For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చికెన్ రిజాలా - ఒక నవాబ్ ట్రీట్

|

చికెన్ రిజాలా..ఇది కలకత్తాలో వండుకునే ఒక స్పెషల్ చికెన్ రిసిపి. ఈ రాయల్ డిష్ చాలా సింపుల్ మ్యాజికల్ ఎందుకంటే అద్భుతమైన సువాసన, ఆకారం, నోరూరించే రుచి..చూడగానే తినేయాలనే కోరిక ఇవన్ని కలగలిస్తే మ్యాజిక్.

చికెన్ రియాస్ ఓ అద్భుతమైన ఫ్లేవర్ తో రుచిగా ఉంటుంది. చికెన్ ను జీడిపప్పు గ్రేవిలో ఉడికించి తయారు చేస్తారు. ఇంకా ఇందులో సువాసనలిచ్చే మసాలా దినుసుల ఉపయోగిస్తారు. కొద్దిగా పంచదార వేయడం వల్ల ఒక అద్భుతమైన స్వీట్ టేస్ట్..మరియు పెరుగులో మ్యారినేట్ చేయడం వల్ల కొద్దిగా స్వీట్ తో పాటు చిరు పుల్లగా నోరూరిస్తుంటుంది. మరి మీరూ స్పెషల్ డిష్ టేస్ట్ చేయాలనుకుంటున్నట్లైతే ఒకసారి ప్రత్నించి నవాబ్ వంటకాన్ని రుచి చూడండి...

Chicken Rezala

కావల్సిన పదార్థాలు:

చికెన్ : 1kg(మీడియం సైజ్ లోనికి కట్ చేసుకోవాలి)
పెరుగు: 1/2cup
గసగసాల పేస్ట్: 2tsp
జీడిపప్పు పేస్ట్: 3tbsp
ఉల్లిపాయలు: 2(మీడియం సైజ్)
బిర్యాని ఆకు: 2
కేవరా వాటర్: 4tsp
తెల్ల మిరియాలు: 10-12(రఫ్ గా దంచుకోవాలి)
ఎండు మిర్చి: 3-4
అల్లం వెల్లుల్లి పేస్ట్: 2tbsp
పంచదార: tsp
లవంగాలు: 4
యాలకులు: 3
కుంకుమపువ్వు: కొద్దిగా
ఫ్రెష్ క్రీమ్: 3tbsp
నెయ్యి: 2tbsp
ఉప్పు: రుచికి సరిపడా
నీళ్ళు: 2cups
వేయించిన బాదాం: కొద్దిగా (గార్నిషింగ్ కు)

తయారు చేయు విధానం:
1. ముందుగా చికెన్ ముక్కలను శుభ్రంగా కడగాలి. చికెన్ ముక్కలను పెరుగు, క్రీమ్, తెల్లమిరియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా మిక్స్( మ్యారినేట్) చేసి ఒక గంట పాటు పక్కన పెట్టుకోవాలి.
2. తర్వాత ఉల్లిపాయ పొట్టుతీసి ఒక గిన్నెలో అరకప్పు నీళ్ళు పోసి ఐదునిముషాల పాటు ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి.
3. తర్వాత పాన్ లో నెయ్యి వేసి వేడి చేసి అందులో లవంగాలు, యాలకులు, బిర్యాని ఆకు, ఎండు మిర్చి వేసి రెండు నిముషఆలు మీడియం మంట మీద వేగించుకోవాలి.
4. ఇప్పుడు గ్రైండ్ చేసుకొన్న ఉల్లిపాయ పేస్ట్ కూడా వేసి మరో రెండు నిముషాల ఫ్రై చేసుకోవాలి. తర్వాత అందులోనే పంచదార, ఉప్పు, జీడిపప్పు పేస్ట్ వేసి మరో మూడు నాలుగు నిముషాలు ఫ్రై చేసుకోవాలి.
5. ఇప్పుడు ఈ మిశ్రమంలో మ్యారినేట్ చేసి పెట్టుకొన్ని చికెన్ ముక్కలు, కుంకుమ పువ్వు, కేవర్ వాటర్ కూడా వేసి మరో 5నిముషాలు ప్రై చేసుకోవాలి .
6. ఇప్పుడు అందులో ఒక కప్పు నీళ్ళు పోసి మూత పెట్టి 20నిముషాల పాటు చికెన్ మెత్తబడే వరకూ ఉడికించుకోవాలి. చికెన్ ఉడికిందని తెలియగానే స్టౌ ఆఫ్ చేసి రోస్ట్ చేసి పెట్టుకొన్న బాదాంపలుకులతో గార్నిష్ చేయాలి. అంతే నవాబ్ ట్రీట్ చికెన్ రిజాలా రెడీ.

English summary

Chicken Rezala: A Nawabi Treat | చికెన్ రిజాలా - ఒక నవాబ్ ట్రీట్

Chicken rezala is a special chicken recipe that hails from the classic city of Kolkata. This delicious chicken recipe came to the city with the bawarchies of the exiled Nawab of Lucknow. This royal dish is simply magical with its delicious aroma, texture and lip-smacking taste.
Story first published: Thursday, May 16, 2013, 16:27 [IST]
Desktop Bottom Promotion