For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

స్పైసీగా నోరూరించే బగరా అండా కర్రీ

|

గుడ్డుతో చేసే ఆహారాలు చాలా అద్బుతంగా ఉంటాయి. రుచి మాత్రమే కాదు, ఆరోగ్యం కూడా. గుడ్లతో వివిధ రకాల వెరైటీలను తయారు చేస్తారు. ఎగ్గటేరియన్స్ కు ఎగ్ కర్రీ చాలా ఫేవరెట్ డిష్. ఎగ్ కర్రీని ఇండియాలో వివిధ రకాలుగా తయారు చేస్తారు. అయితే అన్ని ఒకే రుచిని కలిగి ఉంటాయి.

హైదరాబాద్ రాయల్ సిటీలో బగర ఎగ్ మసాలా అనేది స్పెషల్ ఎగ్ రిసిపి. ఈ రిసిపిని ‘బగరా బైగన్'ని ఆధారంగా చేసుకొని తయారు చేయబడింది. మరి సాధారణ ఎగ్ కర్రీకి..బగరా ఎగ్ మసాలాకు మద్య టేస్ట్ ఎంత తేడానో ఒక సారి మనం కూడా తయారు చేసి చూద్దామా...

Bagara Anda Curry : Spicy And Mouthwatering Recipe

కావాల్సినపదార్థాలు:
గుడ్లు-నాలుగు
నువ్వులు-25 గ్రా
వేరుసెనగ పప్పు- 25 గ్రా
ధనియాల పొడి- 1టీ స్పూన్
కొబ్బరి-30 గ్రా
చింత పండు-30 గ్రా
కరివేపాకు- 4రెబ్బలు
కారం- 10గ్రా
ఆవాలు-చిటికెడు
ఎండుమిర్చి-మూడు
మెంతులు-చిటికెడు
ఉప్పు-తగినంత
నూనె- 60 గ్రా

తయారు చేసే విధానం:
1) ముందుగా గుడ్లను పావు గంట సేపు ఉడికించి,దించి పెంకు ఒలిచి చాకుతో గాట్లు పెట్టండి.
2)తర్వాత ఒక గిన్నెలో నూనె పోసి కాచాక -ఆవాలు,మెంతులు,ఎండుమిర్చి,కరివేపాకుతో తాలింపు పెట్టండి.
3 )ఆ తరువాత నువ్వులు,వేరుసెనగపప్పు,కొబ్బరి,వేయించి మెత్త గా నూరి మసాలా ముద్దను తయారు చేయండి.
4)ఇప్పుడు ఈ మసాలాను తాలింపు లో వేసి,కొంచెం సేపు వేయించండి.నూనె ఆ ముద్ద నుండి విడిపోతున్నప్పుడు కారం,పసుపు వేసి కలిపాక-చింత పండు పులుసు పోసి ఉడికించండి.తరువాత తగినంత ఉప్పు కలిపి గ్రేవీలా తయారయ్యాక ఉడకబెట్టిన గుడ్లను వేసి ,కాసేపు ఉడికిస్తే బగారా అండా కర్రీ రెడీ.... ఇది రైస్ తో వడ్డిస్తే బావుంటుంది.

English summary

Bagara Anda Curry : Spicy And Mouthwatering Recipe

There are innumerable ways of cooking eggs right from a simple boiled egg or bull's eye to a stuffed egg curry.Bagara Anda Masala requires the famous Indian 'Bagara masala' which is a type of Indian curry where the key flavours are coconut, tamarind, peanuts and sesame seeds
Story first published: Tuesday, April 22, 2014, 18:26 [IST]
Desktop Bottom Promotion