For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రంజాన్ స్పెషల్ : ఆలూ చికెన్ బిర్యానీ రిసిపి

|

చికెన్ చాలా మందికి ఇష్టమైన ఆహారం. ఆలూ, చికెన్ రెండూ ఇష్టపడే వారికి ఒక చక్కటి కాంబినేషన్ డిష్ ఇది. ఇండియన్ మసాల దినుసులతో తయారుచేసే ఈ వంట మంచి ఆరోమా వాసనతో పాటు, రుచి కలిగి ఉంటుంది. ఆలులో పూర్తి పోషఖాలు, చికెన్ లోని ప్రోటీనులు ఆరోగ్యానికి మేలు చేస్తాయి.

ఈ లీన్ మీట్ ను బరువు తగ్గాలనుకొనే వారు, డైట్ ను అనుసరించే వారి రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవచ్చు. రెడ్ మీట్ తో పోల్చితే చికెన్ లో చాలా తక్కువ క్యాలరీలుంటాయి. కాబట్టి, డైటింగ్ చేసే వారు కూడా ఈ కర్రీని నిరభ్యంతరంగా తినవచ్చు. ఈ రెండింటి కాంబినేషన్ లో బిర్యానీ తయారుచేయడం చాలా సులభం.

రంజాన్ మాసంలో ఈ కాంబినేసన్ రిసిపిలు ఎక్కువ. మీకోసం ఒక వెరైటీ ఆలూ చికెన్ బిర్యానినీ మీకు పరిచయం చేస్తున్నాము..మీరు లంచ్ కు దీన్ని త్వరగా తయారుచేసుకోవాలంటే, ప్రెజర్ కుక్కర్ లో చికెన్ మరియు బంగాళదుంపలను వేసి ఒకే సారి ఉడికించుకొని తర్వాత మసాల, పోపుదినుసులతో ఫ్రై చేసుకోవచ్చు. మరి ఈ ఆలూ చికెన్ కర్రీని ఎలా తయారుచేయాలో చూద్దాం...

chicken

కావల్సిన పదార్థాలు:
చికెన్ - 500 g
సగం ఉడికిన అన్నం - 1/2 kg
బంగాళదుంపలు - 4 to 5
దాల్చిన చెక్క - 4 to 5
యాలకలు - 4 to 5
బిర్యానీ ఆకు - 1
మిరియాలు - 5 to 6
పచ్చిమిర్చి - 8 to 10
ఉల్లిపాయలు - 2 cups
పసుపు - 1/2 teaspoon
కారం - 1 teaspoon
నిమ్మరసం - 1 teaspoon
కొత్తిమీర - 4 to 5 strands
కుంకుమపువ్వు - 1 teaspoon
నూనె: తగినంత
ఉప్పు : రుచికి సరిపడా

తయారుచేయు విధానం:
1. పాన్ లో నూనె వేసి వేడి చేయాలి. తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు కూడా వేసి బ్రౌన్ కరల్ వచ్చే వరకూ వేగించుకోవాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని ఒక పక్క తీసుకుని పక్కన పెట్టుకోవాలి.
2. తర్వత అదే పాన్ లో కొద్దిగా నూనె వేసి , సన్నగా తరిగి పెట్టుకున్న పొటాటో ముక్కలు వేసి అన్నింటినీ ఫ్రై చేసుకుని పక్కన తీసి పెట్టుకోవాలి.
3. ఇప్పుడు ఒక పెద్ద బౌల్ తీసుకుని అందులో చికెన్ ముక్కలు వేసి , ఉప్పు, పసుపు, కారం మరియు నిమ్మరసం వేసి మిక్స్ చేయాలి.
4. ఈ మొత్తం మిశ్రమాన్ని బాగా మిక్స్ చేసి 15నిముషాలు పక్కన పెట్టుకోవాలి.
5. ఇప్పుడు అందులో కొద్దిగా నూనె వేసి కాగిన తర్వాత అందులో దాల్చిన చెక్క, యాలకలు, పెప్పర్, బిర్యానీ ఆకు, పచ్చిమిర్చి రియు లవంగాలు వేసి మొత్తం మిశ్రమాన్ని వేగించుకోవాలి.
6. అదే పాన్ లో, చికెన్ మిశ్రమాన్ని వేసి , మొత్తం మిశ్రం వేగించుకోవాలి.
7. ఇప్పుడు ప్రెజర్ కుక్కర్ తీసుకుని అందులో హాఫ్ బాయిల్డ్ రైస్ ను సర్ధాలి.
8. తర్వాత రైస్ మీద చికెన్ మిశ్రమం వేయాలి.
9. చివరగా సఫ్రాన్ , ఉల్లిపాయ తరుగు వేయాలి.
10. కుక్కర్ మూత పెట్టి, 3 విజిల్స్ వచ్చే వరకూ ఉడికించుకోవాలి. . చివరగా కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేసుకోవాలి.

English summary

Aloo Chicken Biryani Recipe: A Must Try For Ramzan

Ramzan is a very auspicious month for Muslims across the world. Irrespective of the work life, they have to fast during this month, as it is believed that it will take them closer to God.
Story first published:Wednesday, June 29, 2016, 15:43 [IST]
Desktop Bottom Promotion