For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఉల్లిపాయ లేని చికెన్ టమోటో గ్రేవీ-సూపర్ టేస్ట్

|

ఉల్లిపాయలు మన ఇండియన్ ఫుడ్స్ ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి. అటువంటి ఉల్లిపాయలు ప్రస్తుతం మార్కెట్లో బగారంతో పాటు ఉల్లిపాయల ధరలు కూడా భగ్గుమంటున్నాయి. ఉల్లిపాయలు తరగకుండానే కళ్ళల్లో నీళ్ళు పెట్టిస్తున్నాయి. ఉల్లిపాయలు సామాన్య ప్రజలు కొనడానికే భయపడుతున్నారు. ఇంత ధరల్లో కొంత మందైతే ఉల్లిపాయను వాడకాన్ని మానేసారు. మన ఇండియన్ వంటకాల్లో ముఖ్యంగా ఉల్లిపాయ లేని కర్రీలే ఉండవు. ముఖ్యంగా సలాడ్స్, గ్రేవీ, సైడ్ డిష్ లకు ఉల్లిపాయ తప్పనిసరి.

కానీ, మన ఇండియన్ వంటలు ఉల్లిపాయ లేకుండా కూడా కొన్ని వంటలను రుచికరంగా వండవచ్చు . అటువంటి వంటల్లో ఇక్కడ ఒక ప్రత్యేకమైన రుచికరమైన చికెన్ టమోటో గ్రేవీని మీకోసం అంధిస్తున్నాం. ఇది తయారు చేయడానికి చాలా సులభం మరియు త్వరగా తయారు చేయవచ్చు. చికెన్ మ్యారినేట్ చేసి పెట్టుకొంటే వండటం చాలా తేలికవుతుంది. మరియు టమోటో గుజ్జును కలపడం వల్ల మరింత టేస్ట్ వస్తుంది. మరి చికెన్ లవర్స్ కోసం ఉల్లిపాయ లేని చికెన్ రుచిచూడాలంటే ఇక సారి ఈ వంటను ట్రై చేయండి..

Chicken In Tomato Gravy

కావల్సిన పదార్థాలు:
చికెన్: 1kg(మీడియం సైజ్ లో కట్ చేసుకోవాలి)
పెరుగు: 1cup
టమోటాలు: 5(గుజ్జు)
అల్లం-వెల్లుల్లి పేస్ట్: 2tbsp
పచ్చిమిరపకాయలు: 3
గసగసాలు: 2tbsp
పసుపు: 1tsp
నల్ల మిరియాలు పొడి: 1tsp
జీలకర్ర పొడి: 1tsp
కొత్తిమీర పొడి: 1tsp
గరం మసాలా పొడి: 1tsp
చక్కెర: ½tsp
ఉప్పు: రుచికి సరిపడా
నిమ్మరసం: 1tbsp
నూనె: 2tbsp
నీళ్ళు: 1cup
కొత్తిమీర: 2tbsp(గార్నిష్ కోసం సన్నగా తరిగిపెట్టుకోవాలి)

తయారు చేయు విధానం:
1. ముందుగా చికెన్ ముక్కలను నీళ్ళలోవేసి శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి.

2. తర్వాత ఈ చికెన్ ముక్కలను నిమ్మరసం, పెరుగు, ఉప్పు, అల్లం, వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా మిక్స్(మ్యారినేట్ )చేసి ఒక గంట పాటు పక్కన పెట్టుకోవాలి.

3. అంతలోపు గసగసాలను మరయిు పచ్చిమిర్చి మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి.

4. ఒక గంట తర్వాత డీప్ బాటమ్ పాన్ లో నూనె వేసి, వేడయ్యా అందుో ఒక చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒక నిముషం మీడియం మంట మీద వేగించుకోవాలి.

5. తర్వాత ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకొన్న చికెన్ ముక్కలను అందులో వేసి మరో పది నిముషాలు మీడియం మంట మీద ఫ్రై చేసుకోవాలి.

6. తర్వాత అందులోనే టమోటో గుజ్జు, ఉప్పు, పసుపు వేసి మరో 15నిముషాలు వేగించుకోవాలి

7. ఇప్పుడు అందులో జీలకర్రపొడి, ధనియాలపొడి, మిరియాలపొడి, పంచదార, గసగసాల పేస్ట్ వేసి5నిముషాలు ఫ్రై చేస్తూ మిక్స్ చేయాలి.

8. తర్వాత సరిపడా నీళ్ళు పోసి, మూత పెట్టి తక్కువ మంట మీద 20నిముషాలు ఉడికించాలి. మద్యమద్యలో కలియబెడుతుండాలి.

9. ఒక సారి చికెన్ ఉడికిందని నిర్ధారించుకొన్న తరవ్ాత మూత తీసి గరం మసాలా వేసి బాగా మిక్స్ చేయాలి.

10. వెంటనే కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేసి స్టౌ ఆఫ్ చేసి వేడి వేడిగా సర్వ్ చేయాలి. అంతే చికెన్ టమోటో గ్రేవీ రిసిపి రెడీ. ఉల్లిపాయ ఉపయోగించకుండా వండిన ఈ చికెన్ గ్రేవీని వేడి వేడి అన్నంతో సర్వ్ చేయవచ్చు.

English summary

Chicken In Tomato Gravy: A Recipe Without Onions

The price of onions in India is touching new heights everyday. It has become extremely difficult for the common people to use onions lavishly in their food. Onion plays an important part in Indian food.
Story first published: Thursday, August 22, 2013, 17:13 [IST]
Desktop Bottom Promotion