For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆంధ్రా స్టైల్ ఫిష్ కుర్మా రిసిపి : క్రిస్మస్ స్పెషల్

|

మాంసాహారులైయుండి, చేపలు తినని వారు ఉంటారు. అయితే చేపలు తినడ ఇష్టమే అయితే వాటి వాసన, సరిగా వండటం చేత కాకనో చేప వంటకాలకు దూరంగా ఉంటారు. చేపలంటే చాలా మందికి ఇష్టం. చేపలను తినడం వల్ల ఆరోగ్యమే కాదు, అందం కూడా. నునుపైన చర్మ సౌందర్యం మీ సొంత అవుతుంది. తీరప్రాంతాల్లో నివసించే వారిని గమనించినట్లైతే వారి చర్మ మిళమిళ మెరుస్తుంటుంది. చేపల్లో ఒమేగా 3ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉండటం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది.

అద్భుతమైన ఫిష్ వెరైటీ వంటకాల్లో ఫిఫ్ కుర్మా కూడా ఒకటి. ఈ ఫిష్ కుర్మా ప్లెయిన్ రైస్ సూపర్బ్ గా ఉంటుంది. ఈ ఫిష్ వంటకాన్ని వండటానికి ఎక్కువ మసాలాలు అవసరం లేదు. అతి తక్కువ పదార్థాలను ఉపయోగించి, తక్కువ సమయంలో సులభంగా చేసుకొనే టేస్టీ ఫిష్ కుర్మా రెడీ. ఈ ఫిష్ కర్మాను ఏప్పుడైనా, ఏ సందర్భంలోనైనా వండుకోవచ్చు. ఈ రుచికరమైన వంటకం ఫ్యామిలీ మెంబర్స్ కు, అతిథులకు అందించడమే కాకుండా ఫిష్ లవర్స్ నుండి ప్రసంశలను పొందవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం ఈ క్రిస్మస్ సెలబ్రేషన్స్ లో భాగంగా మీరు కూడా ఒక్కసారి టేస్ట్ చూసేయండి...

Andhra Style Fish Korma Recipe : Chritmas Special

కావలసిన పదార్థాలు:
చేప ముక్కలు :1/2kg(కొరమీను లేదా రహు ఫిష్)
ఉల్లిపాయలు : 2(ముక్కలుగా కట్ చేసుకోవాలి)
టమాటాలు : 2 (ముక్కలుగా కట్ చేసుకోవాలి)
పచ్చిమిరపకాయలు : 4 (ముక్కలుగా కట్ చేసుకోవాలి)
కరివేపాకు : 2 రెమ్మలు
కొత్తిమిర : 1/4cup(తరిగినది)
పసుపు : 1/4 tsp

స్పైసీ కోరియాండర్ ఫిష్ : సీఫుడ్ స్పెషల్

కారంపొడి : 1tbsp
కొబ్బరి పొడి : 2tbsp
గసగసాలు : 1tbsp
జీలకర్ర పొడి :1tsp
మెంతిపొడి : ¼tsp
అల్లంవెల్లుల్లి పేస్ట్ : 2 tbsp
గరం మసాలా పొడి: 1tbsp
నూనె : సరిపడా
ఉప్పు రుచికి తగినంత

ఆంధ్రా స్టైల్ ఫిష్ ఫ్రై రుచి అమోఘం..

తయారీ చేయు విధానం :
1. ఈ ఫిష్ కుర్మా కోసం కొరమీను బదులు రహు చేపలు తీసుకుంటే కుర్మాకు బాగుంటుంది.
2. చేప ముక్కలను కడిగి నిమ్మరసం వేసి కలిపి పెట్టాలి. దీనివలన నీసు వాసన తగ్గుతుంది.
3. తర్వాత వెడల్పాటి పాన్ స్టై మీద పెట్టి అందులో గిన్నెలో నూనె వేడి చేసి సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి బ్రౌన్ కలర్లోకి మారే వరకూ వేయించాలి.
4. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, పసుపు , కారం వేసి కొద్దిసేపు వేయించాలి.

అలెప్పే ఫిష్ కర్రీ రిసిపి: కేరళ స్టైల్ ఫిష్ కర్రీ

5. పోపు వేగే లోపు గసగసాలు,జీలకర్ర, మెంతులు కొద్దిగా వేయించి పొడి చేసుకోవాలి.
6. ఉల్లిపాయలలో సన్నగా తరిగిన టమాటాలు , నిలువుగా చీల్చిన పచ్చిమిరపకాయలు, కొబ్బరిపొడి, గసగసాలు,జీలకర్ర, మెంతిపొడి వేసి సన్నని మంట మీద వేయించాలి.
7. ఇప్పుడు చేప ముక్కలు వేసి రెండు నిమిషాలు వేయించి రెండు కప్పుల నీరు ,తగినంత ఉప్పు వేసి జాగ్రత్తగా కలిపి మూత పెట్టాలి.
8. మొత్తం మిశ్రమాన్ని నిదానంగా నూనె తేలేవరకు ఉడికించి గరం మసాలా,కొత్తిమిర కలిపి దింపేయాలి. చేప ముక్కలు ఉడకడానికి ఎక్కువ సమయం పట్టదు. నిదానంగా మసాలాలలో ఉడకనిస్తే ముక్కలకు మసాలా బాగా పట్టుకుంటుంది. అంతే ఫిష్ కుర్మా రెడీ...

English summary

Andhra Style Fish Korma Recipe : Chritmas Special

Fish curry can be prepared using many ingredients. Have you tried fish curry with coconut? In the Southern states of India, many recipes are prepared using coconut as one of the chief ingredients. Grated coconut or coconut milk adds a sweet flavour to the curry.
Story first published: Monday, December 21, 2015, 17:15 [IST]
Desktop Bottom Promotion