For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చికెన్ లాలీపాప్

|

Chicken Lollipops
కావల్సినవి:
చికెన్ రెక్కలు: 8
ఎండుమిరప: 4
అల్లం వెల్లుల్లి: 1 tsp
గరం మసాలా: 1/2 tsp
కోడి గుడ్డు సొన: 2 tsp
సెనగపిండి: 2 tsp
ఉప్పు: రుచికి సరిపడా
నిమ్మరసం: 1 tsp
ఆరెంజ్ కలర్: చిటికెడు
ఆయిల్: వెయించడానికి సరిపడా

తయారు చేయు విధానము:
1. ముందుగా ఒక చికెన్ రెక్కను తీసుకుని దాన్ని వెనక్కి తిప్పి జాయింట్ మద్య లో విరవండి. ఇలా చేయడం వల్ల, రెండు ఎముకల చివర్లు బయటకు వస్తాయి. వాటిలో నుండి సన్నటి ఎముకల్ని బయటకు లాగి ప్రక్కకు తీసేయాలి. చివరగా ఒక్క పెద్ద ఎముక మాత్రమే మిగులుతుంది. దాన్ని పట్టి వున్న మాంసాన్ని ముద్దలా చేసి ఎముక చివరకు చేర్చాలి. ఇలానే మిగిలిన చికెన్ రెక్కల్ని లాలీపాప్ ల మాదిరిగానే సిద్దం చేసుకోవాలి.
2. కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, కోడిగ్రుడ్డు సొన, సెనగపిండి, ఆరెంజ్ కలర్, నిమ్మరసం, ఉప్పు అన్నింటిని బాగా కలిపి ఈ మిశ్రమాన్ని ఎముకలను పట్టిన మాంసానికి పట్టించి అరగంట సేపు ఉంచండి.
3. పాన్ లో ఆయిల్ వేసి బాగా కాగాక అందులో వీటిని వేసి ఎర్రగా వేయించండి. తయారైన చికెన్ లాలిపాప్ లను అతిధులకు వేడి వేడి స్నాక్స్ గా అందించండి.

Story first published:Thursday, March 11, 2010, 14:01 [IST]
Desktop Bottom Promotion