For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వీకెండ్ స్పెషల్-చెట్టినాడ్ ప్రాన్స్ కర్రీ: తమిళ్ ట్రీట్

|

వారంతంలో ఏదైనా కొత్త రుచి చేసుకొనే తినందే ఎక్సైట్మెంట్ ఉండదు. అందుకే ఈ వారంతం మీకు ఒక స్పెషల్ వంటను పరిచయం చేస్తోంది. అదే చెట్టినాడ్ స్టైల్ ప్రాన్స్ కర్రీ. చెట్టినాడ్ వంటలు మన సౌత్ ఇండియాలో చాలా ప్రసిద్ది. ముఖ్యంగా తమిళనాడు స్టేట్ లో చెట్టినాడ్ ప్రాంతంలో తయారుచేసే ఈ వంటలు చాలా వెరైటీగా, మంచి ఆరోమా వాసన కలిగి అద్భుత రుచిని కలిగి ఉంటాయి.

ఇతర ప్రాన్ కర్రీలతో పోల్చితే, చెట్టినాడ్ ప్రాన్ కర్రీ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఈ రుచికి ప్రధాన కారణం, ఒక ప్రత్యేమైన మసాలా దినుసులను ఈ వంటకు ఉపయోగించడం వల్ల ఇంతటి అద్భుత టేస్ట్ వస్తుంది. మరి మీరు కూడా ఈ చెట్టినాడ్ ప్రాన్స్ రుచి చూడాలంటే.. ఈ వెరైటీ కర్రీనీ మీరు ప్రయత్నించాల్సిందే....

Chettinad Prawns Curry : Tamil Teat

కావలసిన పదార్థాలు:
రొయ్యలు : 400grms
ధనియాల పొడి: 1tbsp
జీలకర్ర పొడి : 1tsp
మిరియాల పొడి : 1tsp
స్టార్ అనైజ్ (మార్కెట్లో లభిస్తుంది) : 25 grm
కల్పసి (మార్కెట్లో లబిస్తుంది) : 1tsp
మరాఠీమొగ్గ్గ (మార్కెట్లో లభిస్తుంది) : 1 లేదా 2
జాజికాయ : 1 (పొడి చేయాలి)
ఏలకులు : 2 (పొడి చేయాలి)
దాల్చిన చెక్క : చిన్న ముక్క (పొడి చేయాలి)
లవంగాలు : 3 (పొడి చేయాలి)
సోంపు (వేయించి పొడి చేయాలి) : 1/2tps
హంగ్ కర్డ్ (ఒక పలుచని వస్త్రంలో పెరుగు వేసి, వడకట్టి, నీరు తీసేసినది) : 2tbsp
నిమ్మకాయ : 1
పసుపు : చిటికెడు
మస్టర్డ్ ఆయిల్: 1tsp
అల్లంవెల్లుల్లి పేస్ట్ : 1tbsp
కొబ్బరి తురుము : 1/2cup
పచ్చిమిర్చి: 4-5
టమోటో: 1
ఉల్లిపాయ: 1
ఉప్పు : రుచికి తగినంత

తయారు చేయు విధానం:
1. ముందుగా ఒక వెడల్పాటి గిన్నెలో శుభ్రపరిచిన రొయ్యలను వేసి, అల్లం వెల్లుల్లిపేస్ట్, నిమ్మరసం వేసి, కలిపి, కొద్దిసేపు మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలి.
2. అంతలోపు మిక్సీ గిన్నెలో ధనియాల పొడి, జీలకర్ర, మిరియాల పొడి, స్టార్ అనైజ్, కల్పసి,మరాఠీమొగ్గ, జాజికాయ పొడి, బిర్యానీ ఆకు, ఏలకుల పొడి, దాల్చిన చెక్క పొడి చేయాలి. సోంపు పొడి అన్నీ వేసి మెత్తగా పేస్ట్ లా తయారుచేసి పక్కన తీసి పెట్టుకోవాలి.
3. ఇప్పుడు అదే జార్ లో కొబ్బరి తురుము, పచ్చిమిర్చి కూడా వేసి, మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకోవాలి.
4. తర్వాత స్టౌ మీద ఒక డీప్ బాటమ్ పాన్ పెట్టి అందులో, నూనె వేసి వేడయ్యా అందులో ఉల్లిపాయ ముక్కలు వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకూ వేగించాలి.
5. ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత అందులో అల్లం వెల్లుల్లిపేస్ట్, టమోటో ముక్కలు కూడా వేసి, మెత్తగా అయ్యే వరకూ వేగించుకోవాలి.
6. ఇప్పుడు అందులోనే చెట్టినాడు మసాలా ముద్దను కూడా వేసి బాగా ఫ్రై చేయాలి. ఐదునిముషాల తర్వాత కొబ్బరి పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. మసాలా మిశ్రం బాగా వేగిన తర్వాత అందులో ఒక కప్పు నీళ్ళు పోసి మసాలా బాగా ఉడకనివ్వాలి.
7. మసాలా మెత్తం బాగా ఉడికిన తర్వాత అందులో ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకొన్న ప్రాన్స్ వేసి మీడియం మంట మీద 5నుండి 10నిముషాల ఉడికించి దింపేసుకోవాలి.అంతే చెట్టినాడ్ ప్రాన్ మసాలా కర్రీ రెడీ.

English summary

Chettinad Prawns Curry : Tamil Teat

Weekends are boring without the excitement of cooking a new dish. So, Boldsky brings you this special Chettinad recipe to spice up your weekend. This prawn recipe hailing from Tamil Nadu is called Chettinad prawns. There are many varieties of Indian seafood recipes. Every coastal curry does not taste the same. Chettinad prawn curry is thus very different from any other prawn curry hailing from the coasts of India like Prawn Gussi (Goa) or Malai Curry (Bengal).
Story first published: Saturday, December 7, 2013, 10:12 [IST]
Desktop Bottom Promotion