For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బక్రీద్ స్పెషల్ ఘుమఘుమలాడే నాన్ వెజ్ వంటలు

|

ముస్లింలు బక్రీద్‌ను ఖుర్భాని పండుగ అని కూడా అంటారు. బక్రీద్ పండుగ రోజు ముస్లిం పవిత్ర స్థలమైన మక్కాలో హజ్ యాత్ర జరుగుతుంది. ముస్లిం సోదరులు జరుపుకునే ముఖ్యమైన పండుగల్లో రంజాన్ పండుగ మైదటిదైతే..బక్రీద్ రెండవదిగా నిలిచింది. ఈద్‌గాలో నమాజు ముగుస్తుంది. అందరినీ చల్లగా చూడమని కోరే దువా ముగుస్తుంది. ఆ తర్వాత ఈద్ ముబారక్ చెప్పుకునే అలాయి బలాయి ముగుస్తుంది. ఆ తర్వాత..? ఇంకేముంది... విందులూ వినోదాలే. స్నేహితులు, బంధువులు, ఆత్మీయులు, అయినవాళ్లు... అందరూ కలిసి దావత్‌లో కూచుంటారు. మతాలు మర్చిపోయే క్షణాల్లో అందరూ ఆత్మీయులైపోతారు. మటన్, చికెన్, రోటీ, సేమ్యా... ఘుమఘుమలాడే పదార్థాల మధ్య మాటలు నంజుకుంటారు. నవ్వులు పంచుకుంటారు. పండుగలు ఉండాలి. ఒకరి పండుగలో మరొకరి లోగిలి కళకళలాడాలి. ఆ బహార్ కోసమే ఈ వంటలు...

బక్రీద్ స్పెషల్ -ఎగ్ ఖీమా బిర్యానీ

బక్రీద్ స్పెషల్ -ఎగ్ ఖీమా బిర్యానీ

కావలసిన పదార్థాలు: బాస్మతి బియ్యం: 2, ఉడికించిన కోడిగుడ్లు: 8, నూనె: 1/2, నీళ్లు: 3. ఉల్లిపాయలు: 2, అల్లం, వెల్లుల్లి పేస్ట్: 2tsp, పలావ్ ఆకులు: 2, దాల్చిన చెక్క: చిన్నది, యాలకులు: 4, పసుపు: 1/2tsp, కారం: 1tsp, గరం మసాలా పొడి: 1tsp, కొత్తిమీర తురుము: 1/2cup, ఉప్పు: తగినంత,

తయారు చేయు విధానం: మొదటగా నూనె లేదా నెయ్యి వేడి చేసి ఉల్లిపాయముక్కలు, అల్లం, వెల్లుల్లి పేస్ట్ వేయాలి. రెండు నిమిషాల తర్వాత పలావ్ ఆకు, దాల్చిన చెక్క, యాలకులు కూడా వేసి, బంగారు రంగు వచ్చేవరకూ వేయించాలి. తర్వాత కోడి గుడ్లు, కారం, పసుపు వేయాలి. కోడిగుడ్లు రంగు మారాక బియ్యాన్ని వేయాలి. రెండు నిమిషాలు వేయించాక నీళ్లు పోయాలి. అందులోనే ఉప్పు, గరం మసాలా పొడి చల్లి మూత పెట్టాలి. మీడియం మంట మీద ఉడికించి నీరంతా ఇమిరిపోయాక, పొడిపొడిగా అన్నం తయారయ్యాక కొత్తిమీర తురుము చల్లుకుని దించేసుకోవాలి. అంతే ఎగ్ బిర్యాని రెడీ.

బక్రీద్ స్పెషల్ -చికెన్ బాల్స్

బక్రీద్ స్పెషల్ -చికెన్ బాల్స్

కావల్సిన పదార్ధాలు: బోన్ లెస్ చికెన్ : 1/2 kg, ఉల్లిపాయలు: 1/4 kg, జీడిపప్పు: 1/4 cup, పచ్చిమిర్చి: 10, ఎండుమిర్చి: 6 అల్లం వెల్లుల్లి పేస్ట్: 1 tsp, ధనియాలు: 2 tsp, జిలకర్ర: 1 tsp, లవంగాలు, యాలకులు: 4 each, చెక్క: ఒక అంగులం, ఉప్పు: రుచికి సరిపడా, నూనె: కావలసినంత

తయారు చేయు విధానము: పాన్ లో కొద్దిగా నూనె వేసి అది వేడైన తర్వాత అందులో జిలకర్ర, ధనియాలు, లవంగాలు, చెక్క, ఎండుమిర్చి, జీడిపప్పు వేసి వేయించాలి. అవి చల్లారిన తర్వాత అందులో పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, అల్లం పేస్ట్, చికెన్, తగినంత ఉప్పు వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండటుగా చేస్తూ వేడైన నూనెలో డీప్ ఫ్రైచేయాలి. అంతే చికెన్ మసాలా బాల్స్ రెడీ. వీటిని వేడి వేడిగా తింటే రుచిగా ఉంటాయి.

బక్రీద్ స్పెషల్ -చికెన్ సూప్

బక్రీద్ స్పెషల్ -చికెన్ సూప్

కావలసినవి: బోన్‌ లెస్ చికెన్: 300grms, బాస్మతి రైస్: 1/2cup, ఉల్లిపాయ: 1/2cup(చిన్న ముక్కలుగా కట్ చేసినవి), అల్లం: చిన్న ముక్క(చిన్న ముక్కలుగా కట్ చేసినవి), కొత్తిమీర: 1cup(సన్నగా తరిగిపెట్టుకోవాలి), నిమ్మరసం: 1tbsp, పంచదార: 1tsp, బ్లాక్ పెప్పర్ పౌడర్: 2-3tbsp, ఉప్పు: రుచికి సరిపడా, బట్టర్: 2tbsp,

తయారు చేయు విధానం: ముందుగా చికెన్ ముక్కలను శుభ్రం చేయాలి. తర్వాత బాస్మతి రైస్ ను కూడా శుభ్రం చేసి కుక్కర్ లో రెండింటిని వేసి తగినన్ని నీళ్ళు పోసి, కొద్దిగా ఉప్పు చేర్చి మూత పెట్టి రెండు విజిల్స్ వచ్చేంత వరకూ ఉడికించుకోవాలి. తర్వాత ఫ్రైయింగ్ పాన్ స్టౌ మీద పెట్టి అందులో బట్టర్ (వెన్న)సగ భాగం వేసి, తక్కువ మంట మీద కరగనివ్వాలి. తర్వాత అందులో ఉల్లిపాయ ముక్కలు వేసి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకూ వేయించుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలు వేగిన తర్వాత అందులో అల్లం, కొత్తిమీర, నిమ్మరసం, వేసి తక్కువ మంట మీద రెండు నిముషాలు వేయించికోవాలి. తర్వాత అందులోనే పంచదార, బ్లాక్ పెప్పర్ పౌడర్, కొద్దిగా ఉప్పు వేసి, వేగించాలి.

బక్రీద్ స్పెషల్ -మటన్ ఖీమా

బక్రీద్ స్పెషల్ -మటన్ ఖీమా

కావలసిన పదార్థములు:

మటన్ ఖీమా - 250 గ్రాములు, ఉల్లిపాయలు - 2, టమాటాలు - 3, గరం మసాలా - 1 టిస్పూన్, అల్లం, వెల్లుల్లిపేస్ట్ - 2 టిస్పూన్, కరివేపాకు - 2 రెబ్బలు, కొత్తిమిర - 2 రెమ్మలు పసుపు - చిటికెడు, కారం - 1 టేబుల్ స్పూను, ఉప్పు - తగినంగ, నూనె - 3 టేబుల్ స్పూన్లు

తయారుచేయు పద్దతి:

ముందుగా ఖీమాను కడిగి పెట్టుకోవాలి, ఉల్లిపాయలు సన్నగా తరగాలి, గిన్నెలో నూనె వేడి చేసి ఉల్లిపాయలు లేత బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి, ఇప్పుడు కరివేపాకు, అల్లం,వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం వేసి కొద్దిగా వేపాలి. కడిగి పెట్టుకున్న ఖీమా వేసి తగినంత ఉప్పు వేసి అన్నీ కలిసేటట్టు కలిపి మూత పెట్టాలి. అందులోని నీరంతా ఇగిరిపోయాక చిన్న ముక్కలుగా చేసుకున్న టమాటా, గరం మసాలా వేసి కలియబెట్టి ఒక కప్పుడు నీళ్లు పోసి మెత్తగా ఉడికేవరకు ఉంచాలి, నీరంతా ఇరిగిపోయాక కొత్తిమిర చల్లి దింపుకోవాలి.

బక్రీద్ స్పెషల్ -మటన్ కబాబ్

బక్రీద్ స్పెషల్ -మటన్ కబాబ్

కావలసిన పదార్ధాలు: మటన్ - 1/2 kg, పెరుగు - 50 grms, క్రీము - 25 grms, గ్రుడ్డు - 1, వెన్న - 50 grms, పచ్చి బొప్పాయి - చిన్న ముక్క,యాలకుల పొడి - 1/2 tsp పచ్చిమిర్చి - 1/2 tsp, మిరియాల పొడి - తగినంత, ఉప్పు - రుచికి సరిపడా

తయారు చేయు విధానం: మటన్ ని నీటిలో శుభ్రపరిచి ఖైమా కొట్టించాలి. పచ్చి బొప్పాయి ముక్కతో తీసిన రసంటో యాలకుల పొడి వేసి కలిపి ఈ రసంలో ఖైమా వేసి నానబెట్టాలి. ఒక బౌల్ లో వెన్న తీసుకొని అందులో పెరుగు, క్రీమ్, మిరియాల పొడి, పచ్చిమిర్చి పేస్ట్ వేసి అన్నీ కలుపుకోవాలి. కలుపుకున్న మిశ్రమంలో తగినంత ఉప్పు మరియు ఖైమా వేసి కలియబెట్టుకోవాలి. ఈ విధంగా తయారు చేసుకొన్నా ఖైమా మిశ్రమాన్నితందూరి చువ్వల చుట్టూ సీక్ కబాబ్ మాదిరిగా అంటించి తండూరిలోగాని వేడినిప్పుల మీదగాని ఉడికించాలి.

English summary

5 Non Vegetarian Special Recipes for Bakrid | బక్రీద్ స్పెషల్ 5 నాన్ వెజ్ వంటలు...

Meat consumption goes up phenomenally during Dasara–Bakrid season as people consume non-vegetarian food during the festival season.
Story first published: Friday, October 26, 2012, 17:49 [IST]
Desktop Bottom Promotion