంటి కూరగాయలు అక్కర్లేదు కూడా. కేవలం 5 నిమిషాల్లో దీనిని తయారుచేసుకోవచ్చు. పెద్దగా ఖర్చు కూడా ఉండదు.
ఒక్కముద్ద తిన్నారంటే అమృతం అంటూ ప్లేట్ మొత్తం నాకేస్తారు. అంత రుచిగా ఉంటుంది. వెరైటీ వంటలు కోరుకునేవారికి కూడా ఇది పర్ఫెక్ట్ గా ఉంటుంది. దీని వాసనకే సగం కడుపు నిండిపోతుంది. మిగిలిపోయిన అన్నంతో కూడా దీనిని తయారుచేససుకోవచ్చు. దీని తయారీలో వాడే పదార్థాలన్నీ ఆరోగ్యానికి బోలెడంత మేలు చేసేవే. సూపర్ టేస్టీ కారం రైస్ మీ ఇంట్లో తయారుచేసుకోడానికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఇక్కడ చూడండి.

కారం రైస్ తయారీకి కావాల్సిన పదార్థాలు
-కూరల్లో వేసుకునే కారం
-పల్లీలు
-ఉప్పు
-పచ్చిశెనగపప్పు
-ఆవాలు
-జీలకర్ర
-కరివేపాకు
-ఆయిల్
-కొత్తిమీర
-పచ్చిమిరపకాయలు
-అల్లంవెల్లుల్లి పేస్ట్
-వండిన అన్నం
కారం రైస్ తయారీ విధానం
-కారం రైస్ చేసుకోడానికి ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి వేడి చెయ్యాలి.
-వేడెక్కిన ఆయిల్ లో 1 టేబుల్ స్పూన్ పల్లీలు, 1 టీస్పూన్ తాలింపు గింజలు(పచ్చి శెనగపప్పు,ఆవాలు,జీలకర్ర)వేసుకొని మీడియం మంట మీద వేయించుకోవాలి.
-ఆవాలు చిటపటలాడి,పల్లీలు వేగిన తర్వాత అందులో పొడవుగా కట్ చేసిన 2 పచ్చిమిరపకాయల ముక్కలు, 2 రెమ్మల కరివేపాకు, 2 టీస్పూన్ల కూరల్లో వేసుకునే కారం వేసి ఒకసారి మాత్రమే కలుపుకోవాలి. కారాన్ని బాగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. ఒకసారి కలుపుకుంటే సరిపోతుంది.
-ఒకసారి కలుపుకున్న తర్వాత అందులో పావు టీస్పూన్ కంటే కొంచెం తక్కువ అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి.
-ఇప్పుడు అందులో ఉడికించిన 200 గ్రాముల అన్నం వేసి,ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసి మొత్తం అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి.
-కారం మొత్తం రైస్ కి పట్టేలా కలుపుకున్న తర్వాత అందులో సన్నగా తరిగిన కొత్తిమీర కొద్దిగా అందులో వేసుకొని కలుపుకోవాలి. అంతే కారం రైస్ రెడీ.
-కారం రైస్ ని ప్లేట్ లోకి తీసుకొని ఉల్లిపాయ ముక్కలు కలుపుకొని తింటుంటే ఆహా ఏమి రుచిరా అని తీరాల్సిందే.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications