For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చికెన్ దాల్ రిసిపి చపాతీ మరియు రైస్ కు బెస్ట్ కాంబినేషన్

|

మీరు చికెన్ ప్రియులా? మీరు రకరకాల వంటలను వండుకుని రుచి చూశారా? మీరు చాలా వెరైటీగా రుచి చూశారా? అర్థం కాలేదా? నా ఉద్దేశ్యం మీరు ఎప్పుడైనా దాల్ చికెన్ రుచి చూశారా? ఈ సారి మీరు చికెన్ కొన్నప్పుడు, దానితో చికెన్ దాల్ తయారు చేసి రుచి చూడండి. ఈ చికెన్ దాల్ చపాతీ, పుల్కా, రైస్ మొదలైన వాటితో పాటు తింటే అద్భుతంగా ఉంటుంది. అంతే కాదు, దీన్ని తయారుచేయడం కూడా సులభం.

చికెన్ పప్పు ఎలా చేయాలో తెలుసుకోవాలనుకుంటున్నారా? దాల్ చికెన్ రిసిపి సాధారణ వంటకం క్రింద ఉంది. దీన్ని చదివి, రుచి ఎలా ఉందో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి.


అవసరమైనవి:

* చికెన్ - 250 గ్రా

* పచ్చిమిర్చి - 2 (పొడవుగా తరిగినవి)

* కరివేపాకు - కొద్దిగా

* టమోటో - 1 (తరిగినది)

* పసుపు పొడి - 1 టేబుల్ స్పూన్

* ఉప్పు - రుచికి సరిపడా

* పప్పు - 1/2 కప్పు

* నీరు - 2-3 టేబుల్ స్పూన్లు

* కొత్తిమీర - కొద్దిగా


పోపుకి ...

* నెయ్యి - 1 టేబుల్ స్పూన్

* జీలకర్ర - 1 టేబుల్ స్పూన్

* ఉల్లిపాయ - 1 (సన్నగా తరిగి పెట్టుకోవాలి)

* అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 టేబుల్ స్పూన్

రెసిపీ:

* ముందుగా పప్పుని బాగా కడిగి నీళ్లలో 30 నిమిషాలు నానబెట్టాలి.

* తర్వాత ఒక గిన్నెలో చికెన్ కడగాలి.

* తర్వాత స్టౌ మీద ఒక పాన్ పెట్టి అందులో పచ్చిమిర్చి, టమాటా, కరివేపాకు, ఉప్పు, పసుపు, వేసి వేగించి ఆ తర్వాత అందులో కడిగి నానబెట్టుకున్న నీళ్లు పోసి మరిగించాలి.

* నీరు బాగా ఉడకడం ప్రారంభించిన తర్వాత, మంటను కనిష్టంగా తగ్గించి 25 నిమిషాలు ఉడకబెట్టండి.

* తర్వాత అందులో కడిగి పెట్టుకున్న చికెన్ ముక్కలు వేసి మళ్లీ 15 నిమిషాలు ఉడకనివ్వాలి. చికెన్ బాగా ఉడికిన తర్వాత పొయ్యి మీద నుంచి దించాలి.

* తర్వాత స్టౌ మీద చిన్న ఫ్రైయింగ్ పాన్ పెట్టి అందులో నెయ్యి పోసి వేడయ్యాక జీలకర్ర, కరివేపాకు, ఉల్లిపాయముక్కలు వేసి బంగారు రంగు వచ్చేవరకు వేయించి, అల్లం వెల్లుల్లి ముద్ద వేసి పచ్చివాసన పోయే వరకు వేయించాలి.

* తర్వాత తరిగిన కొత్తిమీర వేసి ముందుగా ఉడికించి పెట్టుకున్న చికెన్ దాల్ వేసి మొత్తం మిశ్రం కలపాలు. అంతే దాల్ చికెన్ రెడీ.

Image courtesy: yummytummyarthi

English summary

Chicken dal recipe in telugu

Want to know how to make a chicken dal recipe at home? Take a look and give it a try..
Desktop Bottom Promotion