For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

స్పైసీ అండ్ టేస్టీ చికెన్‌ గారెలు: వీకెండ్ స్పెషల్

|

సాధారణంగా చికెన్ తో తయారుచేసే వంటలంటే చాలా మందికి ఇష్టం. ముఖ్యంగా చికెన్ తో తయారుచేసే వెరైటీ డిష్ లంటే మరింత ఇష్టంగా తింటారు. ఈ మద్యకాలంలో ఫాస్ట్ ఫుడ్స్ బాగా ఫేమస్ అయ్యాయి.

చికెన్ పులుసు, గారెలు శీతాకాలంలో తగిన శక్తినీ, శరీరానికి వేడినీ ఇస్తాయి. మాంసంలోని ప్రోటీన్ లు విలువైనవి. మినపప్పులోని ఫైబర్(పీచు)ఎక్కువగా ఉంటుంది. కాబట్టి, చికెన్ తో కలిపి తినడం వల్ల జీర్ణక్రియకు చాలా మంచిది.

READ MORE: చిల్లీ చికెన్ బిట్స్ : వింటర్ స్పెషల్

చికెన్ అంటే ఎక్కువ ఇష్టం ఉన్నవారు. ఇలాంటి సింపుల్ వంటలను తయారుచేసుకోవచ్చు. దీన్ని తయారుచేయడం కూడా చాలా సులభం మరియు చాలా తక్కువ పదార్థాలతో దీన్ని తయారుచేస్తారు. మరి ఈ సింపుల్ అండే టేస్టీ చికెన్ గారెలను ఎలా తయారుచేయాలో చూద్దాం...

Chicken Garelu: Weekend Special : Telugu Vantalu

కావలసిన పదార్థాలు:
బోన్‌లెస్‌ చికెన్‌ - 1/2kg
శనగపప్పు - 3cups
గరం మాసాలా - 2 tsp
కారం - 2 tsp
అల్లం వెల్లుల్లి పేస్ట్‌ - 2tbsp
పచ్చిమిరిపకాయలు - 4(సన్నగా తరిగిపెట్టుకోవాలి)
ఉల్లిపాయలు - 3(సన్నగా తరిగిపెట్టుకోవాలి)
పసుపు - 1/4tsp
కొత్తిమీర కట్ట - 1(సన్నగా తరిగిపెట్టుకోవాలి)
నూనె: డీఫ్ ఫ్రై చేయడానికి సరిపడా
ఉప్పు - రుచికి సరిపడా

READ MORE: రెడ్ చిల్లీ చికెన్ ఫ్రైడ్ రైస్: నాన్ వెజ్ స్పెషల్

తయారు చేయు విధానం:

1. ఒక గిన్నెలో శనగపప్పు వేసి నీళ్లలో నానబెట్టుకోవాలి.
2. తర్వాత చికెన్‌ ముక్కలు శుభ్రంగా కడిగి కారం, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్‌, పసుపు, ఉప్పు వేసి తగినన్ని నీళ్లు పోసి ఉడికించుకోవాలి.
3. ఇప్పుడు ముందుగా నానబెట్టిన శనగపప్పును మెత్తగా రుబ్బుకోవాలి.
4. తర్వాత పేస్ట్ చేసుకొన్న శెనగపప్పు ముద్దలో ఉల్లిముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, ఉడికించిన చికెన్‌, మసాలా, కొద్దిగా ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి.
5. ఇప్పడు పాన్ స్టై మీద పెట్టి నూనె సోపి వేడి అయ్యాక అందులో కొద్దిగా చికెన్‌ ముద్దను అరచేతిలో తీసుకుని మధ్యలో రంధ్రం చేసి నూనెలో వేయించాలి.అంతే చికెన్ గారెలు రెడీ.

Story first published: Saturday, August 8, 2015, 14:20 [IST]
Desktop Bottom Promotion