For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బక్రీద్ కోసం స్పెషల్ నాన్ వెజ్ వంటలు

|

ముస్లింలు జరుపుకునే ముఖ్యమైన పండుగల్లో రంజాన్ పండుగ మైదటిదైతే..బక్రీద్ రెండవదిగా నిలిచింది. ముస్లింలు బక్రీద్‌ను ఖుర్భాని పండుగ అని కూడా అంటారు. బక్రీద్ పండుగ రోజు ముస్లిం పవిత్ర స్థలమైన మక్కాలో హజ్ యాత్ర జరుగుతుంది. ముస్లిం సోదరులు జరుపుకునే ముఖ్యమైన పండుగల్లో రంజాన్ పండుగ మైదటిదైతే..బక్రీద్ రెండవదిగా నిలిచింది. ఈద్‌గాలో నమాజు ముగుస్తుంది. అందరినీ చల్లగా చూడమని కోరే దువా ముగుస్తుంది. ఆ తర్వాత ఈద్ ముబారక్ చెప్పుకునే అలాయి బలాయి ముగుస్తుంది.

ఆ తర్వాత..? ఇంకేముంది... విందులూ వినోదాలే. స్నేహితులు, బంధువులు, ఆత్మీయులు, అయినవాళ్లు... అందరూ కలిసి దావత్‌లో కూచుంటారు. మతాలు మర్చిపోయే క్షణాల్లో అందరూ ఆత్మీయులైపోతారు. మటన్, చికెన్, రోటీ, సేమ్యా... ఘుమఘుమలాడే పదార్థాల మధ్య మాటలు నంజుకుంటారు. నవ్వులు పంచుకుంటారు. పండుగలు ఉండాలి. ఒకరి పండుగలో మరొకరి లోగిలి కళకళలాడాలి. ఆ బహార్ కోసమే ఈ వంటలు...

చికెన్ కబాబ్:

చికెన్ కబాబ్:

ఈ అద్భుతమైన రుచి కలిగిన చికెన్ కబాబ్ ను బక్రీద్ స్పెషల్ గా వండుకు తింటారు. ఈ చికెన్ కబాబ్ అంటే చిన్న, పెద్దా తేడా లేకుండా అందరికీ ఇష్టమైనది. ముస్లీంలు తయారుచేసుకొనే వంటకాల్లో చాలా సులభంగా మరియు సాధారణంగా తయారుచేసుకొనే స్పెషల్ వంట ఇది. ఉపవాస వేళలో కూడా దీన్ని తయారుచేసుకొని తిని టేస్ట్ ను ఎంజాయ్ చేస్తుంటారు.

చికెన్ బిర్యానీ:

చికెన్ బిర్యానీ:

ముస్లీమ్ ల ఫేవర్ డిష్ చికెన్ బిర్యానీ. బక్రీద్ రోజున తయారు చేసే ఈ చికెన్ బిర్యానీకి అనేక రకాల ఇండియన్ మసాలాలు ఉపయోగించి తయారుచేసుకుంటారు.

మటన్ బిర్యానీ:

మటన్ బిర్యానీ:

బక్రీద్ ను ఎంజాయ్ చేయడానికి మరో అద్భుతమైన రుచికరమైన వంట మటన్ బిర్యానీ. ఈ పండుగకు ప్రత్యేకమైన రుచి కలిగిన వంటకం ఇది. ఈ మటన్ బిర్యాని చాలా డెలిషియస్ గా ఉంటుంది.

మటన్ కర్రీ:

మటన్ కర్రీ:

ముస్లీం పండుగల్లో మరో ముఖ్యమైన వంట, బాగా ప్రాచుర్యం పొందిన వంట మటన్ కర్రీ. ఇది టమోటో సాస్ తో తయారుచేసిన చిక్కటి గ్రేవీలా ఉంటుంది. మటన్ గ్రేవీ చాలా చిక్కగా ఉండటంతో నోరూరిస్తూ టేస్టీగా ఉంటుంది. దీన్ని రోటీ లేదా బిర్యానీతో తినవచ్చు.

మటన్ ఫ్రై:

మటన్ ఫ్రై:

చాలా టేస్టీ డిష్ ఇది. బిర్యానీ ఆకు, మరియు యాలకులతో మాత్రమే తయారుచేస్తారు. మటన్ ఫ్రై ముస్లీంలకు చాలా ప్రీతికరమైన వంట. ఈ బక్రీద్ పండుగ సందర్భంగా, ఈ టేస్టీ డిష్ బిర్యానీకి బెస్ట్ కాంబినేషన్.

మటన్ కీమా:

మటన్ కీమా:

బక్రీద్ కు ప్రత్యేకంగా తయారుచేసుకోగల మరో వంటకం, మటన్ కీమా. అయితే ఈ కీమా తయారుచేయడంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వాటర్ పూర్తిగా ఇమిరిపోకుండా అలానీ ఫుల్ డ్రై లేదా ఫుల్ గ్రేవీగా కాకుండా తయారుచేసుకోవాలి .

షమ్మీ కబాబ్:

షమ్మీ కబాబ్:

బక్రీద్ పండుగను మరింత సంతోషకరంగా జరుపుకోవడానికి, అథితులకు ఆతిథ్యం ఇవ్వడానికి ఇది ఒక స్పెషల్ డిష్. షమ్మీ కబాబ్ చాలా పాపులర్ అయినటువంటి వంటకం.

ఫిష్ కబాబ్:

ఫిష్ కబాబ్:

ముస్లీమ్ ఫెస్టివల్ కు చాలా అరదుగా తయారు చేస్తుంటారు, ఈ ఫిష్ కబాబ్. ఫిష్ కబాబ్ నూనెలో డీప్ ఫ్రై చేసి రోటీ లేదా వీట్ బ్రెడ్ తో తింటుంటారు.

చికెన్ టిక్కా:

చికెన్ టిక్కా:

చికెన్ టిక్కా ఒక బెస్ట్ రిసిపి. బక్రీద్ ను మరింత ఉత్సాహాంగా సెలబ్రెట్ చేసుకొని, కొత్త రుచులతో ఎంజాయ్ చేయాలంటే ఈ చికెన్ టిక్కా ఘుమఘుమలాడాల్సిందే..

మటన్ కబాబ్:

మటన్ కబాబ్:

ముస్లీంలకు అత్యంత ప్రీతికరమైన మరో వంటకం మటన్ కబాబ్. మటన్, మసాలా దినుసులను మెత్తగా గ్రైండ్ చేసి తయారుచేసుకుంటారు. టేస్ట్ కూడా అద్భుతంగా ఉంటుంది.

English summary

Bakrid Recipes To Mark The Festival

Bakrid is a special festival which is celebrated among Muslims from around the world. It is a festival which enthrones some of them who fast for their own desires and then feast to a meal beyond comparison.
Story first published: Wednesday, October 16, 2013, 15:31 [IST]
Desktop Bottom Promotion