For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బాయిల్డ్ ఎగ్ కర్రీ రిసిపి: ఆంధ్రా స్టైల్

బాయిల్డ్ ఎగ్ కర్రీ రిసిపి: ఆంధ్రా స్టైల్

|

గుడ్డు ఆరోగ్యానికి చాల మంచిది. అది అందరికి తెలిసిన విషయమే. అందువల్లే వివిధ రకాల వంటల్లో విరివిగా ఉపయోగిస్తుంటారు. సాధారణంగా గుడ్లతో వివిధ రకాల వంటలను తయారుచేయవచ్చు. ముఖ్యంగా గుడ్డుతో తయారుచేసే వంటలను రోజులో ఎప్పుడైనా బ్రేక్ ఫాస్ట్, మీల్ , డిన్నర్ ఇలా ఎప్పుడైనా తినవచ్చు . గుడ్డును పగులగొట్టి, ఎగ్ బుర్జు, ఎగ్ ఫ్రై, ఎగ్ ఆమ్లెట్ తయారుచేసుకుంటాము. అలాగే ఉడికించిన గుడ్డుతో వివిధ రకాల వంటలను కూడా తయారుచేస్తారు.

Andhra Style Egg Curry Recipe

అందుకే వంటల్లో గుడ్డుతో తయారుచేసే వంటలు ఒక సూపర్ డిష్ గా ఉంటుంది. ఉడికించిన గుడ్లును ఫ్రై చేసి, వివిధ రకాల మాసాలా దినుసుల పేస్ట్ తో చిక్కటి గ్రేవి తయారుచేసి అందులో గుడ్లను జోడించి తయారుచేసి ఈ ఎగ్ మసాల కర్రీ చాలా టేస్ట్ గా నోరూరిస్తుంటుంది. మరి దీన్ని ఎలా తయారుచేయాలో ఈ క్రింది వీడియో ద్వారా చూద్దాం...


కావల్సిన పదార్థాలు:
ఉడికించిన గుడ్లు: 8
టమోటో: 3(చిన్న ముక్కలుగా తరిగిపెట్టుకోవాలి)
ఉల్లిపాయలు: 2(సన్నగా తరిగిపెట్టుకోవాలి)
చింతపండుగుజ్జు: 1/2cup
పచ్చిమిర్చి: 4(సన్నగా కట్ చేసుకోవాలి)
వెల్లుల్లి రెబ్బలు: 6-8
అల్లం, వెల్లుల్లిపేస్ట్: 1tsp
కారం: 1tbsp
ధనియాల పొడి: 2tsp
పసుపు: 1/4tsp
ఉప్పు: రుచికి సరిపడా
నీళ్లు: 1cup
పోపుకోసం :
నూనె: తగినంత
ఆవాలు: 1tsp
జీరకర్ర: 1tsp
ఉద్దిపప్పు: 1tbsp
కరివేపాకు : రెండు రెమ్మలు
తయారుచేయు విధానం:

1. ముందుగా పాన్ స్టౌ మీద పెట్టి అందులో మూడు టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడయ్యాక అందులో ఒక టీస్పూన్ ఉద్దిపప్పు, ఆవాలు, జీకర్ర, ఉద్దిపప్పు వేసి ఒక నిముషం వేగించుకోవాలి.
2. తర్వాత అందులోనే సన్నగా తరిగి పెట్టుకొన్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి , కరివేపాకు వేసి, వెల్లుల్లి వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకూ వేగించుకోవాలి.
3. తర్వాత అందులోనే 2tsp అల్లం, వెల్లుల్లిపేస్ట్ వేసి ఒక నిముషం వేగిన తర్వాత, సన్నగా తరిగిపెట్టుకొన్న టమోటో ముక్కలు కూడా వేసి మెత్తబడేవారకూ మీడియం మంట మీద వేగించుకోవాలి.
4. టమోటో ముక్కలు వేగుతున్నప్పడే, అందులో పసుపు, కారం, ఉప్పు, ధనియాల పొడి వేసి బాగా మిక్స్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి.
5. తర్వాత అందులోనే చింతపండుగుజ్జు పోసి, అవసరం అనిపిస్తే అరకప్పు నీళ్ళు కూడా పోసి, ఉడికించుకోవాలి.
6. అంతలోపు, ఉడికించి పెట్టుకొన్న కోడి గుడ్డు ఒక్కోదాన్ని తీసుకొన్ని కత్తితో సన్నగా గాట్లు పెట్టుకోవాలి.
7. గ్రేవీ చిక్కగా ఉడుకుతున్నప్పుడు అందులో గుడ్లను వేసి మూత పెట్టి 5-10నిముషాలు ఉడికించుకోవాలి. అంతే ఆంధ్ర స్టైల్ ఎగ్ కర్రీ రెడీ.
8. చివరగా సర్వింగ్ బౌల్లోనికి మార్చుకొని గ్రేవీ మీద సన్నగా తరిగిన కొత్తిమీర తరుగు వేసి గార్నిష్ చేయాలి. అంతే ఆంధ్రా స్టైల్ ఎగ్ కర్రీ రెడీ.

English summary

Andhra Style Egg Curry Recipe

Today we have a special Andhra style egg curry which is locally known as kodi guddu pulusu. This recipe is quick and simple. It is a perfect option for those who are working or stay alone. The main ingredient in this recipe is the tamarind pulp which gives this egg curry recipe the tangy kick. Apart from that the spices make this recipe a complete hit.
Desktop Bottom Promotion